Ad Code

ప్రాణాలు కాపాడిన ఆపిల్ స్మార్ట్‌వాచ్‌ ఫాల్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ ?


మెరికాలోని న్యూయార్క్‌కు చెందిన 49 ఏళ్ల ఎరిక్‌ జోలింగర్‌ సైకిల్ పై ఇంటికి వెళ్తున్నారు. అతని ఇంటికి సమీపంలోని రోడ్డు వరద నీటిలో మునిగి ఉంది. ఆ రోడ్డుపై ఓ చోట గుంత ఉంది. దాన్ని గుర్తించని ఎరిక్‌ దాన్ని ఢీకొట్టి పక్కనే ఉన్న పుట్‌పాత్‌పైన పడిపోయారు. అనంతరం ఘటన ప్రాంతం నుంచి లేచి ఇంటికి వెళ్లారు. అయితే స్నానం చేస్తున్న సమయంలో తన ముక్కు నుంచి రక్తస్రావం కావడం గమనించాడు. కొద్దిసేపటికే స్పృహతప్పి పడిపోయాడు. ఈ ఘటన గుర్తించిన ఆపిల్‌ ఫాల్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ యాక్టివేట్‌ అయింది. కొన్ని సెకన్లపాటు వేచి చూసిన ఈ ఫాల్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ అతను స్పందించకపోవడంతో ఎమర్జెనీ టీంకు సమాచారం అందించింది. ఫలితంగా సరైన సమయానికి చికిత్స అందింది. దీంతోపాటు అతని సన్నిహితులకు కూడా ఈ ఫీచర్‌ సమాచారం అందించింది. కోలుకున్న తర్వాత ఎరిక్‌ జోలింగర్‌ ఆపిల్‌ వాచ్‌ పనితీరును మెచ్చుకున్నారు. ఆపిల్‌ సంస్థ ఈ ఫాల్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ను 2018 సంవత్సరంలో ఆపిల్‌ వాచ్‌ సిరీస్ 14తో లాంచ్‌ చేసింది. దీంతోపాటు ఈ వాచ్‌ అనేక ఫీచర్లను కలిగి ఉంది. యాక్సెలిరోమీటర్‌, గైరోస్కోప్‌ సెన్సార్‌ ఈ ఫాల్‌ డిటెక్షన్‌ ఫీచర్‌లో కీలకంగా వ్యవహరిస్తాయి. ఆపిల్‌ ఫాల్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ ఎవరైనా వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలడాన్ని గుర్తించిన అనంతరం ఓ అలాన్‌ను మోగిస్తుంది. అయితే సదరు వ్యక్తి స్పృహలో ఉన్నట్లయితే అలారంను ఆఫ్‌ చేస్తారు. అలారం మోగుతున్న ఎటువంటి చలనం లేని పరిస్థితితిలో కొన్ని సెకన్లపాటు వేచి చూస్తుంది. అప్పటికీ ఎటువంటి చలనం లేకుంటే అలారంను ఆఫ్‌ చేసి.. ఎమర్జెన్సీ టీం, ఆ వ్యక్తి తన స్మార్ట్‌వాచ్‌లో ముందే నమోదు చేసుకున్న ఫోన్ నంబర్‌కు సమాచారం చేరవేస్తుంది. ఎమర్జెన్సీ టీం సహా బాధితుల సన్నిహితులకు ఘటనకు సంబంధించిన ప్రాంతం వివరాలు పంపిస్తుంది. 

Post a Comment

0 Comments

Close Menu