Ad Code

రూ.55 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్ !


జాజ్ ఆటో తయారు చేసిన యూలు విన్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటు ధరలోలభిస్తోంది. యులు కంపెనీ వీటిని కస్టమర్లకు అందిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లుక్ కూడా అదిరింది. దీనికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే డ్రైవ్ చేయొచ్చు. అలాగే మొబిలిటీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ ఉంటాయి. కీలెస్ ఎంట్రీ ఆప్షన్ ఉంది. అదిరే డిజైన్ దీని సొంతం. దీని ధర రూ. 55,555గా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మీరు రూ.999తో ముందుగానే బుక్ చేసుకోవచ్చు. అలాగే ఈజీ ఈఎంఐ ఆప్షన్ కూడా లభిస్తుంది. నెలవారీ ఈఎంఐ రూ. 1999 నుంచి ప్రారంభం అవుతుంది. డౌన్ పేమెంట్ రూ. 9999 కట్టాల్సి ఉంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు. ఒక్కసారి చార్జ్ చేస్తే 60 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. బ్యాటరీ చార్జింగ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ రూ. 499 నుంచి ప్రారంభం అవుతున్నాయి. అలాగే రూ. 699, రూ. 899 ప్లాన్స్ కూడా ఉన్నాయి. ప్లాన్ ఆధారంగా మీకు లభించే బెనిఫిట్స్ మారతాయి. రూ. 499 ప్లాన్ అయ తే ఉచిత కిలోమీటర్లు ఉండవు. ఆల్‌వేస్ న్యూ బ్యాటరీ, నో చార్జింగ్, 1 మినిట్ స్వాప్ ఫీచర్లు ఉంటాయి. అదే రూ. 699 ప్లాన్ అయితే ఉచిత 300 కిలోమీటర్ల బెనిఫిట్ ఉంది. ఇక మిగతా అన్ని ప్రయోజనాలు లభిస్తాయి. అదే రూ. 899 ప్లాన్ అయితే 600 కిలోమీటర్ల వరకు ఉచితంగానే జర్నీ చేయొచ్చు. ఇంకా ఇతర బెనిపిట్స్ ఉంటాయి. అంటే మీరు బ్యాటరీ స్వైప్ చేసుకోవచ్చు. కేవలం ఒక్క నిమిషంలోనే ఫుల్ బ్యాటరీ లభిస్తుంది. ఇంట్లో చార్జింగ్ పెట్టుకోవాల్సిన పని లేదు. డెన్స్ నెట్‌వర్క్ ద్వారా మీరు మీ బ్యాటరీ స్వాపింగ్ లొకేషన్ తెలుసుకోవచ్చు. ఫోన్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. ఇది రెడ్, వైట్ కలర్ ఆప్షన్‌లో లభిస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu