Ad Code

యాపిల్‌ ఐడీ ఫండ్స్‌కి ఎక్స్‌ట్రా వ్యాల్యూ ఆఫర్‌ !


యాపిల్‌ ఐడీ ఫండ్స్‌కి ఎక్స్‌ట్రా వ్యాల్యూ పొందే ఆఫర్‌ ప్రకటించింది. యాపిల్‌ ఐడీ ద్వారా వినియోగదారులు వారి డివైజ్‌లో లాగిన్ అయిన తర్వాత యాపిల్‌ యాప్‌ స్టోర్‌ ద్వారా అనేక రకాల యాప్స్‌కి యాక్సెస్‌ లభిస్తుంది. వినియోగదారులు యాప్ స్టోర్ ద్వారా తమ యాపిల్‌ ఐడీకి ఫండ్స్‌ యాడ్‌ చేసినప్పుడు 10% బోనస్‌ పొందుతారు.  ఈ ఆఫర్ 2024 మార్చి 26 వరకు అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ వినియోగదారులకు అందిస్తున్న బెనిఫిట్‌ మేరకు లింక్ అయిన యాపిల్‌ ఐడీకి రూ.2,000 నుంచి రూ.5,000 వరకు యాడ్‌ చేస్తే 10 శాతం బోనస్‌ పొందవచ్చు. ఫండ్స్‌ని సక్సెస్‌ఫుల్‌గా యాడ్‌ చేసిన వెంటనే ఇన్‌స్టంట్‌గా బోనస్‌ను వినియోగించుకోవచ్చు. బోనస్‌ అమౌంట్‌ని షాపింగ్ యాప్‌లు, యాపిల్‌ మ్యూజిక్‌, యాపిల్‌ టీవీ ప్లస్‌, యాపిల్‌ ఆర్కేడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చు. లేదా అదనంగా ఐక్లౌడ్‌ స్టోరేజ్‌ని కొనుగోలు చేయవచ్చు. ఒక యాపిల్‌ ఐడీలో ఒకసారి మాత్రమే ఆఫర్‌ను పొందగలరు. యాప్ స్టోర్ నుంచి యాపిల్ ఐడీకి ఫండ్స్‌ యాడ్‌ చేసేటప్పుడు అర్హత కలిగిన ఐఫోన్‌ వినియోగదారులు బోనస్ ఆఫర్ గురించి నోటిఫికేషన్‌ పొందుతారు. దీనికి సంబంధించి టిప్‌స్టర్ ముకుల్ శర్మ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ X (గతంలో ట్విట్టర్)లో ఓ స్క్రీన్‌షాట్ షేర్‌ చేసుకున్నాడు. అందులోని వివరాల ప్రకారం.. వినియోగదారులు రూ.2,000 జోడించినప్పుడు రూ.200, రూ.5,000 జోడించినప్పుడు రూ.500 బోనస్‌గా లభిస్తోంది. యాపిల్‌ యూజర్లు ఫండ్స్‌ యాడ్‌ చేయడానికి ముందుగా సెట్టింగ్స్‌ ఓపెన్‌ చేయండి. అక్కడ నేమ్‌ సెక్షన్‌పై క్లిక్‌ చేయండి. తర్వాత పేమెంట్స్‌ అండ్‌ షిప్పింగ్‌ ఆప్షన్‌ సెలక్ట్‌ చేసుకోండి. యాపిల్‌ ఐడీ ఓపెన్‌ అవుతుంది. యాడ్‌ ఫండ్స్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి. లేదంటే ముందుగా యాప్ స్టోర్‌ ఓపెన్‌ చేయండి. తర్వాత యాప్ స్టోర్ కింద అకౌంట్‌ సెక్షన్‌కి వెళ్లండి. ఇప్పుడు ఫండ్స్‌ యాడ్‌ చేయడానికి యాడ్ ఫండ్స్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. 10 శాతం బోనస్ ఆఫర్‌ను యాపిల్‌ అందించే ఇతర ఆఫర్‌లు లేదా డిస్కౌంట్‌లతో కలపడం సాధ్యం కాదు. ఈ బోనస్ ఒన్‌-టైమ్‌ యూజ్‌ ఆఫర్‌. ట్రాన్సాక్షన్‌ హిస్టరీ, అకౌంట్‌ ఇన్‌ఫర్మేషన్‌ని బట్టి వినియోగదారు నుంచి వినియోగదారుకు మారుతూ ఉంటుంది. ఇలానే ఏడాది క్రితం భారత్‌ యూజర్లకు యాపిల్‌ 2023 నవంబర్ 11 వరకు వ్యాలిడ్‌ అయ్యే లిమిటెడ్‌ టైమ్‌ బోనస్‌ ఆఫర్‌ అందించింది.

Post a Comment

0 Comments

Close Menu