Ad Code

తక్కువ ధరలో టాప్ బ్రాండ్ ఏసీలు !


సీలు నిత్యావసరాల్లో చేరిపోయింది. తక్కువ ధరలో టాప్ బ్రాండ్స్ ఏమున్నాయో చూద్దాం. 

హైయర్ 1 టన్ 3 స్టార్ హైయర్ కంపెనీకి చెందిన ఈ వన్ టన్ ఏసీలో ట్విన్ ఇన్వర్టర్ కంప్రెసర్ ఉంది. దీనిలోకి ఐదు కన్వర్టిబిలిటీ మోడ్ లతో విద్యుత్ వాడకాన్నిగణనీయంగా తగ్గించవచ్చు. 110 చదరపు అడుగుల గదులు, స్థలానికి సరిపోతుంది. పది కిలోల బరువుతో ఆకర్షణీయమైన తెలుపు రంగులో ఆకట్టుకుంటుంది. దీని శబ్ధం స్థాయి 25 డీబీ, అలాగే ఏడాదికి ‎688.52 వాట్స్ విద్యుత్ ఖర్చవుతుంది. యాంటీ బాక్టీరియల్ ఫిల్టర్, అగ్ని ప్రమాదాల నుంచి భద్రత కోసం హైపర్ పీసీబీ నిర్మాణం దీని ప్రత్యేకతలు. ఈ ఏసీ రూ. 29,990కు అందుబాటులో ఉంది.

కేరియర్ 1 టన్ 3 స్టార్ మెరుగైన చల్లదనాన్ని అందించే అధునాతన కూలింగ్ వ్యవస్థ ఈ ఏసీలో ఉంది. 6 ఇన్ 1 కన్వర్టిబిలిటీతో విద్యుత్ వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. ఇన్వర్టర్ కంప్రెసర్ టెక్నాలజీ, ఇన్‌స్టా కూల్ ఫీచర్ ద్వారా నిమిషాల వ్యవధిలో చల్లదనాన్ని పొందవచ్చు. హాని కలిగించే నలుసులు, చిన్న కణాలను ఫిల్టర్ చేస్తుంది. ఈ ఏసీ బరువు తొమ్మిదిన్నర కేజీలు, తెలుపు రంగులో అందుబాటులో ఉంది. శబ్దం స్థాయి ‎32 డీబీ, వార్షిక శక్తి వినియోగం ‎704.46 కిలోవాట్లు. మంచి కూలింగ్ వ్యవస్థ కలిగిన ఈ ఏసీ రూ.29,990కు లభిస్తుంది.

హైసెన్స్ 1.5టన్ 3 స్టార్ లోని ఇంటెలిజెంట్ ఇన్వర్టర్ కంప్రెసర్ మెరుగైన సామర్థ్యంతో పనిచేస్తుంది. ఇది 1.5 టన్నుల యూనిట్. 180 చదరపు అడుగుల వైశాల్యం కలిగిన గదులకు చక్కగా సరిపోతుంది. దీనిలోని 100 శాతం కాపర్ కండెన్సర్ కాయిల్ తో తుప్పు సమస్య ఉండదు. మిగిలిన ఏసీల కంటే తక్కువ విద్యుత్ ఖర్చవుతుంది. నాలుగు కన్వర్టిబిలిటీ మోడ్‌లతో అతి చల్లని గాలిని అందజేస్తుంది. ఈ ఏసీ బరువు 33.50 కిలోలు. తెలుపు రంగులో అందుబాటులో ఉంది. శబ్దం స్థాయి ‎35 డీబీ. ఈ ఏసీ ధర రూ.రూ. 29,990.

డయాకిన్ 0.8 టన్ 3 స్టార్ చల్లని గాలిని అందించడంలో ఇతర ఏసీల కన్నా దాదాపు 20 శాతం ఎక్కువ మెరుగ్గా ఉంటుంది.ఇది 0.8 టన్ యూనిట్. పీఎం 2.5 ఫిల్టర్‌తో హానికలిగించే నలుసులు, ఇతర కణాల నుంచి రక్షణ కల్పిస్తుంది. దీనిలోని పవర్ చిల్ ఆపరేషన్ చల్లటి గాలిని అందజేస్తుంది. విద్యుత్ వినియోగం కూడా చాలా తక్కువగా ఉంటుంది. 100 శాతం కాపర్ కండెన్సర్ కాయిల్స్‌తో తుప్పు తదితర సమస్యలు లేకుండా చక్కగా పనిచేస్తుంది. తెలుపు రంగులో లభించే ఈ ఏసీ బరువు 36 కిలోలు, శబ్ధం స్థాయి 32 జీబీ, ఏడాదికి ‎548.84 కిలోవాట్ల విద్యుత్ ఖర్చవుతుంది. ఈ ఏసీ రూ.25,990కు వినియోగదారులకు అందుబాటులో ఉంది.

క్రూయిజ్ 1.5 టన్ 3 స్టార్ ఏసీలోని టర్బో, డ్రై మోడ్ వంటి కూలింగ్ మోడ్‌లు మెరుగైన చల్లదనాన్ని అందిస్తాయి. 1.5 టన్ను సామర్థ్యంతో లభించే ఈ 3 స్టార్ ఏసీ సుమారు 111 నుంచి 150 చదరపు అడుగుల వైశాల్యం గల గదులు, ఖాళీ స్థలానికి బాగా సరిపోతుంది. రస్ట్-ఓ-షీల్డ్‌ను కలిగిన రాగి కండెన్సర్‌తో పనితీరు బాగుంటుంది. యాంటీ వైరస్ రక్షణతో కూడిన హెచ్ డీ ఫిల్టర్‌తో దీని ప్రత్యేకత. మ్యాజిక్ ఎల్ ఈడీ డిస్‌ప్లేను కలిగిన ఈ ఏసీ బరువు 11 కిలోలు మాత్రమే. తెలుపు రంగులో లభిస్తుంది. వార్షిక శక్తి వినియోగం ‎952.88 కిలోవాట్లు. ప్రీమియం డిజైన్, హై గ్రూవ్డ్ కాపర్ ఇంటిగ్రేషన్ దీని ప్రత్యేకతలు. ఈ ఏసీ ధర రూ.28,290.


Post a Comment

0 Comments

Close Menu