Ad Code

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ ను ఫైనాన్షియల్ సర్వీసెస్‌ కొనుగోలు ?


పేటీఎం వాలెట్ బిజినెస్‌ను జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌ కొనుగోలు చేసే అవకాశలున్నాయని, ఇరు కంపెనీల మధ్య చర్చలు మొదలయ్యాయని తెలుస్తోందని,  అంతేకాకుండా పేటీఎం వాలెట్ బిజినెస్‌ కొనుగోలు చేయడానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కూడా ఆసక్తి చూపిస్తోందని  హిందూ బిజినెస్‌ లైన్ రిపోర్ట్ చేసింది. కానీ, పేటీఎం మాత్రం ఈ రిపోర్ట్స్‌ను కొట్టిపారేసింది. వాలెట్ బిజినెస్‌ను అమ్మాలని చూడడం లేదని, ఏ కంపెనీతో చర్చలు జరపడం లేదని తెలిపింది. కానీ, రిపోర్ట్స్ వెలువడిన తర్వాత జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు దూసుకుపోయాయి. సోమవారం సెషన్‌లో 16.25 శాతం ఎగసి రూ.295 దగ్గర ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదు చేశాయి. మరోవైపు పేటీఎం షేర్ల పతనం వరుసగా మూడో సెషన్‌లోనూ కొనసాగింది. కంపెనీ షేర్ల లోవర్ సర్క్యూట్‌ను 10 శాతానికి తగ్గించగా, సోమవారం సెషన్‌లోనూ లోవర్ సర్క్యూట్‌ను టచ్‌ చేసి రూ.438 దగ్గర సెటిలయ్యింది. పేటీఎం క్రెడిట్ బిజినెస్ విస్తరిస్తున్న టైమ్‌లో ఆర్‌బీఐ రిస్ట్రిక్షన్లు పెట్టడం కంపెనీకి పెద్ద దెబ్బ అని సీనియర్ ఇన్వెస్టర్‌ సంజీవ్ భాసిన్‌ అన్నారు. పేటీఎం మేనేజ్‌మెంట్ ఈ పరిస్థితులను ఎలా డీల్ చేస్తుందో గమనిస్తున్నామని చెప్పారు. బెయిల్ ఔట్‌ ప్లాన్‌లో భాగంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బిజినెస్‌ను జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కొనుగోలు చేయొచ్చని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ కంపెనీ ఫైనాన్షియల్ మార్కెట్‌లో విస్తరించాలని చూస్తోంది. బ్లాక్‌రాక్‌తో కలిసి 300 మిలియన్ డాలర్ల పెట్టుబడితో అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీని కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇన్సూరెన్స్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. జియో ఫైనాన్స్ లిమిటెడ్‌, జియో ఇన్సూరెన్స్ బ్రోకింగ్‌, జియో పేమెంట్ సొల్యూన్స్‌, జియో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌ను జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆపరేట్ చేస్తోంది. ఇందులో జియో పేమెంట్స్ బ్యాంక్ ఇప్పటికే డిజిటల్ సేవింగ్స్ అకౌంట్లను, బిల్‌ పేమెంట్ సర్వీస్‌లను అందుబాటులోకి తెచ్చింది. కంపెనీకి 2,400 మంది బిజినెస్ కరస్పాండెంట్లు ఉన్నారు. డెబిట్ కార్డులను కూడా ఈ కంపెనీ లాంచ్ చేసింది. అంతేకాకుండా పేటీఎం మాదిరే జియో వాయిస్ బాక్స్‌ను తీసుకొచ్చింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బిజినెస్ కూడా యాడ్ అయితే జియో పేమెంట్స్ బ్యాంక్ మరింతగా విస్తరించడానికి వీలుంటుంది.


Post a Comment

0 Comments

Close Menu