Ad Code

రియల్ 5టీ ఎలక్ట్రిక్ స్కూటర్ !


చైనాకు చెందిన లోన్సిన్ మోటార్ సైకిల్స్ కంపెనీ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ని లాంచ్ చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు రియల్ 5టీ. కంపెనీ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. ఈ స్కూటర్ చూడడానికి స్పోర్టీ డిజైన్తో ఉంది. స్లిప్ ఎల్ఈడి హెడ్ లైట్, స్మొక్ట్ విజర్ కలిగి ఉంది. ఈ స్కూటర్ 124సీసీ పెట్రోల్ స్కూటర్ తో సమానం అని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ ఔట్పుట్ 15 బీహెచ్ పీ. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు115 కిలోమీటర్లు. ఇందులో రెండు 2.4 kwh లిథియం అయాన్ బ్యాటరీలు ఉన్నాయి. ఈ రియల్ 5టీ స్కూటర్ని ఒక్కసారి చార్జ్ చేస్తే 240 కిలోమీటర్లు వెళ్లవచ్చు అని కంపెనీ తెలిపింది. కంపెనీ ఈ స్కూటర్ చార్జింగ్ కు 1.84kwh చార్జర్ అందిస్తుంది. స్కూటర్ కు కేవలం రెండు గంటల్లోనే 80 శాతం చార్జింగ్ ఎక్కుతుంది అలాగే ఈ స్కూటర్లో మూడు రైడింగ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్, ఆటోమేటిక్ వార్నింగ్ లైట్స్, చార్జింగ్ పోర్ట్, రివర్స్ గేర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. స్కూటర్ ముందు భాగంలో డిస్క్ బ్రేక్ ఉంటుంది. వెనక భాగంలో డ్రం బ్రేక్ సిస్టం ఉంది. మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే కొన్ని రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఏథర్ 450 ఎక్స్, ఓలా ఎస్ 1, టీవీఎస్ ఐ క్యుబ్స్, బజాజ్ చేతక్, హీరో విధా వంటి మోడల్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎంచుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu