Ad Code

ఏఐ ఇరువైపులా పదునైన కత్తి !


ఏఐ ఇరువైపులా పదునైన కత్తి వంటిదని, దీన్ని సురక్షితంగా వాడేందుకు ఏఐపై నియంత్రణ ఉండాలని ట్విట్టర్ అధిపతి మస్క్ సూచించారు. ఏఐని స్పోర్ట్స్‌తో పోలుస్తూ మనకు ఓ రిఫరీ ఉండటం కీలకమని పేర్కొన్నారు. ఆవిష్కరణ, భద్రతలకు మద్దతు ఇచ్చేలా అమెరికన్ కాంగ్రెస్ ఏఐపై అడుగులు వేయాలని అన్నారు. ఇది ఎదుగుతున్న టెక్నాలజీ అన్న మస్క్ దీన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగడం ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు. కంపెనీలు తీసుకునే చర్యలు సురక్షితంగా, సాధారణ ప్రజల ప్రయోజనాలను కాపాడేలా ఉండేలా రెగ్యులేటర్ వ్యవహరిస్తుందని మీడియాతో మాట్లాడుతూ మస్క్ వ్యాఖ్యానించారు. కాగా, ఏఐ నియంత్రణ కోసం పట్టుబడుతున్న టెక్ దిగ్గజ సీఈవోలు క్యాపిటల్ హిల్‌లో చట్టసభ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎలన్ మస్క్‌తో పాటు మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌, అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్‌, ఎన్‌విడియా సీఈవో జెన్సెన్ హుంగ్‌, మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్య నాదెళ్ల, ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ, మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో బిల్ గేట్స్‌, ఎఎఫ్ఎల్‌-సీఐఓ లేబర్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ లిజ్ షులర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu