Ad Code

ఐటెల్ నుంచి 108ఎంపీ భారీ కెమెరాతో ఏఐ పవర్డ్ S24 ఫోన్ లాంచ్ !


టెల్ ఏఐ టెక్నాలజీతో అద్భుతమైన 108ఎంపీ కెమెరాతో ఐటెల్ S24 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఏఐ కెమెరా ఫోన్ రూ. 10వేల లోపు ధరలో రిలీజ్ చేసింది. తక్కువ ఖర్చుతో అత్యాధునిక టెక్నాలజీ కెమెరా, వేగవంతమైన పర్ఫార్మెన్స్ కోరుకునే యువత కోసం ఈ ఫోన్ రూపొందించింది. ఐటెల్ S24 ఫోన్ కొన్ని అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. హైక్వాలిటీ సౌండ్ కోసం డ్యూయల్ డీటీఎస్ స్పీకర్‌లను కలిగి ఉంది. సూర్యకాంతిలో కలర్ మారే డిజైన్ కూడా దీని ప్రత్యేకత. మీడియాటెక్ హెలియో G91 ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో ఆధారితమైనదిగా చెప్పవచ్చు. 16జీబీ ర్యామ్ కలిగి ఉంది. అనేక యాప్‌లు, గేమ్‌లను వేగంగా ఆపరేట్ చేయొచ్చు. ఈ ఏఐ ఫోన్ స్టార్రీ బ్లాక్, డాన్ వైట్ అనే 2 కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ ఫోన్ అతినీలలోహిత కాంతి తగిలినప్పుడు గులాబీ రంగులోకి మారుతుంది. ఈ  ఫోన్ ప్రత్యేక ఫీచర్ F1.6 ఎపర్చర్‌తో 108ఎంపీ అల్ట్రా-క్లియర్ డ్యూయల్ ఏఐ కెమెరా కలిగి ఉంది. ఈ కెమెరా సెటప్ యూజర్లను ఎలాంటి లైటింగ్ పరిస్థితుల్లో కూడా హై క్వాలిటీ ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్), ఏఐ పోర్ట్రెయిట్ మోడ్ వంటి పోర్ట్రెయిట్ బ్లర్‌ను కూడా అందిస్తుంది. ఏఆర్ షాట్‌లు, స్టేబుల్ వీడియో, షార్ట్ వీడియో వంటి ఫీచర్‌ల ద్వారా కెమెరా మల్టీఫేస్ ఫీచర్ అందిస్తుంది. ఐటెల్ ఫోన్ పర్ఫార్మెన్స్ పరంగా ఐటెల్ S24 మీడియాటెక్ హెలియో G91 ఆక్టా కోర్ ప్రాసెసర్ కలిగి ఉంది. పెద్ద 5000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. చాలా కాలం పాటు ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. బ్యాటరీ అయిపోకుండా గంటల తరబడి గేమ్‌లు ఆడవచ్చు. వీడియోలను చూడవచ్చు. బ్యాటరీ లాంగ్ లైఫ్ వచ్చేలా స్మార్ట్ ఛార్జింగ్ ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి. 90హెచ్‌జెడ్ 6.6-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. అంటే.. స్క్రీన్‌పై ఉన్న ప్రతిదీ స్పష్టంగా కనిపిస్తుంది. ఫ్రంట్ కెమెరా చుట్టూ ముఖ్యమైన నోటిఫికేషన్‌లను చూపే డైనమిక్ బార్ అనే ఫీచర్ కూడా ఉంది. ఐటెల్ S24లో సౌండ్ క్వాలిటీ కూడా ముఖ్యం. డ్యూయల్ డీటీఎస్ స్పీకర్లను కలిగి ఉంది. మంచి సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. గేమ్‌లు, మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేయొచ్చు. వినియోగదారులు తమ ఇష్టానుసారం సౌండ్ సెట్టింగ్‌లను కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. యూజర్ ఎక్స్‌పీరియన్స్ కోసం సోషల్ టర్బో, గేమ్ మోడ్, డ్యూయల్ యాప్ వంటి ఉపయోగకరమైన ఫీచర్‌లతో వచ్చిన ఐటెల్ సొంత ఆపరేటింగ్ సిస్టమ్, ఐటెల్ ఓఎస్ 13.5పై ఫోన్ రన్ అవుతుంది.

Post a Comment

0 Comments

Close Menu