Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Wednesday, January 19, 2011

ఇంటర్నెట్‌ అనేది అనేక నెట్‌ల కలయిక







మీకు ప్రార్థన చేయడానికి కూడా తీరికలేదా? నో ప్రోబ్లమ్‌ మీ కోసం ఆన్‌లైన్‌లో ప్రార్థనలు చేస్తాం!
మీరు షాపింగ్‌ చేయడానికి సమయం చిక్కడంలేదా? మీరు ఇంటి దగ్గర నుండే ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి. మీరు కొనుగోలు చేసిన దానిని మీ ఇంటికే చేరుస్తాం!
మీ బిల్లు ఆన్‌లైన్‌లోనే చెల్లించి సమయాన్ని ఆదా చేసుకోంది!
ఇలాంటి ప్రకటనలు ప్రతి నిత్యం చూస్తున్నాము. ప్రతిది ఇంటర్నెట్‌ మయమైంది. ఈరోజు ఇంటర్నెట్‌ అంటే తెలియని వారుండరు. ఇది నిత్యావసరమై కూర్చొంది. అదే యువత పెడ మార్గానికి కారణమౌతుంది. ఎక్కడ మంచి వుంటుందో, అక్కడే చెడు కూడా వుంటుందంటారు. చెడును వదలి మంచిని స్వీకరించే తత్వాన్నికి యువత దృష్టిని మరల్చవలసిన అవసరం ఎంతైనా వుంది.
ఇంటర్నెట్‌ అనేది అనేక నెట్‌ల కలయిక. విభిన్న రకాల కలయికలు భౌతికంగా ఒక దానితో మరొకటి అనుసంధానించబడి ఒకే పరిభాషలో వ్యవహారాలను నడుపుకోవచ్చు.
ఇంటర్నెట్‌ అనగానే మనకు ఠక్కున గుర్తు వచ్చేది బ్లాగ్‌లు. వీటికి 1990లోనే టిమ్‌ బెర్నర్‌ అనే శాస్త్రవేత్త మరి కొంతమంది శాస్త్రవేత్తలతో కలిసి యూరోపియన్‌ పార్టికల్‌ ఫిజిక్స్‌ లేబరేటరీలో ఇంటర్నెట్‌ విప్లవానికి నాంది పలికారు. హైపర్‌ లాంగ్వేజిని వాడి నేడు వాడుతున్న బ్రౌజర్‌ని పోలివుండే బౌజర్‌ను వాడుకలోకి తెచ్చారు.

Tuesday, January 18, 2011

బ్లాగ్‌ ఏర్పాటు?


బ్లాగ్‌లను మూడు అంచెలుగా రూపొందించవచ్చు. బ్లాగింగ్‌ క్లయింట్స్‌, బ్లాగింగ్‌ ఫ్లాట్‌ఫారమ్స్‌, బ్లాగ్‌ హౌస్ట్‌. బ్లాగ్‌ కూడా ఒక వెబ్‌ పేజీనే. దీనిలో వెబ్‌ పేజీలో లాగానే అనేకం అప్‌లోడ్‌ చేసుకోవచ్చు.

బ్లాగింగ్‌ క్లయింట్స్‌
బ్లాగింగ్‌ క్లయింట్స్‌ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌గా లభిస్తాయి. బ్లాగ్‌.కాంలో ఆన్‌లైన్‌ బ్లాగ్‌లను తయారుచేసుకోవచ్చు. అన్ని ఫ్లాట్‌ఫారాలతో ఇది మిళితమై వుంటుంది. ప్లాక్‌లాంటివి బ్లాగ్‌ల్లో పోస్ట్‌ చేయడానికి ఆన్‌లైన్‌లో రూపొందించుకొనే వీలునిస్తాయి. ఇంటర్నెట్‌ను కనెక్ట్‌తో (ఆఫ్‌లైన్‌లో) పనిలేకుండా బ్లాగ్‌లో సమాచారాన్ని రూపొందించవచ్చు. పోస్టు చేయడానికి మాత్రమే ఇంటర్నెట్‌ను ఆన్‌ చేసుకోవాలి.

బ్లాగింగ్‌ ఫ్లాట్‌ఫారం
బ్లాగ్స్‌ను నిర్మించడానికి ఫ్లాట్‌ఫారమనేది కీలకం. బ్లాగ్‌కు సంబంధించిన విధి విధానాలను దీని ద్వారా చేయవలసి వుంటుంది.

బ్లాగ్‌ హౌస్ట్‌
నం తయారు చేసిన సమాచారాన్ని దీని ద్వారా హౌస్ట్‌ చేయవచ్చు.
ప్రధానంగా పై మూడు బ్లాగింగ్‌ ప్రధానమైనవి. అవి కాకుండా టెంప్లేట్స్‌, టెంప్లేట్స్‌లో మార్పులు, లేఅవుట్‌లో మార్పులు, కామెంట్స్‌, అప్‌లోడింగ్‌, ట్యాగింగ్‌ సెర్చ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ ఫీడ్స్‌, పోస్టు చేసుకునేందుకు, కోడ్‌, బ్లాగ్‌ ట్రాకర్స్‌ కూడా వుండేటట్లు చూసుకోవాలి.

బ్లాగ్‌ టెంప్లేట్స్‌?
బ్లాగ్‌ ఎలా వుండాలో నిర్దేశించే నమూనా పేజీ. బ్లాగ్‌ బ్యాక్‌గ్రౌండ్‌, ఫాంట్‌ టైప్‌, కలర్‌ డెఫినిషన్స్‌ అనుగుణంగా చూడవచ్చు.

Monday, January 17, 2011

మోడెం అంటే మోడ్యూలేటర్



మోడెం
మోడెం అంటే మోడ్యూలేటర్‌, డీ మోడ్యూలేటర్‌. దీని ద్వారా డేటా, ఫొటో లాంటి వాటిని ఒక కంప్యూటర్‌ నుండి మరో కంప్యూటర్‌కు పంపవచ్చు.
మోడెం పని చేయడానికి కావలసిన పరికరాలు
1) కంప్యూటర్‌
2) మోడెం
3) టెలిఫోన్‌ లైన్‌
4) కమ్యూనికేషన్‌ సాఫ్ట్‌వేర్‌ (బిట్‌వేర్‌)
మోడెం వెనుక భాగంలో వుండే ఫోర్టులు
ఆన్‌/ఆఫ్‌ స్విచ్‌ ా మోడెంను ఆన్‌/ఆఫ్‌ చేయవచ్చు
ఎసిాఇన్‌ ా పవర్‌ కేబుల్‌ పెట్టడానికి ఉపయోగపడుతుంది
ఆర్‌ఎస్‌ 232 ఫోర్ట్‌ ా కంప్యూటర్‌కు మోడెంను కలిపే కేబుల్‌ పెట్టడానికి ఉపయోగపడుతుంది.
లైన్‌, ఫోన్‌ / లైన్‌ అనేది దానిలో కేబుల్‌ పెడితే మోడెం కనెక్ట్‌ అవుతుంది. ఫోన్‌ అనే దానిలో ప్యార్‌లల్‌ కేబుల్‌ పెడితే ఫోన్‌ కూడా పనిచేస్తుంది
మోడెం ముందు భాగంలో వుండే ఫోర్టులు
1) ఆర్‌డి : రిసీవ్‌ డేటా (డేటా వచ్చేటప్పుడు ఈ లైట్‌ బ్లింక్‌ అవుతుంది)
2) టిడి : ట్రాన్సఫర్‌ డేటా (డేటా పంపేటప్పుడు ఈ లైట్‌ బ్లింక్‌ అవుతుంది)
3) సిడి : కేరీ డేటా (ఈ లైట్‌ వెలిగితే అవతలి వారితో అనుసంధానం అయినట్లు)
4) ఓహెచ్‌ : ఆఫ్‌ హుక్‌ (ఇది వెలిగితే మోడెం కనెక్ట్‌లో వుండి లైన్‌ ఉపయోగంలో వున్నట్లు)
5) హెచ్‌ఎస్‌ : హైస్పీడ్‌లో కనెక్ట్‌ అయినప్పుడు వెలుగుతుంది
6) ఎంఆర్‌ :మోడెం రెడీ (మోడెం పనిచేస్తున్నట్లు)

స్కానర్‌
ఇది డాక్యుమెంట్లను, ఫొటోలను స్కాన్‌ చేయడానికి ఉపయోగపడుతుంది. అవుటర్‌ డివైజ్‌లు సిస్టమ్‌కన్నా ముందుగా ఆన్‌ చేసుకోవాలి. సిస్టమ్‌ ఆన్‌లో వుండగా వాటిని కనెక్ట్‌ చేయకూడదు. అలా చేస్తే ఓఎస్‌ కరెఫ్ట్‌ అయ్యే ప్రమాదం వుంది. ముందుగా స్కానర్‌ డోర్‌ను ఓపెన్‌ చేసిన మనం స్కాన్‌ చేయవలసిన దానిని అందులో వుంచాలి.
తరువాత సిస్టమ్‌లోని ఫొటోషాప్‌ సాఫ్ట్‌వేర్‌ ఓపెన్‌ చేయాలి. (స్కానర్‌ను ఉపయోగించుకోవాలంటే సిస్టమ్‌లో ముందుగానే స్కానర్‌తో పాటు ఇచ్చే సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేయాలి. అది ఫొటోషాప్‌ సాఫ్ట్‌వేర్‌లో ఇన్‌స్టాల్‌ అవుతుంది.) ఫొటోషాప్‌లోని ఫైల్‌ మెనూలో వున్న ఇంఫోర్ట్‌నందు వున్న స్కానర్‌ సాఫ్ట్‌వేర్‌పై మౌస్‌తో క్లిక్‌ చేస్తే స్కానర్‌ ఓపెన్‌ అవుతుంది. దానిలోని ప్రివ్యూ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే స్కానర్‌లో మనం పెట్టిన డాక్యుమెంట్‌ ఎక్కడ వుందో కనబడుతుంది. మనం స్కాన్‌ చేయదలచిన ఫైల్‌ను సెలెక్ట్‌ చేసుకొని స్కాన్‌ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే స్కాన్‌ అయ్యి ఫొటోషాప్‌లోకి ఇంపోర్ట్‌ అవుతుంది. తరువాత స్కానర్‌ సాఫ్ట్‌వేర్‌ ఎగ్జిట్‌ చేయాలి.
అలా ఫొటోషాప్‌లోకి వచ్చిన ఫైల్‌ను దానిలోని టూల్‌తో మనకు కావలసిన విధంగా ఎడిట్‌ చేసుకొని సేవ్‌ చేసుకోవాలి.
స్కానర్‌ సెట్టింగ్స్‌
జనరల్‌
స్కాన్‌ పేజీ ఫర్‌
మోడ్‌ ా కస్టమ్స్‌
రిజల్యూషన్‌ ా ట్రూ కలర్‌
సైజ్‌ ా మినిమమ్‌ 300 డిపిఐ (డాట్‌ ఫర్‌ ఇంచ్‌)
మెజర్‌మెంట్‌ ా సెంటీ మీటర్లు
సైజ్‌ - ఎ 4
అడ్వాన్స్‌ - సెలెక్ట్‌
ఛానల్‌ -ఆల్‌
గామా - 100
షారప్‌నెస్‌ - 0

Wednesday, January 5, 2011

బ్లాగ్‌ టెక్నికల్‌ వర్డ్స్‌

బ్లాగింగ్‌ : ఏదైనా (ఫొటో, వీడియో, ఆడియో, మ్యాటర్‌) పోస్టు చేయడం.
బ్లాగర్స్‌ : పై వాటినే పోస్ట్‌ చేసే వారినే బ్లాగర్స్‌.
పోస్టు : మనం దేనినైతే బ్లాగ్‌ వుంచే దానినే పోస్టు అంటారు.
ఆడియో బ్లాగ్‌ : ధ్వనితో కూడిన వాటిని వుంచేవి. దీనినే పోడ్‌కా
స్టింగ్‌ అంటారు.
బ్లెగ్‌ : చదువురుల నుండి తెలియని విషయాన్ని యాచించడం (అడుక్కోవడం).

విబ్లాగ్‌ : వీడియో క్లిపింగ్‌లను వుంచేది. దీనినే స్క్రీన్‌కాస్ట్‌ అంటారు.
బ్లాగ్‌రోల్‌ : మన బ్లాగ్‌లను ఇతరుల బ్లాగ్‌లకు లింకివ్వడం.
ట్రాక్‌బ్యాక్‌ : మన బ్లాగ్‌ను ఇతరుల బ్లాగ్‌ లింక్‌ చేయడం.
పెర్మాలింక్‌ : మనకు కావలసిన పోస్ట్‌కి లింక్‌ చేసి యుఆర్‌ఎల్‌ ద్వారా సూచించడం.
ఆర్‌ఎస్‌ఎస్‌ : రిచ్‌ సైట్‌ సమ్మరీ (ఆర్‌ఎస్‌ఎస్‌) అంటే మన బ్లాగ్‌ను ఇతరులకు వేగంగా వచ్చేటట్లు చేయడం.
బ్లాగ్‌ జంప్‌ : ఒక బ్లాగ్‌ను మరో బ్లాగ్‌కు జంప్‌ చేయడం.
బ్లాగ్‌ సైట్‌ : బ్లాగ్‌ వుండే వెబ్‌సైట్‌.
బ్లాగ్‌ స్నాబ్‌ : బ్లాగ్‌పై మీద వారి అభిప్రాయాలకు బదులు ఇవ్వని వారిని బ్లాగ్‌ స్నాబ్స్‌ అంటారు.
మోబ్లాగ్‌ : మొబైల్‌ బ్లాగింగ్‌.

Popular Posts