Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Showing posts with label elan musk. Show all posts
Showing posts with label elan musk. Show all posts

Thursday, September 14, 2023

ఏఐ ఇరువైపులా పదునైన కత్తి !


ఏఐ ఇరువైపులా పదునైన కత్తి వంటిదని, దీన్ని సురక్షితంగా వాడేందుకు ఏఐపై నియంత్రణ ఉండాలని ట్విట్టర్ అధిపతి మస్క్ సూచించారు. ఏఐని స్పోర్ట్స్‌తో పోలుస్తూ మనకు ఓ రిఫరీ ఉండటం కీలకమని పేర్కొన్నారు. ఆవిష్కరణ, భద్రతలకు మద్దతు ఇచ్చేలా అమెరికన్ కాంగ్రెస్ ఏఐపై అడుగులు వేయాలని అన్నారు. ఇది ఎదుగుతున్న టెక్నాలజీ అన్న మస్క్ దీన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగడం ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు. కంపెనీలు తీసుకునే చర్యలు సురక్షితంగా, సాధారణ ప్రజల ప్రయోజనాలను కాపాడేలా ఉండేలా రెగ్యులేటర్ వ్యవహరిస్తుందని మీడియాతో మాట్లాడుతూ మస్క్ వ్యాఖ్యానించారు. కాగా, ఏఐ నియంత్రణ కోసం పట్టుబడుతున్న టెక్ దిగ్గజ సీఈవోలు క్యాపిటల్ హిల్‌లో చట్టసభ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎలన్ మస్క్‌తో పాటు మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌, అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్‌, ఎన్‌విడియా సీఈవో జెన్సెన్ హుంగ్‌, మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్య నాదెళ్ల, ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ, మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో బిల్ గేట్స్‌, ఎఎఫ్ఎల్‌-సీఐఓ లేబర్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ లిజ్ షులర్ తదితరులు పాల్గొన్నారు.

Thursday, August 10, 2023

ట్విటర్‌ పిట్టను అమ్మకానికి పెట్టిన ఎలాన్‌ మస్క్‌ !


ట్విటర్‌లోని పాత విలువైన జ్ఞాపకాలను మస్క్‌ వేలానికి పెట్టనున్నారు. వీటిలో ట్విటర్‌ ప్రధాన కార్యాలయంపై పిట్ట బొమ్మతో ఉన్న సైన్‌బోర్డ్‌ కూడా ఉండనుంది. ట్విటర్‌ను ఎక్స్ పేరిట రీబ్రాండ్‌ చేసిన కొన్ని రోజుల్లోనే మస్క్‌ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మొత్తం 584 లాట్లను వేలానికి తీసుకురానుండగా వీటిలో ట్విటర్ బర్డ్ కాఫీ టేబుల్, భారీ పంజరం, స్టూళ్లు, టేబుళ్లు, కుర్చీలు, సోఫాలు, రిఫ్రిజిరేటర్ల వంటి ఉపకరణాలు, సంగీత పరికరాలు, నియాన్ ట్విటర్ లోగో, హ్యాష్‌ట్యాగ్ గుర్తు వంటివి ఉన్నాయి. కాగా ఈ వేలానికి 'ట్విటర్‌ రీబ్రాండింగ్‌ : ఆన్‌లైన్‌ ఆక్షన్‌ ఫీచరింగ్‌ మెమోరాబిలియా, ఆర్ట్‌, ఆఫీస్‌ అసెట్స్‌ అండ్‌ మోర్‌' అని పేరుపెట్టారు. ఉపకరణాలు, వస్తువులతోపాటు ప్రముఖుల నుంచి వైరల్ అయిన వారి ఆయిల్ పెయింటింగ్‌లు కూడా అమ్మకానికి ఉన్నాయి. ఈ కళాకృతులలో చిరస్మరణీయమైన 2014 ఆస్కార్స్ ఎల్లెన్ డిజెనెరెస్ సెల్, సెలబ్రిటీ ట్రిబ్యూట్ ట్వీట్‌ల ఆకర్షణీయమైన ఫోటో మొజాయిక్ ఉన్నాయి. 2012 నవంబర్‌లో తిరిగి ఎన్నికైన తర్వాత అప్పటి అమెరికన్‌ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా చేసిన ట్వీట్‌కు సంబంధించిన చిత్రం కూడా ఇందులో ఉంది. ఈ ప్రత్యేక ట్వీట్ అప్పట్లో అత్యధిక లైక​్‌లు పొందిన ట్వీట్‌గా గుర్తింపు పొందింది. వేలం నిర్వహించే హెరిటేజ్ గ్లోబల్ పార్ట్‌నర్స్ ప్రకారం, ప్రతి లాట్‌కు ప్రారంభ బిడ్ 25 డాలర్లు. కొనుగోలుదారుల ప్రీమియం 19 శాతం, అమ్మకపు పన్ను 8.63 శాతం ఉంటుంది. ఈ వేలానికి సంబంధించిన బిడ్డింగ్ సెప్టెంబర్ 12న ప్రారంభమై 14వ తేదీ వరకు కొనసాగుతుంది. అయితే ట్విటర్‌ బర్డ్‌ లోగో శాన్‌ఫ్రాన్సిస్కోలోని స్ట్రీట్‌-10లో ఉన్న ట్విటర్‌ ప్రధాన కార్యాలయ భవనానికి ఇంకా అలాగే ఉంది. దీనిని గతంలో తొలగించాలని ప్రయత్నించినా.. శాన్‌ఫ్రాన్సిస్కో అధికారులు అడ్డుకొన్నారు. దీంతో ట్విటర్‌ హెడ్‌క్వార్టర్స్‌పై ఉన్న పిట్ట బొమ్మను వేలంలో కొనుగోలు చేసిన వ్యక్తే అధికారుల అనుమతి పొంది తరలించుకోవాలని వేలం వివరాల్లో పేర్కొన్నారు.

Wednesday, August 9, 2023

'ఎక్స్‌' లో లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్న కంటెంట్‌ క్రియేటర్లు


దేశీయ కంటెంట్ క్రియేటర్లు కూడా ఎక్స్‌ (ట్విటర్‌) ద్వారా భారీగానే ఆర్జిస్తున్నారు. ఎలాన్‌ మాస్క్‌ ఇటీవల తీసుకొచ్చిన కొత్త ఫీచర్‌ ద్వారా కంటెంట్ క్రియేటర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు లాభదాయకంగా ఉంది. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను సోషల్‌ మీడియాలో తెగ షేర్‌ చేస్తున్నారు. యాడ్‌-రెవన్యూ షేర్‌ ఫీచర్‌పై ట్వీపుల్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంప్రెషన్‌ల వల్ల సుమారు 2.1 లక్షలు సంపాదించానంటూ @గబ్బర్‌సింగ్ హ్యాండిల్‌ యూజర్‌ అభిషేక్ అస్థానా, స్క్రీన్ షాట్‌ను పంచుకున్నారు. ''బ్లూ టిక్ కే పైసే వసూల్'' అంటూ కమెంట్‌ చేశారు. ట్విటర్‌ స్ట్రాటజీ చాలా సింపుల్‌. ఈ వ్యూహంతో భారీగా సంపాదించిన ఇన్‌ఫ్లుయెన్సర్లే బ్లూ టిక్ సేల్స్‌మెన్‌గా మారతారు. ఇదే నిజమైన ఆదాయ వనరు అని పేర్కొన్నారు. 'మైథున్' అనే వినియోగదారు తన బ్యాంక్ ఖాతాలో రూ. 3,51,000 జమ అయ్యాయంటూ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. 455.75 డాలర్లు వచ్చాయి. గత 3 నెలల్లో దాదాపు 17మిలియన్ల ఇంప్రెషన్లు, 25కే ఫాలోవర్లు ఉన్నారంటూ మరొక యూజర్‌ తెలిపారు. బెంచ్‌మార్క్ సాధించాలంటే ఏం కావాలో తెలిపారు. కాగా ఎంపిక చేసిన కంటెంట్ సృష్టికర్తలు వారి ప్రత్యుత్తరాలలో వచ్చే ప్రకటనల నుండి వచ్చే ఆదాయంలో వాటాను పొందవచ్చు. ఎక్స్‌ ప్రకటనల రాబడి భాగస్వామ్యానికి అర్హత పొందాలంటే, వెరిఫైడ్ క్రియేటర్‌లు గత 3 నెలల్లో వారి పోస్ట్‌లపై కనీసం 5 మిలియన్ ఇంప్రెషన్‌లు కలిగి ఉండాలి. వెరిఫైడ్ క్రియేటర్లకు వారి కంటెంట్ రిప్లై సెక్షన్‌లో యాడ్స్ వస్తాయని ఎలాన్ మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదటి పేమెంట్ల కోసం 5 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 41.2 కోట్లు చెల్లించనున్నట్లు తెలిపారు. 

Saturday, August 5, 2023

ట్విట్టర్‌లో లైవ్‌ వీడియోతో పాటు ఆ ఫీచర్లు ఒకేసారి విడుదల !


X(ట్విట్టర్‌)లో లైవ్‌ వీడియో ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆ కంపెనీ యజమాని ఎలాన్‌ మస్క్‌ ట్వీట్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కెమెరా బొమ్మను, లైవ్‌ బటన్‌ను నొక్కి పోస్టు చేయవచ్చని తెలిపారు. బ్లూటిక్‌ను దాచిపెట్టే (హైడ్‌) సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా ప్రొఫైల్‌, పోస్టులను దాచి పెట్టొచ్చు. క్రియేటర్లు అనుమతిస్తే క్లిప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొనే సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చినట్టు మస్క్‌ తెలిపారు.

Sunday, July 2, 2023

ట్విట్టర్ యూజర్లకు కొత్త రూల్స్ !


లెన్ మాస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత రోజుకో కొత్త రూల్స్ తీసుకు వస్తున్నాడు. ఈ సారి ఎక్కువ మంది వైరిఫై అకౌంట్లు తీసుకునేలా కొత్త రూల్ ప్రవేశపెట్టాడు. సాధారణంగా ట్విట్టర్ ని చూడాలంటే అకౌంట్ ద్వారా తప్పకుండా లాగిన్ కావాల్సి ఉంటుంది. గతంలో ట్విట్టర్ లాగిన్ కాకపోయినా లింక్ ను బ్రౌజర్ లో ఓపెన్ చేసి చూసుకునే వీలు ఉండేది. కానీ ఇప్పుడు ఆ సౌకర్యాన్ని నిలిపివేశారు. అల్ రెడీ లాగిన్ ఉన్నవారు మాత్రమే చూడగలరు.. లేని వారు తప్పనిసరి ట్విట్ర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిందే. అంతేకాదు ట్విట్టర్ యూజర్లు ప్రతిరోజూ చదివే పోస్ట్ ల సంఖ్యను కూడా పరిమితం చేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం ట్విట్టర్ యూజర్లు సర్వర్ డౌన్ అయినట్లుగా పెద్ద సంఖ్యలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక పరిమితులు వర్తిస్తాయి అని.. ఇటీవల ట్విటర్‌ నుంచి భారీ ఎత్తున డేటా చోరీ అవుతుందని దాన్ని అరికట్టేందుకే ఈ చర్యలు తీసుకున్నామని మస్క్‌ చెబుతున్నారు. కొన్ని అసౌకర్యమైన ఇబ్బందులను నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకున్నాట్లు ట్వీట్‌ చేశాడు. 'ఇక నుంచి వెరిఫై అకౌంట్ యూజర్లు 10వేల పోస్టులు మాత్రమే చూడగలరు. అన్ వెరిఫైడ్ యూజర్లు 1000 పోస్టులు మాత్రమే.. ఇక కొత్తగా ట్విట్టర్ యూజర్లు కేవలం 500 ట్విట్లు మాత్రమే చూడవొచ్చ' అని ట్వీట్ చేశారు. మొదట వెరిఫైడ్ ఖాతాదారులకు 6000, ఆన్ వెరిఫైడ్ వారికి 600, కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసిన వారికి 300 పోస్టుల లిమిట్ పెట్టిన ఎలన్ మాస్క్ కొన్ని గంటల తర్వాత తన నిర్ణయాన్ని సవరిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్ చేశారు. ఇప్పటికే ట్విట్టర్ ఆదాయాన్ని మరింత పెంచేందుకు బ్లూటిక్ కోసం సబ్‌స్క్రిప్షన్ ఎలెన్ మాస్క్ పాలసీని తీసుకు వచ్చాడు. https://t.me/offerbazaramzon

Wednesday, April 26, 2023

ట్విటర్ అకౌంట్‎ తో కోట్లు సంపాదిస్తున్న ఎలాన్ మస్క్ !


ట్విటర్ ‎లో బ్లూ టిక్‎కు ఛార్జీలను సేకరించడం ప్రారంభించిన మస్క్ రీసెంట్‏గా యూజర్లు కంటెంట్ ‎తో డబ్బు సంపాదించుకునే వీలుగా మానిటైజేషన్ ఆప్షన్ ‎ను ఎలాన్ మస్క్ ప్రవేశపెట్టారు. క్రియేటివ్ కంటెంట్ ‎తో తీసే చిన్న చిన్న వీడియోలతో పాటు ఎక్కువ నిడివి కలిగిన వీడియోలను పోస్ట్ చేసి సబ్‎స్క్రిప్షన్స్ ఆధారంగా డబ్బులు సంపాదించే అవకాశం కల్పించారు. ఈ ఆప్షన్ గురించి మస్క్ తెలుపుతూ తాజాగా ఓ స్క్రీన్ షాట్ ‎ను షేర్ చేశారు. తన అకౌంట్ ద్వారా యూజర్లు మానిటైజేషన్ పీచర్‏ను ఎలా వినియోగించాలో చెప్పారు. ఆ క్రమంలో ఎలాన్ తన అకౌంట్‌ ఫాలోవర్లు, సబ్‌స్క్రైబర్ల సంఖ్యను రివీల్‌ చేశారు. మస్క్‌ ట్విటర్‌ ఖాతాకు 24,700 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అమెరికాలో ట్విటర్ సబ్‎స్క్రిప్షన్ ధర నెలకు 5 డాలర్లుగా ఉంది. ట్విటర్ రెవెన్యూ, యాపిల్ ఇన్ యాప్‌ పర్చేజ్‌ పోనూ ఒక్కో సబ్‌స్క్రైబర్‌ నుంచి 3.39 డాలర్లు చొప్పున కంటెంట్‌ క్రియేటర్‌కు ట్విటర్‌ చెల్లిస్తుంది. ఆ లెక్కన చూసుకుంటే మస్క్‌ తన అకౌంట్ ద్వారా ఏడాదికి కోట్లు సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం మస్క్ ట్విటర్ అకౌంట్‎లో 24,700 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఒక్కో సబ్‌స్క్రైబర్‌ నుంచి నెలకు రూ.277 మస్క్‌కు వస్తుంది. అంటే నెలకు రూ.68,42,000 వస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే ఏడాదికి మస్క్ తన ఖాతా ద్వారా రూ.8.2 కోట్లు సంపాదిస్తున్నాడన్నమాట.

Tuesday, April 4, 2023

పిట్ట స్థానంలో కుక్క లోగో !


టెస్లా, ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ఎక్స్ అధినేత, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిన తరువాత ట్విట్టర్‌లో పలు మార్పులు చోటు చేసుకుంటూ వస్తోన్నాయి. వాటికి అంతు అనేదే ఉండట్లేదు. ట్విట్టర్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా బాధ్యతలను స్వీకరించిన తొలి రోజు నుంచే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టిన ఎలాన్ మస్క్.. అందులో పెను సంస్కరణలకు తెర తీశారు. ఆ పరంపరను ఇంకా కొనసాగిస్తోన్నారు. తాజాగా ఈ టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ లోగోను మార్చేశారు. బ్లూ బర్డ్ స్థానంలో కుక్క ఇమేజ్‌ను ఇంట్రడ్యూస్ చేశారు. క్రిప్టోకరెన్సీలో ఒకటైన డోజ్‌కాయిన్‌ లోగోగా వినియోగించే శునకం ఫొటో అది. సాధారణంగా నెటిజన్లు మీమ్స్ సృష్టించడానికి ఈ డోజ్‌కాయిన్ డాగ్ ఫొటోను వాడుతుంటారు. ఇప్పుడదే ట్విట్టర్ లోగోగా మారింది. యూజర్లు తమ ట్విట్టర్ అకౌంట్‌ను ఓపెన్ చేసి, రీఫ్రెష్ చేయగానే కొత్త లోగో దర్శనం ఇస్తోందిప్పుడు. ప్రస్తుతానికి వెబ్‌వర్షన్‌కు మాత్రమే ట్విట్టర్ లోగో ఛేంజ్ అయింది. దశలవారీగా అన్ని వర్షన్‌లకూ ఇది అమలవుతుంది. డోజ్ కాయిన్ లోగోగా షిబా ఇను అనే జాగిలం ఫొటోను వినియోగిస్తోన్నారు. 2013 నుంచీ ఇదే లోగో కొనసాగుతోంది. షిబా ఇను అనేది హంటింగ్ బ్రీడ్‌. జపాన్‌కు చెందిన హంటింగ్ బ్రీడ్ జాగిలం ఇది. నెటిజన్లు, సోషల్ మీడియా యూజర్లకు.. ఈ షిబా ఇను జాగిలం మీమ్స్ చిరపరిచితమే. అది నచ్చడం వల్లే తాను కూడా ట్విట్టర్ బ్లూబర్డ్ లోగోకు బదులుగా డోజ్ కాయిన్ షిబా ఇను డాగ్ ఫొటోను వాడినట్లు ఎలాన్ మస్క్ చెప్పుకొచ్చాడు. ఇదివరకు కూడా ఇదే డోజ్ కాయిన్ డాగ్ లోగోను ఒకట్రెండు సందర్భాల్లో ఎలాన్ మస్క్ వినియోగించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కుర్చీలో డోజ్ కాయిన్ డాగ్ మీమ్‌ను ఉంచి కొత్త సీఈఓ వచ్చాడంటూ ప్రచారం చేశారాయన. ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి ముందు 258 బిలియన్ డాలర్ల మేర న్యాయపరమైన వివాదాలను కూడా డోజ్ కాయిన్ క్రిప్టొకరెన్సీ నుంచి ఎదుర్కొన్నారు. ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తరువాత అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు ఎలాన్ మస్క్. ట్విట్టర్ కొత్త పాలసీని ప్రకటించారు. ట్విట్టర్ వినియోగదారులకు వాక్ స్వాతంత్ర్యం ఉందని, ఎలాంటి పోస్టులనైనా పెట్టొచ్చని పేర్కొన్న ఆయన నెగెటివ్ పోస్టులకు మాత్రం రీచ్ ఉండబోదని తేల్చి చెప్పారు. నెగెటివిటీ/హేట్ స్పీచ్ వంటి పోస్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమోట్ చేయబోమని స్పష్టం చేశారు. నెగెటివిటీని విస్తరింపజేసే పోస్టులను గుర్తించడానికి ప్రత్యేక వ్యవస్థ ఉందని చెప్పారు. 

Wednesday, March 8, 2023

బాత్రూంకెళ్ళినా బాడీగార్డులు !


ట్విటర్‌ ప్రధాన కార్యాలయంలో ఇటీవలి పరిస్థితులు దారుణంగా మారాయని సంస్థ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త యజమాని ఎలాన్‌ మస్క్‌ ఆఫీసుకు వచ్చిన సమయంలో భారీ భద్రత ఉంటుందని, చివరకు ఆయన బాత్రూంకు వెళ్లినా ఇద్దరు బాడీగార్డులు వెంట ఉంటున్నారనీ అంటున్నారు. ట్విటర్‌ను సొంతం చేసుకున్నాక భారీస్థాయిలో ఉద్యోగుల తొలగింపు, కార్యాలయాల్లో వస్తువుల అమ్మకం వంటి పలు మార్పులు తెచ్చిన ఎలాన్‌ మస్క్‌ వాటిని కొనసాగిస్తున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని కేంద్ర కార్యాలయంతోపాటు చాలా దేశాల్లో ఉన్న ఉద్యోగులను ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే తొలగించారు. మస్క్‌ అనూహ్య నిర్ణయాలతో ఆ సంస్థ ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆయనకు ఉద్యోగుల పట్ల విశ్వాసం తక్కువని.. అందుకే ఆఫీసులో తిరిగే సమయంలోనూ భయంతో బాడీగార్డులను వెంటపెట్టుకొని ఉంటారని ఆ సంస్థలో పనిచేసే ఓ ఇంజినీరు వెల్లడించారు.

Friday, January 13, 2023

టెస్లా షేరు 70% కుదేలు !


మైక్రోబ్లాగింగ్‌ సైటు ట్విటర్‌ను కొనడంతోనే అటు టెస్లాకు ఇటు మస్క్ కు కష్టాలు వచ్చాయనే అభిప్రాయాలు ఉన్నాయి. ట్విటర్‌ను 44 బిలియన్‌ డాలర్లకు కొంటానంటూ గతేడాది ఏప్రిల్‌లో ప్రకటించిన మస్క్,  ఊగిసలాట తర్వాత అక్టోబర్‌లో ఎట్టకేలకు కొన్నారు. డీల్‌ గురించి ప్రకటించిన దగ్గర నుంచి ఆయన 23 బిలియన్‌ డాలర్ల విలువ చేసే టెస్లా షేర్లను అమ్మేశారు. ట్విటర్‌ను కొన్నప్పటి నుంచి గరిష్టంగా దానికే సమయాన్ని వెచ్చిస్తున్నారని, టెస్లాను పట్టించుకోవడం లేదనే అభిప్రాయంతో మిగతా షేర్‌హోల్డర్లూ అదే బాట పట్టారు. ఇవన్నీ కంపెనీ షేరుపై ప్రతికూల ప్రభావం చూపాయన్న అభిప్రాయం ఉంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, ప్రత్యర్థి సంస్థల నుంచి పోటీ కారణంగా టెస్లా కార్లకు డిమాండ్‌ బలహీనపడుతోంది. కంపెనీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా టెస్లా తొలిసారిగా డిస్కౌంట్లు ఆఫర్‌ చేయడం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ముందు 3,750 డాలర్ల డిస్కౌంటు ఇస్తామని ప్రకటించిన టెస్లా, మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఆ తర్వాత దాన్ని ఏకంగా 7,500 డాలర్లకు పెంచింది. ఎలక్ట్రిక్‌ వాహనాల విభాగంలో పోటీ పెరుగుతున్న క్రమంలో కీలకమైన చైనా, అమెరికా మార్కెట్లలో డిమాండ్‌ బలహీనపడుతుండటం టెస్లాకు అర్థమవుతోంది కాబట్టే ఇలా డిస్కౌంట్ల బాట పడుతోందని పరిశీలకులు చెబుతున్నారు. ఇదే కాకుండా అమెరికా ఎకానమీ ఈ ఏడాది మాంద్యంలోకి జారుకుంటుందని, కార్లకు డిమాండ్‌ పడిపోతుందని వస్తున్న వార్తలూ టెస్లాకు ప్రతికూలంగా ఉంటున్నాయి. అంతేకాకుండా ఫోక్స్‌వ్యాగన్, ఫోర్డ్, జీఎం, హ్యుందాయ్‌ వంటి దిగ్గజాలు బిలియన్ల కొద్దీ డాలర్లు ఇన్వెస్ట్‌ చేస్తూ టెస్లాకు దీటుగా కొత్త ఎలక్ట్రిక్‌ వాహనాలను దింపేందుకు కసరత్తు చేస్తుండటమూ కంపెనీకి సవాలుగా మారుతోంది. కీలకమైన అమెరికా ఈవీ మార్కెట్లో టెస్లా వాటా 2020లో 79% కాగా గతేడాది తొలి 9 నెలల్లో 65%కి పడిపోయింది. 2025 నాటికి ఇది 20% దిగువకు పడిపోవచ్చని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ మొబిలిటీ అంచనా. అమ్మకాలు అంతంతే అయినా అసాధారణంగా ట్రిలియన్‌ డాలర్ల వేల్యుయేషన్‌తో ట్రేడ్‌ అవడం టెస్లాకు క్రమంగా ప్రతికూలంగా మారింది. ఒక దశలో టెస్లా వేల్యుయేషన్‌.. ప్రపంచంలోనే టాప్‌ 12 భారీ ఆటో దిగ్గజాలన్నింటినీ మించి పలికింది. కానీ వాటి అమ్మకాలతో పోలిస్తే టెస్లా విక్రయాలు తూగడం లేదు. ఇదంతా మార్కెట్‌కు అవగతమయ్యే కొద్దీ కంపెనీ వేల్యుయేషన్‌ ట్రిలియన్‌ డాలర్ల నుంచి ప్రస్తుతం దాదాపు 400 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. అంతే గాకుండా మస్క్‌ చెప్పే దానికి చేసే దానికి పొంతన ఉండకపోతుండటం కూడా ఇన్వెస్టర్లలో అపనమ్మకం కలిగిస్తోంది. ఏదేదో చేసేస్తున్నానంటూ ఆర్భాటంగా ప్రకటనలు చేసే మస్క్‌, వాటిని ఆచరణలో మాత్రం చూపడం లేదంటూ విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు దాదాపు నాలుగేళ్ల క్రితం ఆవిష్కరించిన సైబర్‌ట్రక్‌ ఉత్పత్తి 2021లో మొదలుపెడతామని మస్క్‌ చెప్పినప్పటికీ ఈ ఏడాది వరకూ వాయిదా పడుతూ వచ్చింది. 2024లో గానీ పూర్తి స్థాయిలో తయారీ పుంజుకోదు. ఫోర్డ్, రివియన్‌ లాంటి కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రిక్‌ పికప్‌లను అమ్మేస్తుండగా టెస్లా ఎప్పటికి పుంజుకుంటుందనేది సందేహంగా మారింది.

Sunday, January 1, 2023

ఆ హతవిధీ.... !


ట్విటర్‌ కొనుగోలు నేపథ్యంలో ఎలన్‌ మస్క్‌కు బ్యాడ్‌ టైం నడుస్తున్నట్లు ఉంది. 2022 ఎలన్‌ మస్క్‌కు ఏ రకంగానూ కలిసి రాలేదు. ఈ ఏడాదిలో చెప్పుకోదగ్గ పరిణామాలేవీ ఆయన ఖాతాలో పడకపోవడం గమనార్హం. పైగా ఫోర్బ్స్‌ లిస్ట్‌ ప్రకారం ప్రపంచ అపర కుబేరుల జాబితా నుంచి రెండో స్థానానికి పడిపోయారు. ఏడాది చివరకల్లా ఆయన సంపద 150 బిలియన్‌ డాలర్లకు దిగువకు పడిపోయింది. ఒకానొక దశలో 137 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. చరిత్రలో తొలి ట్రిలియన్‌ బిలియనీర్‌గా నిలిచిన ఘనత ఎలన్‌ మస్క్‌దే. నవంబర్‌ 4, 2021 నాటికి ఆయన సంపద అక్షరాల 340 బిలియన్‌ డాలర్లు. కానీ, ఆ మార్క్‌ను ఆయన ఎంతో కాలం నిలబెట్టుకోలేకపోయాడు!. ఎలన్‌ మస్క్‌ సంపద తరుగుతూ వస్తోంది. మరోవైపు ట్విటర్‌ను 44 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసినా ఆయన సంపదపై ఆ ప్రభావం పడదని ఆర్థిక విశ్లేషకులు భావించారు. కానీ, అ అంచనా తప్పింది. టెస్లా షేర్లు గణనీయంగా, క్రమం తప్పకుండా పతనం అవుతుండడం ఆయన సంపద కరిగిపోవడానికి ప్రధాన కారణంగా మారింది. అయితే ఎలన్‌ మస్క్‌ మాత్రం టెస్లా అద్భుతంగా పని చేస్తోందని, అది అంతకు ముందు కంటే అద్భుతంగా ఉందంటూ డిసెంబర్‌ 16వ తేదీన ఒక ట్వీట్‌ చేశాడు. గణాంకాలు మాత్రం విశ్లేషకుల అంచనాలకు తగ్గట్లే ఉన్నాయి. మిగతా సొంత కంపెనీలతో(న్యూరాలింక్‌, ఓపెన్‌ ఏఐ, స్పేస్‌ఎక్స్‌) దీని అనుబంధ సంస్థ స్టార్‌లింక్‌, ది బోరింగ్‌ కంపెనీలతో ఎలన్‌ మస్క్‌కు పెద్దగా ఒరిగింది కూడా ఏం లేకపోవడం గమనార్హం!. ఫోర్బ్స్‌ లిస్ట్‌లో ఫ్రెంచ్‌ వ్యాపారవేత్త బెర్నార్డ్‌ అర్నాల్ట్‌ & ఫ్యామిలీ 179 బిలియన్‌ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానంలో ఎలన్‌ మస్క్‌ 146 బిలియన్‌ డాలర్లత సంపదతో నిలిచారు. అంటే ఏడాది కాలంలోనే ఏకంగా 200 బిలియన్‌ డాలర్ల సంపదను ఆయన కోల్పోయారన్నమాట. మానవ చరిత్రలో ఇప్పటిదాకా ఇంతలా ఓ వ్యక్తి సంపదను కోల్పోయిందే లేదు.

Popular Posts