Ad Code

సార్వత్రిక ఎన్నికలకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత టూల్స్‌ నుంచి ముప్పు ?


సార్వత్రిక ఎన్నికలకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత టూల్స్‌ నుంచి ముప్పు ఉందని తెలుస్తోంది. చైనాకు చెందిన వ్యక్తుల నుంచి ఈ ప్రమాదం ఉందని ప్రముఖ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన బ్లాగ్‌లో పోస్టు చేసింది. ఈ సంవత్సరం ఎన్నికల జరగనున్న అమెరికాలోనూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌  టూల్స్‌ ద్వారా ప్రజలను ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా భారత్‌, అమెరికా, సౌత్‌ కొరియా వంటి దేశాల్లో తమ ప్రయోజనాల కోసం చైనా ఈ తరహా కంటెంట్‌ ద్వారా ప్రభావితం చేసే అవకాశం ఉందని అంచనా వేసింది. హ్యాకర్లకు ప్రస్తుతం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ప్రధాన ఆయుధంగా మారుతుందని మైక్రోసాఫ్ట్‌ అభిప్రాయపడింది. వీడియోలను మార్ఫింగ్ చేయడం మరియు వ్యక్తుల వాయిస్‌ను మార్చి ప్రచారం చేయడం ద్వారా లక్షల మందికి చేరుకొనేందుకు ఉపయోగపడుతుంది. చైనా మరియు అమెరికా మధ్య వాణిజ్య సంబంధిత విభేదాలు మరియు భారత్‌తో వివిధ విభేదాలతో చైనా గత కొంతకాలంగా ఈ రెండు దేశాలలో విభేదిస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు తన అనుకూలంగా మార్చుకొనేందుకు చైనా సోషల్‌ మీడియాలో నకిలీ ఖాతాలను ఉపయోగిస్తోంది. అయితే ఎన్నికల్లో అవాంతరాలు కలిగించేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలను చూపిస్తు మైక్రోసాఫ్ట్‌ చెప్పిన కొన్ని అంశాల్లో 2023 ఆగస్టులో మౌయి ఘటన కూడా ఉంది. మిలిటరీ గ్రేడ్‌ ఆయుధాన్ని పరీక్షించిన కారణంగా మంటలు చెలరేగినట్లు పేర్కొంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత టూల్స్ ద్వారా కంటెంట్‌ను క్రియేట్‌ చేసి వైరల్‌ చేయడంపై మైక్రో సాఫ్ట్‌ తన బ్లాగ్‌లో పేర్కొంది. ఈ సంవత్సరం జరిగే తైవాన్ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఈ తరహా టెక్నాలజీని ఉపయోగించడం గురించి తన బ్లాక్‌లో రాసుకొచ్చింది.


Post a Comment

0 Comments

Close Menu