Ad Code

ఆన్‌లైన్‌లో ఎవరెవరు ఉన్నారో వారి జాబితాను ఒకచోట చూపించే ఫీచర్‌ ?


వాట్సాప్‌లో మనకు తెలిసిన వ్యక్తి ఆన్‌లైన్‌లో ఉన్నాడో లేదో ఎలా తెలుస్తుంది.? ఇందుకోసం సదరు వ్యక్తి ప్రొఫెల్‌ను క్లిక్‌ చేసి చూడాలి. ఒకవేళ ఆన్‌లైన్‌లో ఉంటే ఆన్‌లైన్‌లో ఉన్నట్లే లేదంటే లాస్ట్‌ సీన్‌ ఎప్పుడుందో కనిపిస్తుంది. మరి అలా కాకుండా ఆన్‌లైన్‌లో ఎవరెవరు ఉన్నారో వారి జాబితాను ఒకచోట చూపిస్తే ఎలా ఉంటుంది.? అచ్చంగా ఇలాంటి ఫీచర్‌నే తీసుకొచ్చే పనిలో పడింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్‌ స్టేజ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వాట్సాప్‌లో మనం ఎవరితోనైనా చాట్ చేయాలంటే కింద కుడివైపు ఉండే ‘ప్లస్‌’ సింబల్‌ను క్లిక్‌ చేసి చాట్‌ను సెలక్ట్‌ చేసుకొని మెసేజ్‌ చేస్తుంటాం. వాట్సాప్‌ తీసుకురానున్న ఈ కొత్త ఫీచర్‌ సహాయంతో ‘ప్లస్‌’ బటన్‌పై క్లిక్‌ చేయగానే ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో ఒక లిస్ట్‌ ప్రత్యక్షమవుతుంది. 2.24.9.14 వెర్షన్‌తో ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం ఈ కొత్త ఫీచర్‌ బీటా టెస్టింగ్‌ జరుగుతోంది. ఎవరైతే రీసెంట్‌గా ఆన్‌లైన్‌లో ఉన్నారో వారి వివరాలను ఒక చోట చూపిస్తుంది.


 

Post a Comment

0 Comments

Close Menu