ప్యూర్ ఈవీ కంపెనీ ఇప్లూటో 7జీ మ్యాక్స్, ఇప్లూటో 7జీ ప్రో పేరుతో బ్లాక్, రెడ్, గ్రే, వైట్ కలర్ లో రెండు స్కూటర్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. 7జీ మ్యాక్స్ టాప్ స్పీడ్ గంటకి 60 కిలోమీటర్లు, 7జీ ప్రో టాప్ స్పీడ్ గంటకు 60 కిలోమీటర్లు. 7జీ మ్యాక్స్ బ్యాటరీని ఒకసారి ఫుల్లుగా ఛార్జ్ చేస్తే, 150 నుంచి 201 కిలోమీటర్లు వెళ్తుందని కంపెనీ తెలిపింది. 7జీ ప్రో బ్యాటరీని ఒకసారి ఫుల్లుగా ఛార్జ్ చేస్తే, 100 నుంచి 150 కిలోమీటర్లు వెళ్తుందని కంపెనీ వివరించింది. 7జీ మ్యాక్స్‌లో స్మార్ట్ BMSతో కూడిన 3.5KWH లిథియం అయాన్ బ్యాటరీ ఉండగా... 7జీ ప్రోలో స్మార్ట్ BMSతో కూడిన 3 KWH లిథియం అయాన్ బ్యాటరీ ఉంది. రెండు స్కూటర్లకూ స్మార్ట్ BMS, మొబైల్ యాప్ కనెక్టివిటీ, బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్నాయి. 7జీ మ్యాక్స్‌లో 7 మైక్రో కంట్రోలర్స్ ఉండగా.. 7జీ ప్రోలో 4 మైక్రో కంట్రోలర్స్ ఉన్నాయి. ఈ స్కూటర్లలో హిల్‌స్టార్ట్ అసిస్ట్, డౌన్ హిల్ అసిస్ట్, కోస్టీరింగ్ రీజన్, రివర్స్ మోడ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. 7జీ మ్యాక్స్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1,14,999 ఉండగా, 7జీ ప్రో ఎక్స్‌షోరూమ్ ధర రూ.99,999గా ఉంది. ఈ రెండు స్కూటర్లనూ కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చని తెలిపింది. రోజూ దాదాపు 100 కిలోమీటర్లకు పైగా జర్నీ చేయాలనుకునేవారికి తమ స్కూటర్లు బాగా పనికొస్తాయని కంపెనీ తెలిపింది. పండుగల సీజన్లో కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని కంపెనీ ఆశిస్తోంది.
ప్యూర్ ఈవీ కంపెనీ నుంచి రెండు స్కూటర్ల విడుదల
0
October 07, 2023
Tags