Ad Code

టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ !


టీవీఎస్ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలైంది. భారత్ సహా విదేశాలలో మిలీనియల్స్, Gen Z జనాభాను లక్ష్యంగా చేసుకుని ప్రీమియం ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ టూ-వీలర్ ని కంపెనీ ఆవిష్కరించింది. రూ. 2.50 లక్షల ప్రారంభ ధరతో వచ్చింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం హై-పర్పార్మెన్స్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. 4.44kWh కేపాసిటీ ఎనర్జీని అందిస్తుంది, 2.6 సెకన్లలో గంటకు 0-40 కిలోమీటర్ల వేగాన్ని గరిష్టంగా 105kmph వేగంతో వస్తుంది. టీవీఎస్ మోటార్‌లో అంతర్గతంగా అభివృద్ధి చేసిన బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ పవర్ ప్లోను నిరంతరం మానిటరింగ్ చేయడం ద్వారా సెల్‌ సేఫ్ ఆపరేషన్, సుదీర్ఘ లైఫ్ టైమ్ అందిస్తుంది. 50 నిమిషాల్లో 0-50 శాతం (ఆప్షనల్ యాడ్-ఆన్ 3 kW ఫాస్ట్ ఛార్జర్) లేదా పోర్టబుల్ ఛార్జర్ 4 గంటల 30 నిమిషాల్లో (950W ఛార్జర్), 0-80 శాతం డెలివరీ చేయగల స్మార్ట్ X హోమ్ రాపిడ్ ఛార్జర్ ఆప్షన్‌ను కస్టమర్లు పొందవచ్చు. TVS X థ్రిల్-ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ. 2,49,990 (ఎక్స్-షోరూమ్ బెంగళూరు), పోర్టబుల్ 950W ఛార్జర్‌లతో రూ. 16,275 (GSTతో సహా), 3kW స్మార్ట్ X హోమ్ రాపిడ్ ఛార్జర్ కూడా అందుబాటులో ఉంటుందని దుబాయ్‌లో జరిగిన లాంచ్ ఈవెంట్‌లో కంపెనీ సీఈఓ కేఎన్ రాధాకృష్ణన్ తెలిపారు. TVS X స్కూటర్ బుకింగ్‌లు ఇప్పుడు కంపెనీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ముందుగా.. 15 నగరాల్లో డెలివరీలు నవంబర్ 2023 నుంచి దశల వారీగా ప్రారంభం అవుతాయని, మోడల్‌కు ప్రభుత్వ FAME ప్రోత్సాహకం వర్తించదని రాధాకృష్ణన్ అన్నారు. TVS మోటార్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ వేణు మాట్లాడుతూ.. 'మిలీనియల్స్, Gen Z వంటి కస్టమర్లను లక్ష్యంగా చేసుకున్నాం. హరిత, మరింత స్థిరమైన భవిష్యత్తు కోసం టెక్నాలజీ, ఆవిష్కరణలను ఉపయోగించుకోవడంలో అంకితభావం ఈ అద్భుతమైన స్కూటర్‌ను తీసుకువచ్చింది. సాధారణంగా మిలీనియల్స్ అంటే.. 1981 నుంచి 1996 మధ్య జన్మించిన వ్యక్తులు, అలాగే, 1996 నుంచి 2010 మధ్య జన్మించిన వారిని Gen Z (జనరేషన్ Z)గా సూచిస్తారు. ఎలక్ట్రిక్ టూ-వీలర్ మోడల్ ప్రపంచ పౌరుల కోసం రూపొందించింది. ప్రీమియం ఇంకా స్థిరమైన టెక్నాలజీతో అభివృద్ధి చెందిన మొబిలిటీ సొల్యూషన్‌ల వైపు మళ్లేందుకు సిద్ధంగా ఉందని వేణు చెప్పారు. కొత్త మోడల్ ఉత్పత్తి కోసం కంపెనీ మూలధన వ్యయంగా రూ.250 కోట్లు పెట్టుబడి పెట్టిందని ఆయన తెలిపారు. భారత మార్కెట్లో విక్రయించడంతో పాటు, బంగ్లాదేశ్, నేపాల్, యూరప్ లాటిన్ అమెరికాలకు కూడా మోడల్‌ను ఎగుమతి చేయడానికి కంపెనీ దృష్టి సారిస్తోందని తెలిపారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం 10.2-అంగుళాల HD+ TFT టచ్‌స్క్రీన్‌తో వస్తుంది. ఈ క్లాసులో ఇదే అతిపెద్దది, రైడర్‌కు నావిగేషన్, మ్యూజిక్, వీడియో ఆఫర్‌లు, గేమింగ్ ఆప్షన్లను అందిస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu