Ad Code

ఎలక్ట్రిక్‌ కార్ల తయారు నుంచి తప్పుకున్న ఆపిల్‌ ?


పిల్‌ సంస్థ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్‌ కారును తయారు చేయాలన్న దశాబ్దాల కలల ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు తెలిసింది. ఈ నిర్ణయం ఈ ప్రాజెక్టులో పని చేస్తున్న 2000 మందిని షాకింగ్ గురిచేసినట్లు సమాచారం. బ్లూమ్‌బర్గ్‌కు చెందిన మార్క్‌ గుర్మన్‌ రిపోర్టు ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రాజెక్టు చీఫ్ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ జెఫ్‌ విలియమ్స్‌ మరియు ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న వైస్‌ ప్రెసిడెంట్‌ కెవిన్‌ లించ్‌ ఈ వివరాలను అందించినట్లు పేర్కొంది. స్పెషల్ ప్రాజెక్టు గ్రూప్‌గా పిలువబడే ఈ ప్రాజెక్టు టైటాన్‌ను మూసివేసినట్లు చెప్పారని రిపోర్టులో పేర్కొంది. ఈ ప్రాజెక్టులో పనిచేసిన అనేక మంది ఉద్యోగులను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగానికి బదిలీ చేసినట్లు తెలిపింది. 2014లో నిర్ధిష్ట లక్ష్యాలతో ప్రాజెక్టు టైటాన్‌ ప్రారంభం : ప్రస్తుతం సంస్థ ప్రాధాన్యతల్లో ఒకటిగా ఉన్న జనరేటివ్‌ ఏఐ ప్రాజెక్టుపై వీరంతా దృష్టిసారిస్తారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు టైటాన్ రద్దు నిర్ణయం ఆపిల్‌ సంస్థలో గణనీయమైన మార్పులను సూచిస్తోంది. ఆపిల్‌ ఎలక్ట్రిక్‌ వాహనం ప్రాజెక్టు 2014లో ప్రారంభం అయింది. వాయిస్‌ గైడెడ్‌ నావిగేషన్, లగ్జరీ ఇంటీరియర్‌తో ఆటోమేటిక్ వాహనాన్ని అభివృద్ధి చేయాలని ఆపిల్‌ సంస్థ నాడు లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ప్రాజెక్టు టైటాన్ ప్రారంభం అయినప్పటి నుంచి ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్లినా అవాంతరాలు ఎదురయ్యాయి. అనేక పరీక్షల సహా అభివృద్ధి మార్గాలున్నా ఆ కారును అభివృద్ధి చేయడంలో ఆపిల్ సంస్థ వెనకబడింది. ఈ వాహనం బాహ్య డిజైన్‌ రూపొందించడం, సెల్ఫ్‌ డ్రైవింగ్‌ టెక్నాలజీని అభివృద్ధి చేయడం మరియు ఇతర సవాళ్లు ఎదురైనట్లు తెలుస్తోంది. అయితే ఆపిల్‌ తన సెల్ఫ్‌ డ్రైవింగ్‌ టెక్నాలజీని Lexus SUV ద్వారా పరీక్షలు నిర్వహించింది. కచ్చితత్వంతో పని చేయించడంలో అవాంతరాలు ఎదురైనట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఆటో పరిశ్రమలో ఇతర సవాళ్ల కారణంగా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయం అనంతరం ఆపిల్‌ స్టాక్‌ ధర పెరిగినట్లు సమాచారం. టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ఈ నిర్ణయానికి మద్దతు తెలిపారు. ప్రాజెక్టు టైటాన్‌ రద్దుచేయడం ఆపిల్‌ సంస్థకు భారీ ఎదురుదెబ్బగా భావించినా, ఇతర రంగాల్లో ఈ పెట్టుబడులు పెట్టేందుకు సంస్థ కట్టుబడి ఉందని సమాచారం. మరియు పూర్తి స్థాయిలో AI పై దృష్టిపెట్టనున్నట్లు సమాచారం. ఎప్పటి నుంచో పరిశోధనలు, ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తున్న ఆపిల్ సంస్థ ఇటీవలే తన విజన్ ప్రో హెడ్‌సెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Post a Comment

0 Comments

Close Menu