ఓలా అద్భుతమైన ఆఫర్స్, డీల్స్, డిస్కౌంట్స్ ప్రకటించింది. ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్‌లో ఉన్న అన్ని ఇ-స్కూటర్లకు ఈ ఆఫర్స్ వర్తిస్తాయి. ఇవన్నీ లిమిటెడ్ టైమ్ ఆఫర్స్ మాత్రమే. ఓలా ఎలక్ట్రిక్ అందిస్తున్న వివరాల ప్రకారం, కస్టమర్లు ఓలా ఎస్1 లైనప్‌లోని స్కూటర్లు కొంటే రూ. 19,500 లేదా అంతకంటే ఎక్కువ తగ్గింపును పొందవచ్చు. ఇది కాకుండా, కంపెనీ ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్స్, ఎక్స్‌టెండెడ్ వారంటీలపై 50 శాతం తగ్గింపు, జీరో ప్రాసెసింగ్ ఫీజ్, జీరో-కాస్ట్ ఈఎంఐ లాంటి పలు ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా అందిస్తోంది. ఓలా ఎస్1 లైనప్‌లో ఉన్న ఓలా ఎస్1 ప్రో, ఓలా ఎస్1 ఎయిర్, ఓలా ఎస్1ఎక్స్ మోడల్స్‌కు ఈ ఆఫర్స్ లభిస్తాయి. ఓలా ఎస్1 ప్రో ప్రారంభ ధర రూ.1.47 లక్షలు, ఓలా ఎస్1 ఎయిర్ ప్రారంభ ధర రూ.1.1 లక్షలు, ఓలా ఎస్1ఎక్స్ ప్రారంభ ధర రూ.89,999. ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలే. రాష్ట్రాలు, నగరాలను బట్టి ఈ ధరల్లో మార్పులు ఉండొచ్చు. సమీపంలో ఉన్న ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అన్ని ఎస్1 మోడల్స్ యజమానులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి, కంపెనీ బీటా వెర్షన్‌లో MoveOS 4.0 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వర్షన్ పరిమిత కస్టమర్లకు అందుబాటులో ఉంది. చివరి వర్షన్ అక్టోబర్ 2023లో విడుదలయ్యే అవకాశం ఉంది. లేటెస్ట్‌గా అప్‌డేట్ చేసిన సాఫ్ట్‌వేర్‌లో 20 పైగా కొత్త ఫీచర్స్ వస్తాయి. ఎలక్ట్రిక్ స్కూటర్‌ని సెగ్మెంట్‌లో మరింత అధునాతనంగా మార్చేందుకు ఈ అప్‌డేట్ ఉపయోగపడుతుంది. MoveOS 4.0 బీటా వర్షన్‌లో ఓలా మ్యాప్ కూడా ఉంటుంది. ఇది ప్రత్యేకంగా కంపెనీ రూపొందించిన మ్యాప్. టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను అందించడం ద్వారా రైడింగ్ సున్నితంగా, సులభంగా మారుతుంది.
ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్‌పై అదిరిపోయే ఆఫర్ !
0
September 20, 2023
Tags