Ad Code

మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ విభాగాల్లో గణనీయంగా ఉద్యోగులను తొలగించనున్న ఐబీఎం !


బీఎం మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ విభాగాల్లో గణనీయంగా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  టెక్నాలజీకి ఉన్న డిమాండ్ దృష్ట్యా కంపెనీలో కొత్త ఏఐ సాంకేతికను ఉపయోగించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే కంపెనీ సీఈఓ అరవింద్ కృష్ణ ఉద్యోగుల తొలగింపు అనివార్యమని పేర్కొన్నారు. దాదాపు 204 టెక్ కంపెనీలు సమిష్టిగా దాదాపు 50వేల మంది ఉద్యోగాలను తొలగిస్తున్నట్టుగా ప్రకటించాయి. 2024లో ఐబీఎమ్ మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ విభాగంలో గణనీయమైన ఉద్యోగ కోతలను విధించాలని ఈ నిర్ణయం తీసుకుంది. నివేదిక ప్రకారం.. ఐబీఎమ్ చీఫ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ జోనాథన్ అడాషేక్ ఉద్యోగుల తొలగింపుపై ప్రకటన విడుదల చేశారు. అయితే, ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తుందో ఐబీఎం వెల్లడించనప్పటికీ, ఉద్యోగ కోతల సంఖ్య గణనీయంగానే ఉంటుందని తెలుస్తోంది. ఐబీఎం బ్రాండ్ ఇమేజ్‌ని రూపొందించడం, వాటాదారులకు సంబంధించిన యూనిట్‌లో పనిచేసే ఉద్యోగులపైనే వేటు పడనుంది. ఏఐ టెక్నాలజీపైనే దృష్టిసారించిన ఐబీఎం ఆ దిశగానే శ్రామిక శక్తిని పెంచాలని భావిస్తోంది. గత డిసెంబరులో, సీఈఓ అరవింద్ ఏఐ ఆధారిత టెక్నాలజీపై పనిచేసే నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులే సంస్థకు అవసరమని నొక్కిచెప్పారు. ఈ ప్రణాళికలో దాదాపు 8వేల ఉద్యోగాలను ఏఐ-ఆధారిత ఉద్యోగులతో భర్తీ చేయనుంది. గత జనవరిలో ఐబీఎమ్ దాదాపు 4వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించింది.


Post a Comment

0 Comments

Close Menu