Ad Code

ఐ-ఫోన్ నీటిలో పడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆపిల్ సూచనలు !


ఫోన్ నీటిలో పడితే బియ్యం సంచిలో పెట్టొద్దని, దానివల్ల బియ్యంలో ఉండే సూక్ష్మ రేణువులు ఫోన్‌ను దెబ్బ తీస్తాయని ఆపిల్ పేర్కొంది. దానికి బదులు ఫోన్‫లో చేరిన నీటిని తొలగించడానికి కనెక్టర్ కింది వైపు ఉంచి డివైజ్ ను నెమ్మదిగా కొట్టి.. పొడిగా, గాలి వీస్తున్న ప్రదేశంలో ఉంచాలని తెలిపింది. అలా అర్ధగంట ఉంచిన తర్వాత యూఎస్బీ-సీ పోర్ట్ గానీ, లైటెనింగ్ కనెక్టర్ సాయంతో గానీ చార్జింగ్ చేయండి. స్మార్ట్ ఫోన్‌లో చేరిన నీరు పోవడానికి ఒక రోజు పట్టొచ్చునని, లిక్విడ్ డిటెక్షన్ అలర్ట్ సాయంతో ఫోన్ పరిస్థితి తెలుసుకోవచ్చునని పేర్కొంది. అత్యవసరంగా చార్జి చేయాల్సి వచ్చినప్పుడు తడిగా ఉన్న ఫోన్‌లో లిక్విడ్ డిటెక్షన్ ఓవర్ రైడ్ చేసే వెసులుబాటు ఉంటుందని ఆపిల్ తెలిపింది. కొత్తగా ఐఫోన్ కొనుగోలు చేసిన వారు ఈ సమస్యపై ఆందోళన చెందనక్కర్లేదని పేర్కొంది. 20 అడుగుల్లోతు నీటిలో అర్ధగంట సేపు ఉన్నా, ఐఫోన్ పని చేస్తుందని వివరించింది.

Post a Comment

0 Comments

Close Menu