Ad Code

శాంసంగ్ గ్యాలక్సీ బుక్‌ 4 సిరీస్‌ ల్యాప్‌టాప్‌ విడుదల


శాంసంగ్ గ్యాలక్సీ బుక్‌ 4 సిరీస్‌ పేరుతో ల్యాప్‌టాప్‌ను లాంచ్‌ చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా గ్యాలక్సీ బుక్‌ 4 ప్రో 360, గ్యాలక్సీ బుక్‌ 4 360 పేర్లతో ఈ రెండు ల్యాప్‌టాప్‌లను అందుబాటులోకి తీసుకొని వచ్చారు.. ఈ నెల 20 నుంచే ఈ కంపెనీ ప్రీ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ల్యాప్‌టాప్స్‌లో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, గ్రాఫిక్స్‌ ప్రాసెస్‌ యూనిట్‌, న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ వంటి ఫీచర్లను అందించారు. గ్యాలక్సీ బుక్‌4 360 ల్యాప్‌టాప్‌లో 15.6 ఇంచెస్‌ ఫుల్‌హెచ్‌డీ సూపర్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు.. అలాగే ఫాస్ట్ చార్జింగ్ తో పాటుగా అదిరిపోయే ఫీచర్స్ ను కలిగి ఉందనే చెప్పాలి. ఈ ల్యాప్ ధర 1,14,990గా నిర్ణయించారు. ఇక గ్యాలక్సీ బుక్‌4 ప్రో మోడల్‌ను 14, 16 ఇంచెస్ వేరియంట్‌లో తీసుకొచ్చారు. వీటి ధరలు రూ. 1.32 లక్షల లోపు ఉండనున్నాయి. బుక్‌4 ప్రో 360 మోడల్‌లో 16 ఇంచెస్‌ డైనమిక్ అమోఎల్‌ఈడీ 2ఎక్స్‌ టచ్‌ స్క్రీన్‌ను అందించారు.. ఇక ఈ ల్యాప్ ప్రారంభ ధర రూ.1,63,990గా ఉంది. అంతేకాదు.. ఈ ల్యాప్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నవారికి రూ.5,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. రూ.10,000 విలువైన బ్యాంక్ క్యాష్‌బ్యాక్ లేదా రూ. 8,000 వరకు అప్‌గ్రేడ్ బోనస్, 24 నెలల వరకు నో-కాస్ట్ EMI ఎంపిక వంటివి ఉన్నాయి..

Post a Comment

0 Comments

Close Menu