Ad Code

వాట్సాప్‌ లో మెటా ఏఐ విత్‌ లామా ఫీచర్ ?


వాట్సాప్‌ తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ రంగంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీకి పెరుగుతోన్న డిమాండ్‌ నేపథ్యంలో మెటా కూడా ఈ దిశగా అడుగులు వేసింది. ఇందులో భాగంగానే మెటా ఏఐ పేరుతో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇప్పటికే కొంత మంది యూజర్లకు ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. మెటా తీసుకొచ్చిన ఈ ఏఐ సెర్చ్‌ టూల్‌ అచ్చంగా చాట్‌ జీపీటీలా పనిచేస్తుంది. రౌండ్‌ సింబల్‌ను క్లిక్ చేయగానే ‘మెటా ఏఐ విత్‌ లామా’ అనే చాట్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది. ఈ అడ్వాన్స్‌డ్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీతో ఏ ప్రశ్న అడిగినా ఇట్టే సమాధానం చెప్తుంది. ఇందులో కొన్ని ప్రశ్నలను అదే సజెస్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ చాట్‌ బాట్ కేవలం ఇంగ్లిష్‌లోనే ఉంది. దీని కోసం వాట్సాప్ ఓపెన్ చేయగానే కనిపించే రౌండ్‌ ఐకాన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం టర్మ్స్‌ అండ్‌ కండీషన్స్‌ను యాక్సెప్ట్‌ చేయాలి. ఆ తర్వాత స్క్రీన్ మీద కనిపించే ప్రాంప్ట్‌ను ఎంచుకోవచ్చు లేదా మీకు వచ్చిన సందేహాన్ని అక్కడ పేస్ట్ చేయవచ్చు. సెండ్‌ బటన్‌ నొక్కగానే ఏఐ మీతో చాట్‌ చేస్తుంది. టెక్ట్స్‌, ఫొటోల రూపంలో మీకు ఏఐ సమాధానం ఇస్తుంది. ఉదాహరణకు ఇమాజిన్‌ కార్‌ రేస్‌ ఆన్‌ మార్స్‌ అనే ప్రశ్నను ఇస్తే.. మార్స్‌పై నిజంగానే కార్‌ రేస్ జరిగితే ఎలా ఉంటుంది అన్న ఫొటోను వెంటనే ఏఐ ఇస్తుంది. ఎడ్యుకేషన్‌ మొదలు హెల్త్‌ వరకు టెక్నాలజీ నుంచి సైన్స్ వరకు అన్ని రకాల ప్రశ్నలకు ఈ మెటా ఏఐలో సమాధానం లభిస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu