Search This Blog
Thursday, January 20, 2022
సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ప్రయోగం సక్సెస్!
Sunday, July 25, 2021
యువ సైంటిస్ట్
బస్టాపుల్లో ఉండి, పబ్లిక్ టాయిలెట్లలో పనిచేసి, ఒక మిత్రుడు కొద్దిగా ధన సహాయం చేయడంతో C++, Java, Python వగైరా నేర్చుకున్నాడు. మిత్రుల నుంచి మరియు ఆఫీసుల నుంచి e-waste రూపంలో కీ బోర్డులు, మౌస్‌లూ తదితర కంప్యూటర్ సామాన్లు సేకరించి వాటిపై పరిశోధన చేసేవాడు. మైసూరులోని ఎలక్ట్రానిక్ కంపెనీల వద్దకు వెళ్ళి e-waste రూపంలో వస్తువులను సేకరించి ఒక డ్రోన్ తయారుచేయాలని ప్రయత్నాలు ప్రారంభించాడు. పగలు చదువు మరియు పనులు, రాత్రి ఆవిధంగా ప్రయోగాలు చేస్తుండేవాడు. ఈవిధంగా సుమారు ఓ 80 ప్రయత్నాల తరువాత అతను తయారు చేసిన డ్రోన్ గాల్లోకి ఎగిరింది. ఈ సందర్భంలో అతను ఓ గంటసేపు ఆనందంతో వెక్కి వెక్కి ఏడ్చాడట.డ్రోన్ సక్సెస్ విషయం తెలియడంతో అతను మిత్రుల మధ్య హీరో అయిపోయాడు. అతని వద్ద ఇంకా చాలా డ్రోన్ మోడల్ ప్లాన్‌లు ఉన్నాయి.ఇంతలో ఢిల్లీలో డ్రోన్ కాంపిటీషన్స్ జరుగబోతున్నాయన్న వార్త తెలిసింది. దానితో కూలి పనులకు వెళ్ళి ఓ 2000/- కూడబెట్టుకుని ఢిల్లీకి జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణం కట్టాడు. ఆ కాంపిటిషన్‌లో 2nd ప్రైజ్ వచ్చింది. అంతేకాకుండా జపాన్ వెళ్ళి ప్రపంచ డ్రోన్ కాంపిటిషన్‌లో పాల్గొనే అవకాశం లభించింది.ఆ ఆనందంతో మళ్ళీ ఓ గంట వెక్కి వెక్కి ఏడ్చాడు. జపాన్‌కు పోవడం లక్షలతో కూడుకున్న వ్యవహారం. అంతేకాకుండా ఎవరో ఒకరి రెఫరెన్స్ తప్పనిసరి. చైన్నైలోని ఒక ఇంజనీరింగ్ కాలేజి ప్రొఫెసర్ రెఫరెన్స్ ఇచ్చేలా ఒక మిత్రుడు సహాయం చేశాడు.విమాన టికెట్లకు మైసూరు లోని ఒక దాత ముందుకు వచ్చాడు. ఇతర ఖర్చుల కోసం తన తల్లి తన మంగళ సూత్రాన్ని మరియు కమ్మలు అమ్మగా వచ్చిన 60,000/- ఇచ్చింది.
బెంగుళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ఎక్కి టోక్యోలో దిగాడు. బుల్లెట్ ట్రైన్ ఎక్కే స్తోమత లేదు, సాధారణ రైల్లో 16 స్టేషన్లలో రైళ్ళు మారి చివరి స్టేషన్లో దిగాడు. అక్కడి నుంచి మరో 8 కి.మీ లగేజీ మోసుకుంటూ నడిచి వెళ్ళి చివరకు గమ్యం చేరాడు. అక్కడ మొత్తం హైఫై పీపుల్ ఉన్నారు. అత్యంత సోఫెస్టికేటెడ్ డ్రోన్స్ వచ్చి ఉన్నాయి. కాంపిటిషన్‌లో పార్టిసిపేషన్ చేసేవాళ్ళు బెంజ్, రోల్స్‌రాయిస్ కార్లలో వచ్చి ఉన్నారు. అర్జునునికి చెట్టు కనపడలేదు, పక్షి కనపడలేదు, పక్షికన్ను మాత్రమే కనపడింది.. అలాగే మన ప్రతాప్‌కు కూడా తన మనస్సు తన డ్రోన్ మోడల్‌పైనే ఉంది. తన మోడల్స్ వారికి సమర్పించి, డ్రోన్ పనితీరు చూపించాడు. వారు రిజల్ట్స్ ఫేజ్డ్ మ్యానర్‌లో అనౌన్స్ చేయడానికి సమయం పడుతుంది వెయిట్ చేయమన్నారు. మొత్తం 127 దేశాల నుంచి ప్రతినిధులు ఆ కాంపిటిషన్‌లో పాల్గొన్నారు. రిజల్ట్స్ డిక్లేర్ చేయడం ప్రారంభించారు. ప్రతాప్ పేరు ఏ రౌండ్లోనూ వినపడలేదు. నిరాశకు గురయ్యాడు, తన మోడల్ అసలు క్వాలిఫై కాలేదేమోనని బాధపడుతూ అశ్రునయనాలతో మెల్లగా లేచి వచ్చేస్తున్నాడు. ఇంతలోనే 3వ ప్రైజ్ అనౌన్స్ చేశారు, అది ఫ్రాన్స్‌కు వెళ్ళింది. తరువాత 2వ ప్రైజ్ అనౌన్స్ చేశారు, అది అమెరికాకు వెళ్ళింది. అప్పిటికి మన ప్రతాప్ నిరాశతో తిరిగి వచ్చేస్తూ ఆ ప్రాంగణం గేటు దగ్గరకు చేరుకున్నాడు. ఇంతలో చివరి అనౌన్స్‌మెంట్ వినిపించింది: "Please Welcome #Mr_Pratap, First Prize, From INDIA." అంతే లగేజీ అక్కడే వదిలేశాడు, కిందపడిపోయాడు, బిగ్గరగా ఏడ్చేశాడు, తన తల్లిదండ్రులు, గురువులు, మిత్రులు, ధన సహాయం చేసిన దాతల పేర్లను స్మరిస్తూ పోడియం వద్దకు చేరుకున్నాడు.రెండవ స్థానంలో ఉన్న అమెరికా ఫ్లాగ్ దిగిపోతూ, మొదటి స్థానం సంపాదించిన భారత్ ఫ్లాగ్ పైకి పోతూ ఉన్నది. ఇటు కాళ్ళూ చేతులూ వణికిపోతూ చెమటలు పట్టిన ప్రతాప్ స్టేజ్ పైకి చేరుకున్నాడు.
మొదటి ప్రైజ్ తోపాటు 10,000 డాలర్లు అతనికి బహుమతిగా అందాయి. (సుమారు 7 లక్షల రూపాయలు) 3వ బహుమతి వచ్చిన ఫ్రాన్స్ వాళ్ళు అక్కడే అతనిని సంప్రదించారు. "నీకు నెలకు 16 లక్షల జీతం ఇస్తాం, ప్యారిస్‌లో ప్లాటు మరియు 2.5 కోట్ల విలువైన కారు ఇస్తాం. ఇటు నుంచి ఇటే మా దేశానికి వచ్చేయ్" అన్నారు "నేను డబ్బు కోసం ఇదంతా చేయలేదు నా జన్మ భూమికి సేవచేయడమే నా సంకల్పం" అని వారికి కృతజ్ఞతలు తెలిపి స్వదేశం చేరుకున్నాడు. మోదీజీ అతనిని అభినందించి DRDOకు రెఫర్ చేశారు. ఇప్పుడు అతను DRDO లో డ్రోన్ విభాగంలో సైంటిస్టుగా నియమితులయ్యారు.
Friday, July 23, 2021
మిసైల్ ప్రయోగం విజయవంతం
ఉపరితలం నుంచి గగనతలంలో 30 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఆకాశ్ సొంతం. ఇవాళ్టి టెస్ట్ లో.. లాంచర్, రాడర్, కమాండ్ అండ్ కంట్రోల్‌తో పాటు పూర్తి ఆయుధ వ్యవస్థ పనితీరును సమీక్షించినట్లు డీఆర్డీఓ తెలిపింది.
Popular Posts
-
Andhra Pradesh State board of Secondary Education BSEAP, conducted AP SSC/X Class/10th Class Examination 2013 on March/April 2013. An...
-
1. LifeHacker.co.uk LifeHacker aims to help its users out with life in the modern world. Popular tags include ‘Productivity’, ‘Money’ a...
-
Type Indian langauges in windows applications with Anu script manager 7.0 Supported Langauges: - Hindi, Devnagari, Telugu, Tamil, Ka...