Ad Code

ఫిన్ టెక్ రంగంలో మళ్లీ అష్నీర్ గ్రోవర్ !


భారత్‌పే కో-ఫౌండర్, మాజీ ఎండీ అష్నీర్ గ్రోవర్ తిరిగి ఫిన్ టెక్ లోకి  వచ్చారు. 'జీరోపే' అనే మెడికల్ లోన్ యాప్ ద్వారా రెండోసారి అష్నీర్ గ్రోవర్ ఫిన్ టెక్ రంగంలోకి అడుగు పెట్టారు. గూగుల్ ప్లే స్టోర్ లిస్టింగ్ ప్రకారం 'జీరో పే' యాప్ మూడు, ఆరు, తొమ్మిది, 12 నెలల టెన్యూర్ తో రుణాలు అందుకోవచ్చు. థర్డ్ యూనికార్న్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఈ 'జీరోపే' యాప్ డెవలప్ చేసింది. అవసరమైన వారికి మెడికల్ లోన్లు ఇచ్చేందుకు ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ ముకుత్ ఫిన్ వెస్ట్‌తో జీరో పే భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది. రూ.5 లక్షల వరకూ ప్రీ-అప్రూవ్డ్ మెడికల్ లోన్ పొందొచ్చు. భాగస్వామ్య దవాఖానల్లో చికిత్స పొందుతున్న వారికి మాత్రమే ఈ సౌకర్యం లభిస్తుంది. భారత్‌పే నుంచి నిష్క్రమించిన తర్వాత అష్నీర్ గ్రోవర్ తన భార్య మాధురి జైన్ గ్రోవర్, చండీగఢ్ కేంద్రంగా పని చేస్తున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్త అసీం ఘావ్రీతో కలిసి 2023 జనవరిలో థర్డ్ యూనికార్న్ ప్రారంభించారు. క్రిక్ పే తో ఈ థర్డ్ యూనికార్న్ రంగంలోకి ఎంటరైంది. ఇది డ్రీమ్11, గేమ్స్24×7, మై 11 సర్కిల్ వంటి యాప్స్ తో పోటీ పడుతుంది.

Post a Comment

0 Comments

Close Menu