Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Tuesday, November 30, 2010

టెక్‌ కార్నర్‌

సూపర్‌ కంప్యూటర్‌
ఎక్కువ స్పీడ్‌, పనితనాన్ని చూపగలిగే అతి పెద్ద కంప్యూటర్లను సూపర్‌ కంప్యూటర్లుగా పిలుస్తారు.
సూపర్‌ ఫ్లాపీ
సాధారణ కెపాసిటీ కంటే ఎక్కువ కెపాసిటీ నిల్వ చేయగలిగే ఫ్లాపీలను సూపర్‌ ఫ్లాపీలంటారు.
స్టాటిక్‌ ర్యామ్‌
ఎస్‌ర్యామ్‌గా కూడా పిలిచే ఈరకమైన ర్యామ్‌ చిప్‌లలో డేటా ఒకసారి లోడ్‌ చేసిన తరువాత కరెంట్‌ పోయేవరకు (కంప్యూటర్‌ ఆఫ్‌ అయ్యేవరకు) మన తీయకపోతే తొలగిపోదు. ఈ రకమైన మెమోరీని క్యాచ్‌ మెమోరికి ఉపయోగిస్తారు. జనరల్‌గా ర్యామ్‌గా ఉపయోగపడే డైనమిక్‌ ర్యామ్‌లో డేటాని తరచూ రిఫ్రెష్‌ చేయవలసి వుండగా దీనిలో అటువంటి అవసరం వుండదు.
స్టెప్పర్‌ మోటార్‌
డిస్క్‌ డ్రైవ్‌ల్లో ఏక్సెస్‌ ఆర్క్‌ని కంట్రోల్‌ చేస్తూ ఒకసారి నిర్దేశితప్రదేశాన్ని మాత్రమే త్రిప్పడానికి ఉపయోగించే చిన్న మోటార్‌ని స్టెప్పర్‌ మోటార్‌ అంటారు. ఈ స్టెప్పర్‌ మోటార్లను ఇటువంటి అవసరం కలిగిన ఇతర పరికరాలలో కూడా ఉపయోగిస్తారు.
స్టాఫ్‌ బిట్‌
ఏదైనా ట్రాన్స్‌మిషన్‌ పూర్తయిన తరువాత ఆ సమాచారాన్ని తెలియజేయడానికి పంపించే సిగల్‌ని స్టాప్‌ బిట్‌ అంటారు.
స్టోరేజ్‌
కంప్యూటర్లలో డేటాని నిల్వ చేయడాన్ని స్టోరేజ్‌ అంటారు. ఇటువంటి పనికి ఉపయోగించే ప్లాఫీ, సిడి, డివిడి డ్రైవ్‌ లాంటి వాటిని స్టోరేజ్‌ డివైజెస్‌గా పేర్కొంటారు. డేటా నిల్వచేసే ఫ్లాపీ, సిడి, డివిడిలాంటి వాటిని స్టోరేజ్‌ మీడియాగా పిలుస్తారు.
స్ట్రీమింగ్‌ టేప్‌
మొత్తం హార్డ్‌ డిస్క్‌లోని డేటాని బేకప్‌ తీసుకోవడానికి పనికి వచ్చే హై కెపాసిటీ, హైస్పీడ్‌ మేగటిక్‌ టేప్‌లను స్ట్రీమింగ్‌ టేప్‌లంటారు.
స్ట్రింగ్‌
ప్రోగ్రామింగ్‌ పరిభాషలో ఏదైనా ఒక ప్రోగ్రామ్‌కి అందజేయబడే అల్పాన్యూమరిక్‌ కేరెక్టర్ల సమూహాన్ని ఆ ప్రోగ్రామ్‌ ఒకే యూనిట్‌గా గుర్తించేటట్లయితే ఆ సమూహాన్ని స్ట్రింగ్‌ అంటారు.
స్ట్రింజీ ప్లాపీ
తొలి తరం పర్సనల్‌ కంప్యూటర్లలో డేటాని నిల్వ చేయడానికి ఉపయోగించే 1/16'' టేప్‌ను స్ట్రింజీ ప్లాపీ అంటారు.
స్ట్రిపింగ్‌
డేటా ఏక్సెస్‌ వేగం పెంచడానికి డేటాని ఇంటర్‌లీప్‌ లేదా మల్టీ ప్లెక్సింగ్‌ చేయడాన్ని స్ట్రిపింగ్‌ అంటారు. ఉదాహరణకు డేటా సర్వర్లలో డేటాని కొన్ని భాగాలు చేసి వేర్వేరు హార్డ్‌డిస్క్‌ల్లో నిల్వ చేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల ఒకేసారి ప్రోసెసర్‌ వేర్వేరు హార్డ్‌ డిస్క్‌ల నుంచి ఆ డేటా యొక్క వేర్వేరు భాగాలను గ్రహిస్తుంది. దీనివల్ల డేటా ఏక్సెస్‌ వేగం గణనీయంగా పెరుగుతుంది.
స్ట్రోక్‌ ఫాంట్‌
గీతల ద్వారా తయారు చేయబడే ఫాంట్స్‌ను స్ట్రోక్‌ ఫాంట్‌గా పిలుస్తారు. సాధారణంగా అవుట్‌లైన్‌ ఫాంట్స్‌లో ఒక షేప్‌ను పిల్‌ చేయడం ద్వారా అక్షర రూపం పొందితే, స్ట్రోక్‌ ఫాంట్స్‌ల ఆ విధంగా పూర్తిగా ఫిల్‌ చేయకుండా మధ్యలో గీతలుంటాయి.
స్టయిల్‌ షీట్‌
వర్డ్‌ ప్రోసెసింగ్‌, డిటిపి వంటి అప్లికేషన్స్‌లో ఒక తరహా డాక్యుమెంట్‌ యొక్క లే అవుట్‌ సెట్టింగ్స్‌ని కలిగి ఉండే ఫైల్‌ని స్టయిల్‌ షీట్‌ అని అంటారు. మార్జిన్‌, ట్యాబ్‌, హెడర్స్‌, ఫుటర్స్‌, కాలమ్స్‌, ఫాంట్స్‌ వంటి మేకప్‌కు అవసరమైన అన్ని సెట్టింగ్స్‌ దీనిలో వుంటాయి.
స్టయిలెస్‌
కంప్యూటర్‌లో ఉపయోగించే ఇన్‌ఫుట్‌ పరికరం ఇది. పెన్సిల్‌లా వుండే దీనితో ప్రత్యేకంగా వుండే సెన్సర్స్‌పై వ్రాసినా, గీసినా అవి స్క్రీన్‌పై కనబడతాయి. ఈ పరికరం మౌస్‌ కన్నా ఎంతో ఉపయోగకరంగా వుంటుంది.
సబ్‌ డైరెక్టరీ
ఒక డైరెక్టరీలో వుండే మరో డైరెక్టరీని సబ్‌ డైరెక్టరీగా పిలుస్తారు. డాస్‌ మరియు ఓఎస్‌/2 ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌లో దీన్ని డైరెక్టరీగా పిలుస్తారు. అదే విండోస్‌లో అయితే పోల్డర్స్‌గా పిలుస్తారు.
సబ్‌ మెనూ
ఏదైనా అప్లికేషన్లలో ఒక మెనూలోని ఒక ఐటెమ్‌ను సెలెక్ట్‌ చేసుకుంటే మరొక మెనూ కనబడితే దానిని సబ్‌ మెనూ అంటారు.
సబ్‌ రొటీన్‌
ప్రత్యేకగా వ్రాయబడి అవసరాన్నిబట్టి ప్రోగ్రాంలో కాల్‌ చేయడం ద్వారా వాడటానికి వ్రాయబడిన ప్రోగ్రామ్‌ని సబ్‌ రొటీన్‌ అంటారు. ప్రత్యేక పనికి సబ్‌ రొటీన్‌ రాస్తే మెయిన్‌ ప్రోగ్రాంలో ఆ పని అవసరమైన ప్రతిసారీ తిరిగి ఆ కోడ్‌ మొత్తం రాయనవసరంలేకుండా అవసరమైనప్పుడల్లా దాన్ని ఉపయోగించుకోవచ్చు. పెద్ద వాటిని మాడ్యూల్స్‌ లేదా ప్రోసీజర్‌లుగా పిలిస్తే, చిన్నవాటిని మైక్రో లేదా ఫంక్షన్‌గా పిలుస్తారు.
సబ్‌ స్కీమా
డేటాబేస్‌ మేనేజ్‌మెంట్‌లో వినియోగదారునికి కనబడే ఆ భాగాన్ని సబ్‌ స్కీమా అంటారు. మొత్తం డేటాబేస్‌ను స్కీమాగా పిలుస్తారు.
సబ్‌ స్క్రిప్ట్స్‌
వర్డ్‌ ప్రోసెసింగ్‌ మరియు మేథమేటిక్స్‌లో సాధారణ టెక్ట్స్‌లోని అక్షరాలకు క్రింది భాగంలో కనబడే అక్షరాలు లేదా అంకెలను సబ్‌ స్క్రిప్ట్స్‌ అంటారు. (ఉదా: న2ఉ,జశీ2)
సూపర్‌ స్క్రిప్ట్స్‌
వర్డ్‌ ప్రోసెసింగ్‌ మరియు మేథమేటిక్స్‌లో సాధారణ టెక్ట్స్‌లోని అక్షరాలకు పై భాగంలో కనబడే అక్షరాలు లేదా అంకెలను సబ్‌ స్క్రిప్ట్స్‌ అంటారు. (ఉదా: న2ఉ,జశీ2)
సబ్‌ స్ట్రింగ్‌
ఏదైనా ఒక అల్ఫా న్యూమరిక్‌ ఫీల్డ్‌ లేదా వేరియబుల్‌లోని కొంత భాగాన్ని సబ్‌ స్ట్రింగ్‌ అంటారు. ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజీలో సబ్‌ స్ట్రింగ్‌ ఫంక్షన్‌ ద్వారా ఏదైనా ఒక ఫీల్డ్‌ లేదా వేరియబుల్‌లోని కొంత భాగాన్ని తీసుకోవచ్చు.
-ఫణి

Monday, November 29, 2010

బయో మెట్రిక్స్‌ అంటే ?





ఈ పదం సర్వ సాధారణమైంది. ప్రభుత్వ పథకాలలో, ఆఫీసులలో దీని వాడకం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. సురక్షితకు మారు పేరైంది. దానిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బయో అంటే జీవం, మెట్రిక్‌ అంటే ప్రమాణం. ఒక వ్యక్తి లేదా ప్రాణికి సంబంధించిన కొన్ని ప్రత్యేక లక్షణాలను పరిగణనలోకి తీసుకుని ఐడెంటీని గుర్తించడాన్ని బయో మెట్రిక్‌ అంటారు. ఇది వ్యవసాయం, వైద్య రంగాల్లో 20 శతాబ్దం నుండి వినియోగంలోకి వచ్చింది. దీని ద్వారా వ్యక్తి యొక్క లక్షణాలను కంప్యూటర్‌ ద్వారా విశ్లేషించి ఆ వ్యక్తికి సంబంధించినవి నిర్ధారించవచ్చు.
నేర పరిశోధనలో నేస్తం
ఇది నేర పరిశోధనలలో నేరస్తులను కనుగొనడానికి దోహదపడుతుంది. నేర స్థలంలో వేలి ముద్రలు, కాలి ముద్రలను అందరికీ తెలిసిందే. కొన్ని సందర్భాలలో ఆ ప్రదేశాల్లో దొరికిన సిగరెట్‌ పీకలు, రక్తపు మరకల ఆధారంగా జరిగే పరిశోధనల్లో ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. అలాగే పరీక్ష హాలులోకి అనుమతించడానికి హాల్‌ టిక్కెట్లపై అభ్యర్థి ఫొటోతో పాటు పుట్టు మచ్చలు ఎక్కడ ఉన్నాయో తెల్పడం జరుగుతుంటుంది. పాస్‌పోర్ట్‌, వీసాలలో జుట్టు, కనుపాపల రంగు వంటివి కూడా పేర్కొనబడతాయి. ప్రభుత్వ పథకాలలో కను పాపలు, వేలిముద్రల ద్వారా ఐడెంటీ కార్డులను జారీ చేయడం ఇప్పుడు మనం చూస్తూనే వున్నాయి. ఇవి అన్నీ బయోమెట్రిక్‌ పద్ధతుల ద్వారా చేసే పనులే.
బయోమెట్రిక్‌ పద్ధతులు
బయోమెట్రిక్‌లో రెండు పద్దతులున్నాయి. ఒకటి గుర్తించడం, రెండవది నిర్థారించడం. ఈ రెండు ప్రక్రియలలోనూ అనేకాంశాలు పరిగణనలోకి తీసుకోబడతాయి. వేలి ముద్రలు, ముఖం, కనుపాపలు వంటివి భౌతికాంశాలు. సంతకం, కీబోర్డు, మౌస్‌ వంటి పరికరాలను ఉపయోగించే విధానం, మాట్లాడే తీరు వంటి అంశాలను ప్రవర్తన సంబంధించిన అంశాలంటారు. వీటి ఆధారంగా ఒక వ్యక్తిని ఖచ్చితంగా గుర్తించడం, అవి ఆ వ్యక్తికి సంబంధించినవే అని నిర్ధారించవచ్చు.
బయో మెట్రిక్‌ పరికరాలు
బయో మెట్రిక్‌ ద్వారా వ్యక్తులను గుర్తించడానికి రకరకాల పద్ధతులను వినియోగించ్చు. దీనికోసం పలురకాల టెక్నాలజీలు ఆవిర్భంచాయి. నేరం చేయబోయే ముందు వ్యక్తి నాడీ మండలంలో జరిగే ప్రకరణలను గుర్తించే బ్రైన్‌ ఫింగర్‌ ప్రింటింగ్‌. వేలిముద్రలను పరిశీలించి కంప్యూటర్‌ ద్వారా విశ్లేషించే ఫింగర్‌ ప్రింటింగ్‌. కనుపాలను పోల్చి చూడడం ద్వారా వ్యక్తిని గుర్తించగలిగే ఐరిష్‌ రికగేషన్‌. మాటలను గుర్తించగలిగే వాయిస్‌న రికగేషన్‌, ముఖ కవళికలు గుర్తించగలిగే ఫేస్‌ రికగేషన్‌ మొదలైనవి వీటిలో కొన్ని.
కీలకమైన సమాచారాన్ని కలిగి వున్న కంప్యూటర్లు లేదా నెట్‌వర్క్‌లలో పనిచేస్తున్న వ్యక్తికి దానిని వినియోగించడానికి అధికారం లేదా అనుమతి వుందా? లేక నేరానికి పాల్పడుతున్నాడా అనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవడం ద్వారా సైబర్‌ నేరాలను నివారించవచ్చు. దీనికి పాస్‌వర్డ్‌ల కన్నా బయోమెట్రిక్‌ విధానం సురక్షితం. ఈ పద్ధతి అనేకచోట్ల విరివిగా వాడకంలోకి కూడా రావడం మనం గమనించవచ్చు.
-శాంతి

లైనక్స్‌ ఆధ్యుడు లైనస్‌ టోర్‌వాడ్స్‌



లైనక్స్‌ ఈ పదం తెలియని కంప్యూటర్‌ ప్రియులండరు. యునెక్స్‌, డాస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ రాజ్యమేలుతున్న రోజులలో వాటికి ధీటుగా ఉచిత లైనక్స్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను సృష్టించిన ఘనత లైనస్‌ టోర్‌వాడ్స్‌దే. మైక్రోసాఫ్ట్‌ వాటి కంపెనీలను గడగడలాడించే స్థితికి వచ్చిన ఈ లైనక్స్‌ ఓఎస్‌ అభివృద్ధిలో ఎందరో మహానుభావులున్నప్పటికి ఆధ్యుడు మాత్రం లైనస్‌. బడా బడా కంపెనీలు సైతం లైనెక్స్‌ ఓఎస్‌ ఆధారంగా పనిచేసే సాఫ్ట్‌వేర్‌లను తయారు చేస్తున్నాయంటే దీని వాడకం ఏ విధంగా పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. సర్వర్లకు సైతం సురక్షిత ఓఎస్‌గా గణతకెక్కింది. అయితే ఒక కొరత మాత్రం ఇప్పటికీ వెంటాడుతుంది. అదేమంటే ముద్రణ రంగంలో పేజీనేషన్‌ వర్డ్‌ కంపోజింగ్‌, ఫొటోషాప్‌ తదితర సాఫ్ట్‌వేర్‌లను వేగవంతంగా పని చేయించే కృషి ఇంకా ఊపందుకోలేదు. దీనిని కూడా భర్తీ చేస్తే లైనెక్స్‌కు తిరుగేలేదు.
బడా కంపెనీల కబంధాస్తల నుండి కంప్యూటర్‌ వినియోగదారులను రక్షించినది ఈ లైనక్సే. లైసెన్స్‌ సాఫ్ట్‌వేర్‌లకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ ఉద్యమానికి నాంది పలికింది ఈ లైనెక్స్‌. మన రాష్ట్రంలో కూడా ఈ ఉద్యమం ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ ఫౌండేషన్‌ ద్వారా సాగుతుంది. ఔత్సాహిక ప్రోగ్రామర్లు ఈ సాఫ్ట్‌వేర్‌ని సోర్స్‌కోడ్‌తో సహా ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకుని, తమకు నచ్చిన విధంగా మోడిఫై చేసుకొని వినియోగించుకోవడం, ఇతరులకు పంచడంతో పాటు నామ మాత్ర ధరకు వ్యాపారం చేసుకునే వీలు వుండటంతో ఇది ఎంతో ప్రీతిపాత్రమైంది. దీని అభివృద్ధికి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల మంది సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లు తమ వంతు కృషి చేసినప్పటికీ దీని ముఖ్యాంతర్భాగమైన కెర్నల్‌ని తయారుచేసి ప్రపంచానికి అందించి అమెరికాలోని శాంతాకార్లాలో ఉద్యోగిగానే సాధారణ జీవితం గడుపుతున్నాడు. కొన్ని వందల కోట్లను ఆర్జించే అవకాశానిన వదులుకుని, అత్యుత్తమ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను ప్రజలకు అందించిన లైనస్‌ టోర్‌వాడ్స్‌ గురించి తెలుసుకుందాం.
1969 డిసెంబర్‌ 28న ఫిన్‌లాండ్‌లోని హెల్సంకీలో స్వీడీష్‌ మాట్లాడే మైనారిటీ కుంటుంబంలో లైనస్‌ టారోవాడ్స్‌ జన్మించాడు. ఆయన తాతగారు హెల్సింకీలోని విశ్వ విద్యాలంలో ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. ఆయన లైనస్‌ చిన్నతనంలో ఒక కంప్యూటర్‌ను బహూకరించాడు. ఆ కంప్యూటర్‌ యొక్క ఆర్కిటెక్చర్‌ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. విశ్వ విద్యాలయంలో కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌లో విద్యార్థిగా వున్నప్పుడు కొనుగోలు చేసిన కంప్యూటర్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌కోసం వెదికే పనిలో భాగంగా తానే ఆపరేటింగ్‌ సిస్టమ్‌ తయారు చేయాలనే ఆసక్తి కలిగింది. అప్పటిలో పర్సనల్‌ కంప్యూటర్‌లలో డాస్‌ను ఉపయోగించేవారు. దాని మీద ఎటువంటి అప్లికేషన్‌లు రన్‌ చేయాలన్నా యునెక్స్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను ఉపయోగించేవారు. యూనివర్శిటీలో కూడా యునెక్స్‌నే నేర్పేవారు. అయితే అది పర్సనల్‌ కంప్యూటర్లలో పనిచేసేదికాదు. ఇది పని చేయాలంటే అత్యంత ఖరీదైన వర్క్‌ స్టేషన్లు అవసరముండేది. దీనితో సాధారణ వినియోగదారుడు దానిని వినియోగించడం సాధ్యమయ్యేదికాదు. అప్పట్లో పర్సనల్‌ కంప్యూటర్‌లలో యునెక్స్‌ని పనిచేయించడానికి మినిక్స్‌ వంటి కొన్ని ప్రాజెక్ట్‌లు నడిచినప్పటికీ అవి అంతగా విజయవంతం కాలేదు. దీనితో పర్సనల్‌ కంప్యూటర్‌పై పనిచేసే యునిక్స్‌ని పోలిన ఆపరేటింగ్‌ సిస్టమ్‌ని తయారుచేసే పనిని ప్రారంభించాడు. 1991 మొదట్లో ప్రత్యామ్నాయ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ యొక్క కెర్నల్‌ని తయారుచేసే పనిని పూర్తి చేశాడు. ఫ్రీ యునెక్స్‌కి హ్యాకర్‌ 'ప్రీయక్స్‌'కి పర్యాయపదంగా ఈ ఆపరేటింగ్‌ సిస్టమ్‌కి 'ప్రీయక్స్‌' అని పేరు పెట్టారు. అయితే దానిని ఎఫ్‌టిపి సైట్‌లో అప్‌లోడ్‌ చేసేటప్పుడు సైట్‌ మేనేజర్‌ ఈ పేరు బాగోలేదని లైనక్స్‌ అని పెట్టాడు.
తొలి వర్షన్‌ ఆవిష్కరణ
1991 అక్టోబర్‌లో లైనక్స్‌ 0.2 వర్షన్‌ని సైట్‌పై ఆవిష్కరించారు. కంప్యూటర్‌పై పని చేయగలిగే తొలి లైనక్స్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఇదే. ఈ సందర్భంగా లైనస్‌ తోటి మినిక్స్‌ న్యూస్‌ గ్రూప్‌లోని ప్రోగ్రామర్లను ఈ కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేయడానికి, తమ స్వంత డైవర్‌లను వ్రాసుకోవడానికి ఆహ్వానించడంలో ఈ సరికొత్త విప్లవం ప్రారంభమైంది. ఈ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ పనితనం చూసి ఆకర్షితులైన వినియోగదారులు దీనికి కొత్త ఫీచర్లు జోడించడం, స్వంత అప్లికేషన్లు తయారు చేయడం ప్రారంభించారు. ఔత్సాహిక ప్రోగ్రామర్లు తమ సమయాన్ని, అనుభవాన్ని, తెలివి తేటలనూ దీనిపై పెట్టి అన్ని రకాల అవసరాలకూ పనికివచ్చే ఆపరేటింగ్‌ సిస్టమ్‌గా తీర్చిదిద్దారు. ఎవరైనా ఇంటర్‌నెట్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకుని వినియోగించుకోవడం, ప్రోగ్రామింగ్‌ చేయడంతోపాటు ఈ ఓఎస్‌ని కలిగిన పిసినే వెబ్‌ సర్వర్‌గా వినియోగించుకోవడానికి వీలైంది. లైనస్‌ ఈ ఓఎస్‌ను ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ ఫౌండేషన్‌ వారి జిపిఎల్‌ (జనరల్‌ పబ్లిక్‌ లైసెన్స్‌)లో రిజిస్టర్‌ చేశారు. ఎవరైనా ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. మార్చుకోవచ్చు, అమ్ముకోవచ్చు, ఇతరులకు ఇవ్వవచ్చు. ఈ ఓఎస్‌తో పాటు తప్పనిసరిగా దాని సోర్స్‌కోడ్‌ను కూడా ఇవ్వవలసి వుంటుంది.

-సూరి

Saturday, November 27, 2010

అడోబ్‌ ఫొటోషాప్‌...!



ప్రస్తుత ఆధుఁక యుగంలో అడోబ్‌ ఫొటోషాప్‌ గురించి తెలియఁ కంప్యూటర్‌ ఁపుణులు ఉండరు. అయితే మనకఁ తెలిసిందల్లా దీఁ విఁయోగం మాత్రమే. దీఁ ప్రారంభ చరిత్ర మరింత ఆసక్తికరంగా వుంటుంది. ఫొటోలపై మార్పులు, చేర్పులు చేసుకోవటాఁకి వీలుకల్పించే ఒక రాస్టేర్‌ గ్రాఫిక్స్‌ ఎడిటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ పేరే ఈ అడోబ్‌ ఫొటోషాప్‌. దీఁఁ అభివృద్ధి చేసి ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తున్న సంస్థ అడోబ్‌ సిస్టమ్స్‌. ఇది ప్రపంచంలో చాలా మందికి, ముఖ్యంగా గ్రాఫిక్‌ ఫొటో ఎడిటర్లకఁ ప్రామాణికమైన ఇమేజ్‌ ఎడిటింగ్‌ పరికరంగా ప్రసిద్ధి చెందింది. 1987లో అమెరికాలోఁ మిచిగాన్‌ విశ్వవిద్యాలయంలో థామస్‌ నోల్‌ (thomos knoll) అనే పరిశోధనా (display) విద్యార్ధి తన మాకింతోష్‌ ప్లస్‌ కంప్యూటర్‌లో గ్రేస్కేల్‌ (నలుపు తెలుపుల రంగుల మిశ్రమం) చిత్రాలను మోనోక్రోమ్‌ తెరపై కఁపించేలా ప్రోగ్రామ్‌ రాయటం ప్రారంభించాడు. డిస్‌ప్లే (john Knoll)) అనే ఈ ప్రోగ్రామ్‌ నోల్‌ సోదరుడు జాన్‌ నోల్‌ (john Knoll)ను ఆకర్షించింది. ఇండిస్టియల్‌ లైట్‌ అండ్‌ మ్యూజిక్‌ సంస్థలో పఁచేస్తున్న జాన్‌ నోల్‌ ప్రోత్సాహంతో థామస్‌ నోల్‌ డిస్‌ప్లే అనే ఈ చిన్న ప్రోగ్రామ్‌ను పూర్తిస్థాయి ఇమేజ్‌ ఎడిటింగ్‌ సాఫ్ట్‌వేర్‌గా మార్చాలఁ ఁర్ణయించుకఁఁ తన పిహెచ్‌డి చదువును ఆర్నెళ్లపాటు ఆపేశాడు. ఈ సమయంలో తన సోదరుడితో కలిసి 1988లో ఇమేజ్‌ ప్రో (image pro) అనే మొదటి ఎడిటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను తయారు చేశాడు. తరువాతి సంవత్సరంలో థామస్‌ నోల్‌ ఇమేజ్‌ప్రో సాఫ్ట్‌వేర్‌ను ఫొటోషాప్‌గా పేరు మార్చి స్కానర్లు తయారు చేసే బర్నే స్కాన్‌ కంపెనీ వారి స్కానర్‌ పరికరంతో పాటుగా పంపిణీ చేసేందుకఁ ఒప్పందం కఁదుర్చుకఁఁ 200 ఫొటోషాప్‌ కాపీలను అమ్మగలిగాడు. ఇదే సమయంలో జాన్‌ నోల్‌ సిలికాన్‌ వ్యాలీలోఁ యాపిల్‌ ఇంజనీర్లకఁ ఫొటోషాప్‌ పఁతనాఁ్న ప్రదర్శించి వారిఁ మెప్పించగలిగాడు. 1988లో అడోబ్‌ సంస్థ ఈ ఫొటోషాప్‌ పంపిణీ హకఁ్కలను కొనుగోలు చేసింది. కాలిఫోర్నియాలో వుండి ఫొటోషాప్‌ ఫ్లగిన్‌లపై పఁచేస్తుండే థామస్‌ నోల్‌ ఆర్బర్‌ పట్టణంలో వుండి ఫొటోషాప్‌ ప్రోగ్రామ్‌ను అభివృద్ధి పరుస్తుండేవాడు. ఆ తరువాత కొన్నేళ్ల పాటు ఫొటోషాప్‌ ప్రోగ్రామ్‌ పఁతీరుకఁ మరిఁ్న హంగులను జోడించి దాఁఁ అభివృద్ధిపరుస్తూ కొత్త కొత్త వెర్షన్లను విడుదల చేశారు. 1992 నవంబర్‌లో మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో కూడా పఁచేయగలిగే ఫొటోషాప్‌ రెండో వెర్షన్‌ను విడుదల చేశారు. మరుసటి ఏడాదికి ఎస్‌జిఐ, ఐఆర్‌ఎక్స్‌, సన్‌ సొలారిస్‌ ప్లాట్‌ఫారంలపై కూడా పఁచేయగలిగే ఫొటోషాప్‌ను రూపొందించారు. 2003 ఫిబ్రవరిలో విడుదల చేసిన కెమెరా రా 1.x ప్లగిన్‌తో వాడకందారులు తమ డిజిటల్‌ కెమెరాల నుండి నేరుగా ఫొటోషాప్‌లోకి చిత్రాలను తెచ్చుకోగలిగే సదుపాయాఁ్న కల్పించారు. 2004 అక్టోబర్‌లో ఈ ప్రోగ్రామ్‌కఁ అడోబ్‌ ఫొటోషాప్‌ జూ అనే కొత్త పేరు పెట్టారు. ఈ పేరులో ఉన్న జూ అనే అక్షరాలు అడోబ్‌ సంస్థ విడుదల చేస్తున్న అడోబ్‌ క్రియేటివ్‌ సూట్‌లో ఫొటోషాప్‌ కూడా ఒక భాగమఁ సూచిస్తుంది. ఫొటోషాప్‌ పదో వెర్షన్‌ ఫొటోషాప్‌ CS గత ఏడాది ఏప్రిల్‌ 16న విడుదల చేశారు. విండోస్‌పై నడిచే సాఫ్ట్‌వేర్‌లను లినక్స్‌లో కూడా వాడుకఁనేట్టు చేసే వైస్‌ సాఫ్ట్‌వేర్‌. ఈ ఏడాది జనవరిలో ఫొటోషాప్‌ CS2ను కూడా లినక్స్‌ తదితర వ్యవస్థలపై వాడుకఁనే సదుపాయాఁ్న అడోబ్‌ సంస్థ అధికారికంగా కల్పించింది. ఫొటోషాప్‌ను జంం ప్రోగ్రామింగ్‌ భాషలో రూపొందించారు.
ఫొటోషాప్‌ ఎక్స్‌ప్రెస్‌
అడోబ్‌ కంపెనీ వారు ఈ మధ్యనే ఫొటోషాప్‌ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో ఆన్‌లైన్‌ ఫొటో ఎడిటింగ్‌ సౌకర్యాఁ్న కల్పించారు. ఎవరైనా రిజిస్టర్‌ చేసుకఁఁ తమ ఫొటోలను అప్‌లోడ్‌ చేసుకఁఁ కావల్సిన మార్పులు, చేర్పులు (ఎడిటింగ్‌) చేసుకఁఁ ఆల్బం రూపంలో వుంచుకోవటంతో పాటు ఫేస్‌బుక్‌ లాంటి సైట్లకఁ కూడా ఎగుమతి చేసుకోవచ్చు. లేదా తమ ఇ-మెయిల్‌కఁ పంపుకోవచ్చు. అందుకోసం అడ్‌బ్‌ సంస్థ 2జిబి స్పేస్‌ను ఉచితంగా కేటాయిస్తోంది. తమ ఆదాయాఁ్న పెంచుకోవటంతో పాటు ఆన్‌లైన్‌ ద్వారా ఇటువంటి సౌకర్యాలు కల్పిస్తున్న సైట్లు (సంస్థల)కఁ గట్టిపోటీ ఇవ్వడమే ఈ ఎత్తుగడలోఁ ఆంతర్యం. ఫొటోషాప్‌ ఆల్బం స్టార్టర్‌ ఎడిషన్‌ పేరులో సూచించినట్టే ఫొటోగ్రఫీ నేర్చుకఁంటున్న వారి కోసం వారు తీసిన ఫొటోలను చిన్న చిన్న మార్పులు చేయటం, ఆల్బంలుగా మార్చుకోవటం మొదలైన ప్రాథమిక ఎడిటింగ్‌ నేర్చుకోవటాఁకి ఇది ఉద్దేశింపబడింది.
ఒక్క క్లిక్‌లో సాధారణంగా ఫొటోలలో వుండే తప్పులను సరిచేయటం అంటే ఫ్లాష్‌ ఉపయోగించి ఫొటో తీసినపుడు కంటిలో కఁ్పంచే ఎర్రటి చుక్క (red eye), రంగులను, ఫొటోలోఁ ప్రకాశపు (brightness))ను సులభంగా పెంచుకోవటం, ఫొటోలను ఇ మెయిల్‌ ద్వారా పంపించుకోవటం, మొబైల్‌ ఫోన్లకఁ పంపించుకోవటం, సులభంగా సిడిలలో రాయటం, మీరే స్వంతంగా ప్రింట్లు వేసుకోవటం లేదా ఆర్డర్‌ చేయటం, ఫొటో బుక్స్‌గా తయారు చేయటం వంటి అనేక ఆన్‌లైన్‌ సౌకర్యాలు ఇందులో వున్నాయి. ఈ ఫొటోఁ అయినా స్నాప్‌తో కనుగొనటం అనే ఈ ఆటోమేటిక్‌ ఆర్గనైజేషన్‌ ప్రక్రియలో మీ డిజిటల్‌ ఫొటోలఁ్నంటినీ ఒకచోటు క్రమపద్ధతిలో అందరికీ తెలిసిన కాలెండర్‌ రూపంలో చూపిస్తుంది. పూర్వాపరాలు
1980లలో వచ్చిన మాక్‌ వెర్షన్‌ ఇమేజ్‌ ఎడిటింగ్‌ను పర్సనల్‌ డెస్క్‌టాప్‌ కంప్యూటర్లలో వాడుకఁనేందుకఁ వీలుగా సులభతరం చేయటమేకాక ప్రాచుర్యంలోకి తీసుకఁ వచ్చింది. ఇప్పుడు ఫొటోషాప్‌ (విండోస్‌), మాకింతోష్‌ ప్లాట్‌ఫారంలలో 'ఫొటోషాప్‌ ఫ్యామిలీ' కింద సరదాగా ఫొటోలను, ఇమేజ్‌లను మార్పులు చేసుకఁనే వారి కోసం అడోబ్‌ ఫొటోషాప్‌ ఆల్బమ్‌ స్టార్టర్‌ ఎడిషన్‌ మొదలు, ఫిల్మ్‌, వీడియో, మల్టీ మీడియా, వెబ్‌, గ్రాఫిక్‌ డిజైనర్‌, 3డి మోషన్‌ పిక్చర్స్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌, ఆర్కిటెక్ట్‌లు, ఇంజనీర్‌లు, శాస్త్ర పరిశోధకఁలు మొదలైన ఉన్నత శ్రేణి వృత్తి ఁపుణుల కోసం 'అడోబ్‌ ఫొటోషాప్‌ సిఎస్‌ 3 ఎక్స్‌టెండెడ్‌ (CS3 extended) ) అనే ఎడిషన్‌ వరకూ రకరకాలైన వెర్షన్లను అందుబాటులోకి తెచ్చింది.
ఫొటోషాప్‌ ఆర్‌జిబి (RGB) లాబ్‌ (lab)), సిఎంవైకె (CMYK), గ్రేస్కేల్‌ (greyschale), బైనరీ బిట్‌మాప్‌ (binarybitmap), డ్యూటోన్‌ అనే రంగుల విధానంలో పఁచేస్తుంది లేదా చిత్రాలను గుర్తిస్తుంది అఁ చెప్పవచ్చు. ఫొటోషాప్‌ రాస్టర్‌, వెక్టార్‌ గ్రాఫిక్‌ ఫార్మెట్‌ రెండింటిలో చిత్రాలను స్వీకరిస్తుంది. అంటే ఇపిఎస్‌ (EPS), పిఎన్‌జి (PNG), జిఫ్‌ (GIF), జెపిఇజి (JPEG) ఫైర్‌వర్క్స్‌ (fireworks) ఫార్మెట్‌లలో వున్న చిత్రాలను ఎడిటింగ్‌ చేసుకోవచ్చు.
ఫొటోషాప్‌ సొంత ఫైల్‌ ఫార్మెట్స్‌లో కొఁ్న..
ఫొటోషాప్‌ సొంత ఫైల్‌ పేరు పిఎస్‌డి (PSD) అంటే ఫొటోషాప్‌ డాకఁ్యమెంట్‌ అఁ అర్ధం. పిఎస్‌డి ఎక్స్‌టెన్షన్‌తో సేవ్‌ చేసుకఁన్న ఫైల్‌తో లేదా చిత్రం లేదా ఫొటోకఁ చేసే మార్పులు అంటే లేయర్‌ మాస్క్‌ (layer mask), కలర్‌ స్పేసెస్‌ (color spaces), ఐసిసి ప్రొఫైల్స్‌ (ICC profiles), టెక్స్ట్‌ (text), ఆల్ఫా ఛానల్స్‌ (alpha Channels), స్పాట్‌ కలర్స్‌ (spot colors), క్లిప్పింగ్‌ పాత్స్‌ (clipping paths), డ్యూటోన్‌ సెట్టింగ్స్‌ మొదలైన ఆప్షన్లు తిరిగి ఎడిటింగ్‌ చేసుకఁనేందుకఁ వీలుగా సేవ్‌ చేయబడి వుంటాయి. ఇప్పుడు అడోబ్‌ సంస్థ ఫొటోషాప్‌లో పిఎస్‌బి (PSB) అనే కొత్త ఫార్మెట్‌ను ఉపయోగంలోకి తెచ్చింది. రెండు జిబి సామర్థ్యం కంటే పెద్ద ఫైళ్లను ఁక్షిప్తం చేసుకఁనేందుకఁ ఇది ఉపయోగపడుతుంది. పిఎస్‌డి (PSD) ఆధునీకరించిన కొత్త ఎక్స్‌టెన్షన్‌ ఫైల్‌ ఫార్మెట్‌ ఇది. ఇక ఫొటోషాప్‌ డీలక్స్‌ డాకఁ్యమెంట్‌ PPD) అనే కొత్త ఫార్మెట్‌ కూడా కొంతకాలం ఉపయోగంలోకి వచ్చింది. పిఎస్‌డి ఫైల్‌ ఫార్మెట్‌ ఫీచర్లఁ్నంటినీ ఇది అంగీకరిస్తుంది. ఇప్పుడు ఆపివేయబడిన ఫొటో డీలక్స్‌ సాఫ్ట్‌వేర్‌ ఫైల్‌ ఫార్మెట్‌ ఎక్స్‌టెన్షన్‌ ఇది.

Monday, November 1, 2010


వర్గీకరణ

వెబ్ సైటుల అవసరాన్ని బట్టి వాటిని క్రింది విధంగా వర్గీకరించవచ్చు

  1. వ్యక్తిగత వెబ్‌సైటు
  2. వ్యాపార/ వాణిజ్య వెబ్ సైటు
  3. ప్రభుత్వ వెబ్ సైటు
  4. స్వచ్చంద సేవాసంస్థల లేదా లాభాపేక్ష రహిత సంస్థల వెబ్‌సైటులు
  5. విద్యా సంస్థల వెబ్ సైటు
  6. ప్రసార మాధ్యమాల వెబ్‌సైటు, మొదలగునవి ముఖ్యమైనవి.

ఎదైనా ఒకవిషయానికి సంబంధించినవిపరాలను, సంక్షిప్త సమాచారంతో ఇతర వెబ్సైటుల లింకులను ఇచ్చే వెబ్‌సైటులను ప్రవేశ ద్వారాలు (పోర్టల్) అంటారు. ఉదా:[2] అనే ప్రవేశ ద్వారంలో తెలుగులో వార్తలు, భవిష్యత్తు , వినోదం గురంచిన సమాచారం అందిస్తుంది. భారత ప్రగతి ద్వారం అనే ప్రవేశ ద్వారంలో గ్రామీణ, సమాజాభివృద్ధికి సంబంధించిన వివిధ వివరాలుంటాయి.

వెబ్‌సైటు







వెబ్ సైటు అనగా వెబ్ సర్వర్(ఒకకంప్యూటర్ లేదా ఒక సాఫ్ట్‌వేర్)లో చేర్చబడిన వెబ్‌పేజీలు, బొమ్మలు, వీడియో మరియు డిజిటల్ సమాచారాల యొక్క సముదాయం.[1] సాధారణంగా దీనిని ఇంటర్నెట్, ల్యాన్ లేక సెల్ ఫోన్‌ల ద్వారా కూడా సందర్శించవచ్చు. వెబ్ పేజీ అనేది HTML అనే కంప్యూటర్ భాషలో రాయబడిన ఒక డాక్యుమెంట్. HTTP అనే ప్రోటోకాల్(నియమాల) ద్వారా వెబ్ సర్వర్ నుంచి వెబ్ బ్రౌజర్‌కు బదిలీ చేయబడుతుంది. బహిరంగంగా వీక్షించగల వెబ్‌సైటులన్నింటినీ కలిపి వరల్డ్ వైడ్ వెబ్ లేదా www అని వ్యవహరించడం జరుగుతుంది.

కంప్యూటర్ అంటే ఏమిటి?


కంప్యూటర్ అనునది ఒక ఎలక్ట్రానిక్ ఉపకరణం. ఈ ఉపకరణాన్ని ఖచ్చితంగా నిర్వచించాలంటే కష్టతరమనే చెప్పాలి. కంప్యూటర్ అనే పరికరం కాలక్రమేణా ఎన్నో మార్పులు చెందటం వల్ల ఫలానా యంత్రమే కంప్యూటర్ అని నిర్వచించటం కష్టమౌతుంది. మునుపు కంప్యూటర్ అని పిలువబడ్ద యంత్రాలు వేర్వేరు పనులకై ఉపయోగింపబడటం వలన కూడా ఫలానా పని చేసే యంత్రమే కంప్యూటర్‌ అని చెప్పటం కూడా కష్టమౌతుందనే చెప్పాలి. కానీ ఈ క్రింది నిర్వచనాల ద్వారా కంప్యూటరు అంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం చెప్పవచ్చు.

  • కన్సైజ్‌ ఆక్స్‌ఫ‌ర్డు ఆంగ్ల డిక్షనరి కంప్యూటర్‌ను "ముందుగా నిర్ధరించబడిన ఆదేశాల అనుసారం సమాచారాన్ని నిక్షేపించి (store), విశ్లేషించగల (process/analyze) ఒక ఎలెక్ట్రానిక్ పరికరం" అని నిర్వచిస్తోంది. ఈ నిర్వచనం కంప్యూటర్‌ను ఒక విశ్లేషణా యంత్రంగా లేక పరికరంగా చూస్తుంది.
  • వెబ్‌స్టర్స్ ఆంగ్ల డిక్షనరి కంప్యూటర్‌కు "సమాచారాన్ని నిక్షేపించి (store) , అనుదానించి (retrieve), విశ్లేషించగల (process/analyze), ప్రోగ్రామబుల్‌ ఐన (సామాన్యంగా ఎలెక్ట్రానిక్) పరికరం" అనే నిర్వచనాన్ని చెబుతోంది. ఈ నిర్వచనంలో నాన్‌-ఎలెక్ట్రానికి పరికరాలు కూడా కంప్యూటర్లు అనబడవచ్చనే అర్థం గోచరిస్తోంది.
  • సురేశ్‌ బసంద్ర తన కంప్యూటర్స్ టుడే అనే పుస్తకంలో ఈ పరికరాన్ని "విపులమైన ఆదేశాల అధారంగా, దత్తాంశాలను (డేటాను) స్వీకరించి, విశ్లేషించి, ఫలితాలను ప్రదానంచేస్తూ సమస్యలను పరిష్కరించగల యంత్రం." అని నిర్వచించారు. ఈ నిర్వచనంలో కంప్యూటర్‌ను 'సమస్యలను పరిష్కరించే యంత్రం' అని గుర్తించటం జరిగింది

Popular Posts