Ad Code

శాంసంగ్ గెలాక్సీ A35, A55 5G స్మార్ట్‌ఫోన్ల ధరల వెల్లడి !


శాంసంగ్‌ సంస్థ రెండు రోజుల క్రితం తన మిడ్‌ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్లు శాంసంగ్ గెలాక్సీ A55 5G, గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్లను భారత్‌లో విడుదల చేసింది. లాంచ్‌ సమయంలో ఈ రెండు హ్యాండ్‌సెట్ల ధరల వివరాలను వెల్లడించని శాంసంగ్ తాజాగా ధరలపై ప్రకటన చేసింది. శాంసంగ్‌ గెలాక్సీ A55 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ +128GB స్టోరేజీ ధర రూ.39,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.42,999, 12GB ర్యామ్‌ +256 స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.45,999 గా ఉంది. అదే గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ +128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.30,999, 8GB ర్యామ్‌ +256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.33,999 గా ఉంది. ఈ రెండు శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లను శాంసంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్లు సహా ఇతర రిటైల్‌ దుకాణాల్లో కొనుగోలు చేయవచ్చు. HDFC, వన్‌కార్డ్‌, IDFC ఫస్ట్‌ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.3000 తగ్గింపును పొందవచ్చు. మరియు 6 నెలలపాటు నోకాస్ట్‌ EMI సౌకర్యాన్ని పొందవచ్చు. దీంతోపాటు శాంసంగ్‌ ఫైనాన్స్‌ ప్లస్‌ మరియు ఇతర NBFC కార్డుల ద్వారా శాంసంగ్‌ గెలాక్సీ A55 5G స్మార్ట్‌ఫోన్‌ను నెలకు రూ.1,792 చెల్లించి, గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్‌ను నెలకు రూ.1,723 చెల్లించి కొనుగోలు చేయవచ్చు. ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని శాంసంగ్‌ కోరింది.

Post a Comment

0 Comments

Close Menu