Ad Code

ఏఐ టెక్నాలజీతో శాంసంగ్ ఫ్రిజ్‌ !?


శాంసంగ్ ఏఐతో పనిచేసే ఫ్రిజ్‌ను ఏప్రిల్ 3న విడుదల చేసింది. ఇది ఫ్రిజ్‌లో ఉంచిన కిరాణా సామాగ్రి గడువు ముగియబోతున్నప్పుడు, లేదంటే, మీ వస్తువులను ఎవరైనా రహస్యంగా తీసుకున్నప్పుడు, లేదంటే మీరు ఫ్రిడ్జ్‌లో దాచుకున్న ఆహారాన్ని ఎవరైనా తిన్నా కూడా ఏఐ ఫ్రిడ్జ్ దాన్ని పసిగట్టేస్తుంది. ఈ ఫ్రిడ్జ్‌ లో పెట్టి ఆహారం ఎప్పుడు తీశారో కూడా చెబుతుంది. ఎవరూ తీశారు అనే విషయాన్ని బయటకు చెప్పేస్తుందట !. ఇది మీ ఫోన్‌లో రింగ్ అవుతున్న కాల్‌లను కూడా రిసీవ్‌ చేసుకుంటుందట!. ఈ ఫ్రిజ్ సూపర్ మార్కెట్ నుండి వస్తువులను ఆర్డర్ చేస్తుంది. వంటగదిలో మంచి మ్యూజిక్‌ ప్లే చేస్తుంది. డోర్‌బెల్ ఎవరు మోగిస్తున్నారో కూడా చూపిస్తుంది. ఇవన్నీ ప్రజలకు చాలా డబ్బు ఆదా చేస్తాయి. ఫ్రిజ్‌లో ఉంచిన వస్తువులు ఎప్పుడు అయిపోతున్నాయో తెలియజేస్తుంది. దాంతో మనం కావాల్సిన వస్తువులను సరైన సమయానికి కొనుగోలు చేయవచ్చు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ఏఐ శక్తితో పనిచేసే ఫ్రిజ్ లోపల ఉంచిన ఆహార పదార్థాలతో ఎలాంటి స్పెషల్‌ వంటకాలు తయారు చేసుకోవచ్చునో కూడా సూచిస్తుందట!. బ్రిటన్‌లోని శాంసంగ్ డిజిటల్ ఉపకరణాల విభాగం డైరెక్టర్ తాన్యా వెల్లర్ మాట్లాడుతూ దాదాపు 50 ఏళ్ల క్రితం కంపెనీ తొలిసారిగా ఫ్రిజ్‌ను విడుదల చేసిందని చెప్పారు. అప్పటి నుండి కంపెనీ నిరంతరంగా తన ఆవిష్కరణ ప్రమాణాలను ముందుకు తీసుకువెళుతోందన్నారు. ఇది కొత్త టెక్నాలజీ యుగం, అందుకు తగ్గట్టుగానే AI సహాయంతో, ప్రజలు డబ్బు, విద్యుత్ వృధాను మాత్రమే కాకుండా ఆహారం కూడా వృధా చేయడాన్ని అరికట్టవచ్చు. 

Post a Comment

0 Comments

Close Menu