Ad Code

మ్యూజిక్‌ యాప్‌ల్లోనూ ఏఐ ఫీచర్లు ?


మ్యూజిక్‌ స్ట్రీమింగ్ యాప్స్‌ అందుబాటులోకి రావడంతో చాలా మంది వీటినే ఉపయోగిస్తున్నారు. ఇంటర్నెట్ ఉంటే చాలు ఎంచక్కా ఆన్‌లైన్‌లో పాటలు వినొచ్చు. అయితే తాజాగా ఈ మ్యూజిక్‌ యాప్స్ పలు ఏఐ ఫీచర్లను జోడిస్తున్నాయి. ఈ ఫీచర్‌ సహాయంతో ప్రాంప్ట్స్‌ ఆధారంగా ప్లేలిస్టును క్రియేట్‌ చేయటమే కాకుండా ఎమోజీలతోనూ పనిచేస్తుంది. మ్యాస్ట్రో సృష్టించిన ప్లేలిస్టును తర్వాత ఎప్పుడైనా వినాలనుకుంటే సేవ్‌ చేసుకోవచ్చు. అంతేకాదు ఇతరులతోనూ షేర్‌ చేసుకోవచ్చు. అభ్యంతకరమైన కంటెంట్‌ను అడ్డుకోవటానికి ఇందులో ప్రత్యేక ఫీచర్‌ను తీసుకొచ్చారు. ప్రస్తుతం బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉన్న ఈ కొత్త ఫీచర్‌ త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒకప్పుడు మాటలు వినాలనుకుంటే మెమోరీ కార్డులో సాంగ్స్‌ను లోడ్‌ చేసుకొని వినే వారు. కానీ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆన్‌లైన్‌లో ఎవరికి వాళ్లే డౌన్‌లోడ్‌ చేసుకునే రోజులు వచ్చాయి. అయితే స్మార్ట్ ఫోన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత స్ట్రీమింగ్‌ తీరే మారిపోయింది.

Post a Comment

0 Comments

Close Menu