టెక్నో ఫాంటమ్ వీ ఫ్లిప్ 5జీ విడుదల
Your Responsive Ads code (Google Ads)

టెక్నో ఫాంటమ్ వీ ఫ్లిప్ 5జీ విడుదల


దేశీయ మార్కెట్లోకి ఫోల్డబుల్ ఫోన్ టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 5జీని తీసుకొచ్చింది. తొలి ఫోల్డబుల్ ఫోన్ టెక్నో ఫాంటమ్ వి ఫోల్డ్ ఫోన్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించిన కంపెనీ రెండో ఫోల్డబుల్ ఫోన్ ను ఆవిష్కరించింది. వచ్చేనెల ఒకటో తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. దీని ధర కూడా రూ.50 వేల లోపే ఉండనుండటం విశేషం. టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 5జీ ఫోన్ 8GB+256GB స్టోరేజీతో వస్తుంది. ఐకానిక్ బ్లాక్, మిస్టిక్ డాన్ రంగులలో రానుంది. 6.9 Inches ఫుల్ HD+ ఫ్లెక్సిబుల్ AMOLED ఇన్నర్ డిస్‌ప్లేను ఇది కలిగి ఉండనుంది. సర్క్యూలర్ AMOLED డిస్‌ప్లే 1.32 Inchesతో వస్తుంది. ఇక్కడి నుంచే నేరుగా మెసెజెస్‌కు రిప్లయ్ కూడా ఇవ్వొచ్చు. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే మీడియాటెక్ 8050 ప్రాసెసర్ ఇచ్చారు. ఆండ్రాయిడ్ 13.5 వర్షన్ మీద పని చేస్తుందీ పోన్. ఇది రెండేండ్ల పాటు ఓఎస్ అప్ డేట్స్, మూడేండ్లు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది. దీనిలో వస్తున్న మరో అద్భుతమైన ఫీచర్ ఏంటంటే దీంట్లో ఉండే 8GB ర్యామ్‌ను రెట్టింపు స్థాయికి అంటే 16GB వరకు పెంచుకోవచ్చు. ఇక బ్యాటరీ కెపాసిటీ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4000mAh వస్తుంది. ఇక మనందరికి ఎంతో ముఖ్యమైన కెమెరా విషయానికి వస్తే 64-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, క్వాడ్ ఫ్లాష్ లైట్ యూనిట్‌తో 13-అంగుళాల మెగా పిక్సెల్ సెన్సర్ విత్ వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా లభిస్తుంది. ఇక సెల్ఫీల కోసం 32-మెగాపిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. 5జీతోపాటు వై-ఫై 6, ఎన్ఎఫ్సీ, బ్లూటూత్ 5.1 కనెక్టివిటీ కలిగి ఉంటుంది. క్లామ్‌షెల్ డిజైన్‌తో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy Z Flip సిరీస్ స్మార్ట్‌ఫోన్లతో పోటీపడనుంది. ఈ ఫోన్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫోల్డబుల్ ఫోన్ల కంటే తక్కువ ధరకే వస్తూ ఉండటంతో దీనిని కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog