జులై 5న ఆసుస్ రోగ్ ఫోన్ 6 ఫోన్ విడుదల
Your Responsive Ads code (Google Ads)

జులై 5న ఆసుస్ రోగ్ ఫోన్ 6 ఫోన్ విడుదల


గేమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్న వారి కోసం ఆసుస్ రోగ్ ఫోన్ 6 ఈనెల 5వ తేదీన దేశీయ మార్కెట్లోకి రానున్నది.  ప్రపంచవ్యాప్తంగా ఇదే రోజున ఆసుస్ రోగ్ ఫోన్ 6 విడుదల కానుంది. ఆసుస్ అఫీషియల్ యూట్యూబ్ చానెల్‌లో లాంచ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమ్ అవుతుంది. క్వాల్‌కామ్‌ అధునాతన పవర్‌ఫుల్‌ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ ఆసుస్ రోగ్ ఫోన్‌ 6లో ఉంటుంది. ఈ ప్రాసెసర్‌తో భారత్‌లో లాంచ్ కానున్న తొలి మొబైల్ ఇదే. ఆసుస్ రోగ్ ఫోన్ 6కు సంబంధించిన మరికొన్ని స్పెసిఫికేషన్లు కూడా బయటికి వచ్చాయి. ఆసుస్ అధికారిక యూట్యూబ్ చానెల్‌లో ఈ ఈవెంట్‌ను లైవ్‌లో చూడవచ్చు. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ లో ఇప్పటికే ఆసుస్ ఫోన్ లిస్ట్ అయింది. స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్‌పై ఆసుస్ రోగ్ ఫోన్‌ 6 రన్ అవుతుందని కూడా ఆ సంస్థ ధ్రువీకరించింది. ఈ ఫోన్‌కి సంబంధించిన ఫొటోలు బయటికి రావడంతో డిజైన్‌తో పాటు మరికొన్ని స్పెసిఫికేషన్లు తెలుస్తున్నాయి. వెనుక మూడు కెమెరాల సెటప్‌తో ఈ మొబైల్‌ రానుంది. బ్యాక్ ప్యానెల్‌పై ROG లోగో కనిపిస్తోంది. అలాగే చైనీస్ గేమింగ్ కంపెనీ టెన్సెంట్‌తో ఈ మొబైల్‌ కోసం ఆసుస్ భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. అందుకే బ్యాక్ ప్యానెల్‌పై టెన్సెంట్ బ్రాండింగ్ కూడా కనిపిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎడమ పక్క వాల్యూమ్ రాకర్స్, పవర్ బటన్ ఉంటాయని తెలుస్తోంది. 165Hz రిఫ్రెష్ రేట్‌ ఉండే 6.78 ఇంచుల AMOLED డిస్‌ప్లేతో ఈ మొబైల్‌ వస్తుందని తెలుస్తోంది. 6000mAh బ్యాటరీ ఈ ఫోన్‌లో ఉండనుండగా.. 65వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుందని సమాచారం. వెనుక మూడు కెమెరా సెటప్‌లో ప్రధాన సెన్సార్ 64 మెగాపిక్సెల్‌గా ఉంటుందని లీక్‌ల ద్వారా వెల్లడైంది. ఈ ఫోన్‌కు 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుందని తెలుస్తోంది. గరిష్ఠంగా 18జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ టాప్‌ వేరియంట్‌గా ఉండొచ్చు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog