కియా మోటార్స్ నుంచి రెండు ఎలక్ట్రిక్ కార్ల విడుదల
Your Responsive Ads code (Google Ads)

కియా మోటార్స్ నుంచి రెండు ఎలక్ట్రిక్ కార్ల విడుదల


కియా మోటార్స్ రెండు ఎలక్ట్రిక్ కార్లను తాజాగా విడుదల చేసింది. EV3 కాంపాక్ట్ SUV, EV4 సెడాన్ అనే రెండు ఎలక్ట్రిక్ కార్ల కాన్సెప్ట్ మోడల్ ను విడుదల చేసింది. వీటితో పాటు రూపొందించిన EV 5 తొందరలోనే విడుదల కానుంది. అయితే EV5 మొదట భారతదేశంలో విడుదల కావచ్చని అంచనా. EV 4 డిజైన్ చాలా ఆధునికంగా ఉంటుంది. దీని ముందు భాగం కియా EV6 ను పోలి ఉంటుంది. దీనిలో సన్నని గ్రిల్, కియా టైగర్ నోస్ హెడ్ లైట్ సెటప్ ఉంటాయి. ఇందులో ఉన్న పొడగించిన రేర్ ఎండ్, త్రికోణాకార అల్లాయ్ వీల్స్ సైన్స్ ఫిక్షన్ సినిమాను గుర్తుచేస్తాయి. వెనుక నుంచి చూస్తే సింపుల్ గా, ఫ్లాట్ గా కనిపిస్తుంది. దీని క్యాబిన్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఇది కాన్సెప్ట్ మోడల్ అని మీరు సులభంగా చెప్పవచ్చు. దీని క్యాబిన్ ప్రకాశవంతమైన రంగు, దీర్ఘచతురస్రాకార స్టీరింగ్ వీల్, డ్యూయల్ ఇంటిగ్రేటెడ్ డిస్ప్లే సెటప్ను కలిగి ఉంది. మరింత సింపుల్ లుక్ కోసం, కియా మోటార్స్ ఫ్లాట్ సెంటర్ కన్సోల్ తో సాదా వైట్ సీట్లను ఇచ్చింది. EV3 గురించి మాట్లాడుకుంటే.. దీని డిజైన్ EV4 నుంచి ప్రేరణ పొందింది. అయినప్పటికీ దాని మొత్తం డిజైన్ కు కొన్ని నవీకరణలు చేశారు. ముందు భాగంలో EV4 మాదిరిగానే డిజైన్ ఉన్నప్టపికీ మరింత పెద్దగా కనిపిస్తుంది. సైడ్ లో వీల్ ఆర్చ్, డోర్ క్లాడింగ్, స్టైలిష్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వెనుక వైపు కియా EV3 ఫ్లాట్ గా ఉంటుంది. అలాగే పెద్ద టెయిల్ లైట్ సెటప్, పెద్ద స్కిడ్ ప్లేట్ ఉంటాయి. దీని క్యాబిన్ కూడా EV4ను పోలి ఉంటుంది. ఇది EV4 మాదిరిగానే డ్యాష్ బోర్డ్, స్టీరింగ్ వీల్. డిస్ ప్లే సెటప్ ను కలిగి ఉంది. అయితే సెంటర్ కన్సోల్ లో లేయర్డ్ డిజైన్ ఉంటుంది. క్యాబిన్ గ్రే, గ్రీన్ కలర్ థీమ్ లో ఉంటుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog