Ad Code

'పాకెట్ యూపీఐ'తో ఈజీ పేమెంట్స్ !


ఫిన్ టెక్ సంస్థ మొబీక్విక్ తన ప్లాట్‌ఫారమ్‌లో ‘పాకెట్ యూపీఐ’ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త యూపీఐ ఫీచర్ ద్వారా వినియోగదారులు బ్యాంకు అకౌంట్లను లింక్ చేసుకోవాల్సిన పనిలేదు. సులభంగా యూపీఐ పేమెంట్లను చేసుకోవచ్చు. వినియోగదారులకు బడ్జెట్, ఫైనాన్స్ మేనేజ్‌మెంట్‌పై మెరుగైన నియంత్రణను కలిగి ఉండేందుకు వీలు కల్పిస్తుందని ఫిన్‌టెక్ కంపెనీ పేర్కొంది. పాకెట్ యూపీఐ వినియోగదారులు తమ బ్యాంక్ ఖాతాను లింక్ చేయకుండానే మొబీక్విక్ వ్యాలెట్ ద్వారా యూపీఐ పేమెంట్లను చేయడానికి అనుమతిస్తుంది. తద్వారా వినియోగదారులకు యూపీఐ చెల్లింపుల సమయంలో మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. పాకెట్ యూపీఐతో వినియోగదారులకు తమ బ్యాంక్ అకౌంట్ కాకుండా మొబీక్విక్ వ్యాలెట్ నుంచి నగదును ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. లావాదేవీల విషయంలో ఎలాంటి ఆర్థిక మోసాల జరగకుండా ఉండేందుకు సాయపడుతుంది. యూపీఐ లావాదేవీలను బహిర్గతం కాకుండా నివారించడంలో సాయపడుతుంది. మొబీక్విక్ ప్లాట్‌ఫారమ్ యూపీఐ ఫీచర్ ద్వారా క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లు లేదా యూపీఐ ద్వారా బ్యాలెన్స్ లోడింగ్‌కు సపోర్టు ఇస్తుంది. రూపే, వీసా, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, డైనర్స్ క్లబ్‌తో సహా ఏదైనా నెట్‌వర్క్ నుంచి కార్డు పేమెంట్లను అనుమతిస్తుంది. పాకెట్ యూపీఐ ద్వారా చెల్లింపులు మర్చంట్ క్యూఆర్ కోడ్‌లు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, పీర్-టు-పీర్ బదిలీలు వంటి వివిధ ఛానెల్‌లలో పేమెంట్లు చేసుకోవచ్చు. పాకెట్ యూపీఐతో వినియోగదారులు ముందుగా మొబీక్విక్ ప్లాట్‌ఫారమ్‌లో ప్రత్యేకమైన వ్యాలెట్ యూపీఐ ఐడీని క్రియేట్ చేయాలి. ఇప్పటికే ఉన్న మొబీక్విక్ వ్యాలెట్ వినియోగదారులు ఈ ఫీచర్‌ని ఉపయోగించుకోవచ్చు. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా బ్యాంక్ అకౌంట్ ద్వారా మొబీక్విక్ వ్యాలెట్లో నగదును జమ చేసుకోవచ్చు. వ్యాలెట్ లోడ్ అయిన తర్వాత వినియోగదారులు వ్యాలెట్ బ్యాలెన్స్‌తో యూపీఐ పేమెంట్లు చేసుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu