Ad Code

భారీ బ్యాటరీతో ఐక్యూ Z9 5జీ ఫోన్ ?


దేశీయ మార్కెట్లో ఐక్యూ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. రాబోయే ఐక్యూ జెడ్9 5జీ ఫోన్ లాంచ్‌కు ముందుగానే కంపెనీ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్ ఇండియాలో మైక్రోసైట్ ద్వారా కొన్ని ముఖ్య ఫీచర్లను ధృవీకరించింది. ఐక్యూ జెడ్9 5జీ గత ఏడాది చైనాలో ప్రవేశపెట్టిన ఐక్యూ జెడ్8 అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వస్తోంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్882 ప్రైమరీ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. కెమెరా మాడ్యూల్‌లో ఆస్ఫెరికల్ ప్రీమియం లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంటాయి. దీర్ఘచతురస్రాకార డిజైన్‌తో మ్యాట్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లో ఫోన్ వస్తుంది. మీడియాటెక్ డైమెన్షిటీ 7200 ప్రాసెసర్ ద్వారా పవర్ అందిస్తుంది. అదే విభాగంలో అత్యంత వేగవంతమైన ఫోన్‌గా రానుందని కంపెనీ పేర్కొంది. గీక్‌బెంచ్ లిస్టింగ్ ప్రకారం.. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14-ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. అయితే, ఈ వివరాలను కంపెనీ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. 1.5కె ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 6,000ఎంఎహెచ్ బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ ప్రకారం.. ఈ ఫోన్ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీకి కూడా సపోర్టు ఇస్తుంది. భారత మార్కెట్లో ఐక్యూ కొత్త ఫోన్ ధర రూ. 25వేల లోపు ఉండవచ్చని అంచనా.

Post a Comment

0 Comments

Close Menu