Ad Code

జనరేటివ్ ఏఐ కోసం కాగ్నిజెంట్‌-మైక్రోసాఫ్ట్ మధ్య సహకార ఒప్పందం ?


నరేటివ్ ఏఐ, కోపైలట్స్ టూల్స్ అభివృద్ధిపై మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్‌తో భాగస్వామ్యాన్ని విస్తరిస్తామని కాగ్నిజెంట్‌ తెలిపింది. జనరేటివ్ ఏఐ, కోపైలట్ టూల్స్ వినియోగంలో రెండు సంస్థల ఉద్యోగుల మధ్య అనుభవాలను పెంపొందిస్తామని, తద్వారా ఇండస్ట్రీలోనే ఇన్నోవేషన్ వేగవంతం చేస్తామని తెలిపింది. వ్యూహాత్మక వ్యాపార పరివర్తనకు వాస్తవ రూపం ఇచ్చేందుకు క్లయింట్ల సేవల్లో జనరేటివ్ ఏఐ ఆపరేషనలైజ్ చేయడానికి, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సర్వీసుల్లో ఉద్యోగులకు చేయూతనిచ్చేందుకు మైక్రోసాఫ్ట్ కో-పైలట్‌, కాగ్నిజెంట్ అడ్వైజరీ మధ్య భాగస్వామ్య ఒప్పందం ఉపకరిస్తుందని తెలిపింది. ఇందుకోసం లక్ష కోట్ల డాలర్ల నిధులు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమని కాగ్నిజెంట్ తెలిపింది. ఈ రెండు సంస్థల మధ్య భాగస్వామ్య ఒప్పందంతో భారత్‌కు కూడా లబ్ధి చేకూరుతుందని వెల్లడించింది. 2025 నాటికి భారత్ జీడీపీలో ఏఐ వాటా 450-500 బిలియన్ డాలర్లకు చేరుతుందని తెలిపింది. ఇది ఐదు లక్షల కోట్ల డాలర్ల అమెరికా జీడీపీ లక్ష్యంలో పది శాతం అని వివరించింది. రెండు సంస్థల మధ్య భాగస్వామ్యం ప్రకారం తన అసోసియేట్స్ కోసం 25 వేల మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్ సీట్లను కాగ్నిజెంట్ కొనుగోలు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా తమ 2000 క్లయింట్లకు సేవలందించేందుకు మైకోసాఫ్ట్ 365 కోపైలట్‌లో పని చేసేందుకు 500 సేల్స్ కోపైలట్ సీట్లు, 500 సర్వీసెస్ కోపైలట్ సీట్లను నియమిస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu