Ad Code

హానర్‌ 90 5జీ ఫోన్‌పై డిస్కౌంట్‌ ఆఫర్ ?


హానర్‌ 90 5జీ ఫోన్‌ ప్రస్తుతం తగ్గించిన ధరతో మిడ్ రేంజ్‌ ఫోన్‌ జాబితాలోకి వచ్చే చేరింది. ప్రస్తుతం ఈ ఫోన్‌ 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 22,999కాగా, 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 24,999గా ఉంది. ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన క్వాడ్ కర్వ్డ్ ఫ్లోటింగ్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1600 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను ఈ స్క్రీన్‌ అందిస్తుంది. దీంతో సన్‌లైట్‌లో కూడా స్క్రీన్‌ను క్లియర్‌గా చూడొచ్చు. అలాగే కళ్లపై ఒత్తడి తగ్గించేందుకు వీలుగా ఈ ఫోన్‌లో ప్రత్యేక టెక్నాలజీని అందించారు. ఇక ఈ ఫోన్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగ్‌ 7 జెన్‌ 1 ప్రాసెసర్‌ను అందించారు. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌ హానర్‌ మ్యాజిక్‌ 7.1 ని అందించారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్‌ వంటి పవర్‌ ఫుల్‌ బ్యాటరీని అందించారు. కనెక్టివిటీ విషయానికొస్తే 5జీ, వైఫై 802.11ఏక్స్‌, బ్లూటూత్‌ 5.2, జీపీఎస్‌, యూఎస్‌బీ టైప్‌సీ పోర్ట్‌ వంటి ఫీచర్లు అందించారు. ఈ ఫోన్‌లో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో ట్రిపుల్‌ కెమెరా సెటప్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. ఇందులో 200 మెగాపిక్సెల్స్‌ మెయిన్‌ కెమెరాతో పాటు 12 ఎంపీ అల్ట్రా వైడ్ మాక్రో సెన్సార్, 2 ఎంపీ డెప్త్ సెన్సార్ కెమెరాను అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

Post a Comment

0 Comments

Close Menu