ప్రపంచంలోనే అత్యంత స్లిమ్ ల్యాప్ టాప్ ఆసుస్‌ జెన్‌బుక్‌ !


ఆసుస్‌ జెన్‌బుక్‌ సిరీస్‌ ల్యాప్‌టాప్స్ లో మరో రెండు మోడళ్లను భారత మార్కెట్ లోకి విడుదల చేసింది. జెన్‌బుక్‌ ఎస్‌ సిరీస్‌లో భాగంగా తాజాగా Asus Zenbook S 13 OLED ని తీసుకొచ్చింది. ఇది ప్రపంచంలోనే అత్యంత సన్నని ఓఎల్‌ఈడీ ల్యాప్‌టాప్‌ అని ఆసుస్ వెల్లడించింది. ఈ ల్యాప్ టాప్ కేవలం 1 సెం.మీ మందం మాత్రమే కలిగి ఉందని సంస్థ పేర్కొంది. అదే విధంగా బరువు కూడా 1 కేజీ ఉంటుందని వెల్లడించింది. దీంతో పాటు Zenbook 14 Flip OLED ల్యాప్‌టాప్‌ను సైతం దేశీయ మార్కెట్ లోకి తీసుకొచ్చింది. Asus Zenbook S 13 OLED (UX5304) ఇప్పటి వరకు అత్యంత స్లిమ్, గ్రీనెస్ట్ జెన్‌బుక్‌ అని కంపెనీ ప్రకటించింది. ఈ అత్యాధునిక ల్యాప్‌టాప్‌ రెండు రంగుల్లో లభిస్తోంది. బసాల్ట్‌ గ్రే, పోండర్‌ బ్లూ రంగుల్లో ఇది అందుబాటులో ఉంది. ఇందులో 13వ జనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌ ఐ7 ప్రాసెసర్‌ అమర్చారు. 32జీబీ LPDDR5 ర్యామ్‌, 1టీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 63Wh బ్యాటరీని అందిస్తున్నారు. 16:10 యాస్పెక్ట్ రేషియోలో 13.3 అంగుళాల 2.8K ల్యూమినా OLED స్క్రీన్ వస్తోంది. వైఫై 6E, బ్లూటూత్‌ 5 కనెక్టివిటీ లాంటి ఫీచర్లు ఈ జెన్ బుక్ లో ఉన్నాయి. 180 డిగ్రీ ఎర్గో లిఫ్ట్‌ హింజ్‌ ఉంది. నాయిస్‌ క్యాన్సిలేషన్‌ సపోర్ట్‌తో డాల్బీ అట్మోస్‌ ఆడియో సిస్టమ్‌ ఉంటుంది. ఈ అత్యాధునిక ఫీచర్లతో వచ్చిన ఈ ల్యాప్ టాప్ ప్రారంభ ధర రూ. 1,04,990 గా కంపెనీ నిర్ణయించింది. Zenbook 14 Flip OLED విండోస్‌ 11 హోమ్‌ ఓఎస్‌పై ఆపరేట్‌ అవుతుంది. 16:10 యాస్పెక్ట్ రేషియోలో 14 ఇంచుల 2.8K (2,880 x 1,800 pixels) ల్యూమినా OLED టచ్‌స్క్రీన్‌ వస్తోంది. Iris Xe Graphics తో 13వ జనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌ ఐ7- 1360 ప్రాసెసర్‌ ఇందులో ఉంది. 16 జీబీ ర్యామ్‌, 512 ఇంటర్నల్‌ స్టోరేజ్ ఇస్తున్నారు. థండర్‌బోల్ట్‌ 4, బ్లూటూత్‌ 5.2,3.5 ఎంఎం ఆడియో జాక్‌, వైఫై 6E కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. కొత్త ఆసుస్‌ పెన్‌ 2.0 స్టైలస్‌ను కూడా ఇందులో ఇస్తున్నారు. నాయిస్‌ క్యాన్సిలేషన్‌ సపోర్ట్‌తో డాల్బీ అట్మోస్‌ ఆడియో సిస్టమ్‌ ఉంటుంది. 65Wh ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 75Whr బ్యాటరీని ఇస్తున్నారు. ఈ ల్యాప్ టాప్ 15.99 MM మందం, 1.5 కిలోల బరువు ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ. 1,09,990. ఈ ల్యాప్ టాప్ ఫాగీ సిల్వర్‌, పోండర్‌ బ్లూ అనే రెండు కలర్స్ లో లభిస్తోంది.

Post a Comment

0 Comments