Ad Code

మార్చి త్రైమాసికంలో 9శాతం గ్రోత్ సాధించిన టీసీఎస్ !


టీసీఎస్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో నికర లాభాల్లో తొమ్మిది శాతం గ్రోత్ నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24) నాలుగో త్రైమాసికంలో రూ.12,434 కోట్ల నికర లాభం గడించింది. 2022-23తో పోలిస్తే రూ.11,392 కోట్ల నుంచి తొమ్మిది శాతానికి పైగా పెంచుకున్నది. గత ఆర్థిక సంవత్సరం (2023-24) మూడో త్రైమాసికంతో పోలిస్తే రూ.11,058 కోట్లు కాగా, చివరి త్రైమాసికంలో 12.44 శాతం పెంచుకున్నది. ఈ నేపథ్యంలో టీసీఎస్ తన వాటాదారులకు షేర్ మీద రూ.28 చొప్పున ఇంటరిం డివిడెండ్ ప్రకటించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.61,237 కోట్ల ఆదాయం గడించింది టీసీఎస్. 2022-23 మార్చి త్రైమాసికంలో రూ.59,162 కోట్ల ఆదాయం సంపాదించింది. దీంతో గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 3.50 శాతం గ్రోత్ నమోదు చేసుకున్నది. గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే 1.07 శాతం గ్రోత్‌ (రూ.60,583 కోట్లు) సాధించింది. ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్న నేపథ్యంలో టీసీఎస్ షేర్ దేశీయ స్టాక్ మార్కెట్లలో రూ.4,003.80 వద్ద ముగిసింది.

Post a Comment

0 Comments

Close Menu