Ad Code

2025లో ఆపిల్ ఐఫోన్ 17 విడుదల ?


2025లో ఆపిల్ ఐఫోన్ 17 వస్తుందని అంచనా. గత ఐఫోన్ మోడళ్ల కన్నా రెండు కొత్త అప్‌గ్రేడ్ వెర్షన్లతో ఆకర్షణీయమైన డిస్‌ప్లేతో రానుందని టిప్‌స్టర్ నివేదిక తెలిపింది. చైనీస్ మైక్రోబ్లాగింగ్ సర్వీస్ వీబోలో లీకర్ షేర్ చేసిన వివరాల ప్రకారం ఐఫోన్ 17 లో-రిఫ్లెక్టివ్ హై-స్క్రాచ్ రెసిస్టెంట్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ తయారీదారు శాంసంగ్ కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఆర్మర్ స్క్రీన్‌తో గెలాక్సీ ఎస్ 24 అల్ట్రాను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. టిప్‌స్టర్ ఇన్‌స్టంట్ డిజిటల్ వెయిబో పోస్ట్‌లో ఆపిల్ చైనాలోని ఐఫోన్ సప్లయ్ చేసే డివైజ్ కోటింగ్ ఎక్విప్‌మెంట్ కొనుగోలు చేసిందని పేర్కొంది. అయితే, లాంచ్‌కు ముందు మాత్రమే కానీ, ఐఫోన్ 16 సిరీస్‌ను ఉత్పత్తి చేసే సమయంలో కాదని తెలిపింది. 2024 ఏడాది చివరిలో మెరుగైన డిస్‌ప్లే ఫీచర్‌లతో ఐఫోన్ 17 సిరీస్ రానుందని పేర్కొంది. సూపర్ హార్డ్ యాంటీ రిఫ్లెక్టివ్ లేయర్‌ను కలిగిన డిస్‌ప్లేతో అమర్చబడి ఉంటుంది. కంపెనీ సిరామిక్ షీల్డ్ గ్లాస్ టెక్నాలజీ మెరుగైన డ్రాప్ ప్రొటెక్షన్‌ని అందిస్తుంది. గత మోడళ్లతో పోలిస్తే.. మెరుగైన స్క్రాచ్ రెసిస్టెన్స్‌ని అందించనుంది. సరికొత్త అప్‌గ్రేడ్‌ ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది. ఈ యాంటీ-రిఫ్లెక్టివ్ డిస్‌ప్లే టెక్నాలజీ ఈ ఏడాది ప్రారంభంలో ఆవిష్కరించిన కంపెనీ టాప్-ఆఫ్-ది-లైన్ స్మార్ట్‌ఫోన్ మోడల్ శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రాలో ఉపయోగించిన మాదిరిగానే ఉంది. గెలాక్సీ S24 అల్ట్రా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఆర్మర్ ప్రొటెక్షన్‌తో వచ్చింది. మెరుగైన స్క్రాచ్ ప్రొటెక్షన్ అందిస్తుందని, ఇతర స్మార్ట్‌ఫోన్ ప్యానెల్‌లతో పోలిస్తే.. రిఫ్లెక్షన్‌లను మరింత ప్రభావవంతంగా తగ్గిస్తుంది. టిప్‌స్టర్ ప్రకారం.. ఆపిల్ ఐఫోన్ 17 ఆకర్షణీయమైన లైటింగ్‌లో మెరుగైన దృశ్యాలను అందించగలదు.పాత ఐఫోన్ మోడల్‌లతో పోలిస్తే.. మెరుగైన స్క్రాచ్ నిరోధకతను అందిస్తుంది. అయితే, ఐఫోన్ 17 లైనప్ లాంచ్‌కు ఏడాదిన్నర కన్నా ఎక్కువ సమయమే పట్టొచ్చు. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్ స్క్రీన్ స్పెసిఫికేషన్‌లకు సంబంధించిన ఇతర వివరాలు ఏవీ రివీల్ చేయలేదు. ఐఫోన్ 17 గురించి మరిన్ని వివరాలు రాబోయే నెలల్లో ఆన్‌లైన్‌లో కనిపించే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments

Close Menu