దేశీయ మార్కెట్లో తైవాన్‌కు చెందిన ప్రముఖ హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఏసర్ ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి అడుగు పెట్టింది. MUVI 125 4G పేరుతో మొదటి ఈ-స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 99,999 (ఎక్స్-షోరూమ్). దీనిని తయారు చేసింది ముంబైకి చెందిన ఈవీ స్టార్టప్ థింక్ ఈబైక్‌గో. ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి ఏసర్ అడుగుపెట్టడంతో ఇప్పటికే ఆ రంగంలో ఉన్న ఓలా, ఏథర్ వంటి కంపెనీలకు గట్టిపోటీ ఎదురుకానుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ 80 కిలోమీటర్లు, గరిష్ట వేగం 75 kmph, ఛార్జింగ్ కోసం స్వాప్ చేయగల బ్యాటరీ, తేలికపాటి ఛాసిస్, 16-అంగుళాల చక్రాలు, కాంపాక్ట్ డిజైన్, డబుల్ డిస్క్ బ్రేక్స్ కలిగి వుంది. ఇది మార్చుకోదగిన (స్వాపింగ్) బ్యాటరీలతో వస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీలకు అర్హత పొందుతుందని కంపెనీ ధ్రువీకరించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ప్రీ-బుకింగ్‌లు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రీ-బుకింగ్‌లు, డీలర్‌షిప్‌పై ఆసక్తి ఉన్నవారు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ఏసర్ MUVI 125 4G ఈ-స్కూటర్ విడుదల
0
October 16, 2023
Tags