Ad Code

పోర్ట్రోనిక్స్ బీమ్ 430 స్మార్ట్ ప్రొజెక్టర్ పై 57 శాతం తగ్గింపు ?


మెజాన్‌ పోర్ట్రోనిక్స్ బీమ్ 430 స్మార్ట్ ప్రొజెక్టర్ పై  57 శాతం తగ్గింపు ఆఫర్ ప్రకటించింది. ఇది  200 అంగుళాల స్క్రీన్ వరకు ప్రొజెక్షన్ పరిమాణం, డాల్బీ ఆడియో, 4K సపోర్ట్ వంటి వివిధ ప్రత్యేక ఫీచర్లతో వస్తుంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులను ఉపయోగించి ఈ ప్రొజెక్టర్ మోడల్‌ను కొనుగోలు చేస్తే అదనంగా రూ.2500 తగ్గింపు లభిస్తుంది. పోర్ట్రోనిక్స్ బీమ్ 430 స్మార్ట్ ప్రొజెక్టర్ 4K డిస్ప్లే రిజల్యూషన్ మరియు 1080 పిక్సెల్స్ FHD స్థానిక రిజల్యూషన్‌కు మద్దతు ఇస్తుంది. ఇది ఆటో కీస్టోన్ కరెక్షన్ మరియు ఆటో ఫోకస్‌ను కలిగివుంది. ఈ ప్రొజెక్టర్ 45 అంగుళాల నుండి 200 అంగుళాల వరకు అడ్జెస్ట్ చేసుకునే వెసులుబాటు గల ప్రొజెక్షన్ పరిమాణాన్ని కలిగి ఉంది.  ఈ ప్రొజెక్టర్ 10000 లుమెన్స్ బ్రైట్నెస్ సదుపాయాన్ని కలిగి ఉంది. డాల్బీ ఆడియోకు సపోర్ట్ చేస్తుంది. ఇది ఆడియో కోసం బ్లూటూత్ కనెక్టివిటీ మద్దతును కూడా కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, టాబ్లెట్, స్పీకర్లు, USB డ్రైవ్, సెట్-టాప్ బాక్స్, బహుళ పోర్ట్‌లకు కనెక్ట్ చేయవచ్చు. ఈ ప్రొజెక్టర్ మోడల్‌లో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ సహా స్ట్రీమింగ్ యాప్‌లు ఉండటం గమనార్హం.

Post a Comment

0 Comments

Close Menu