Ad Code

థామ్సన్ ఇండియా నుంచి కొత్త స్మార్ట్‌టీవీలు !


ప్రముఖ టెక్ కంపెనీ థామ్సన్ సంస్థ ఇండియాలో ఎఫ్ఏ సిరీస్‌తో పాటు ఓత్ ప్రో మ్యాక్స్ 4కె టీవీలను ఆవిష్కరించింది. ఈ టీవీలు అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు, హై-క్వాలిటీ విజువల్స్‌తో అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు కంపెనీ కొత్త వాషింగ్ మెషీన్లను కూడా పరిచయం చేసింది. అయితే టీవీలు కేవలం రూ.10 వేల ప్రారంభ ధరలతోనే లాంచ్ అవుతాయని కంపెనీ ప్రకటించింది. థామ్సన్ ఎఫ్ఏ సిరీస్ ధరలు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోనే ఉన్నాయి. 32-అంగుళాల ఎఫ్ఏ సిరీస్ టీవీ ధరను రూ.10,499గా కంపెనీ నిర్ణయించగా.. 40-అంగుళాల టీవీని రూ.15,999గా.. 50-అంగుళాల మోడల్‌ను రూ.16,999గా కంపెనీ ప్రకటించింది. ఇక Oath Pro Max 4K TVల ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. 43-అంగుళాల టీవీ రూ.22,999, 50-అంగుళాల టీవీ మోడల్‌ను రూ.27,999కి సేల్ చేస్తామని కంపెనీ ప్రకటించింది. ఇక వాషింగ్ మెషీన్ల ధరలు రూ.12,999 నుంచి ప్రారంభమవుతాయి. కొత్త థామ్సన్ ఉత్పత్తులు కంపెనీ వెబ్‌సైట్‌లో లిస్ట్‌ అయ్యాయి. మే 30 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు. టీవీలు 32-అంగుళాల, 40-అంగుళాల, 42-అంగుళాల స్క్రీన్ సైజుల్లో అందుబాటులో ఉంటాయి. రియల్‌టెక్ ప్రాసెసర్లు, 1GB RAM + 8GB ఇంటర్నల్ స్టోరేజీతో ఇవి లాంచ్ అవుతాయి. ఈ టీవీలలో Google Play Store యాక్సెస్‌ ఉంటుంది. ఇవి Android TV 11 OSపై రన్ అవుతాయి. బెజర్స్-లెస్ డిస్‌ప్లేతో ఫుల్ HD రిజల్యూషన్‌ను అందిస్తాయి. డాల్బీ డిజిటల్ సపోర్ట్‌తో 30W స్పీకర్లు కూడా వీటిలో ఆఫర్ చేశారు. ఇవి 43-అంగుళాల, 50-అంగుళాల స్క్రీన్ సైజులలో రిలీజ్ కానున్నాయి. అనేక యాప్‌లు, గేమ్‌లకు యాక్సెస్‌తో Google TV OS పై ఈ టీవీలు రిలీజ్ అవుతాయి. డాల్బీ విజన్, HDR10+ మద్దతుతో బెజెల్-లెస్ డిజైన్ ఈ టీవీలలో ఉంటుంది. డాల్బీ అట్మాస్, డాల్బీ డిజిటల్ ప్లస్, DTS TrueSurroundతో 40W స్టీరియో బాక్స్ స్పీకర్‌లు వీటిలో ఆఫర్ చేశారు. ఇవి క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2GB RAM + 16GB స్టోరేజీతో వస్తాయి. కనెక్టివిటీ విషయానికొస్తే వీటిలో డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, HDMI ARC/CEC, USB 3.0 సపోర్టు అందించారు. గూగుల్ అసిస్టెంట్, ఇన్-బిల్ట్ Chromecast ఫీచర్లు రెండు టీవీ సిరీస్‌లలో ఉంటాయి. మల్టీపుల్ ప్రొఫైల్స్‌, మాన్యువల్, వాయిస్ కంట్రోల్స్‌ వీటిలో ఆఫర్ చేశారు. ఈ ప్రీమియం టీవీలలో స్మార్ట్ హోమ్ డివైజ్ కంట్రోల్స్‌, పర్సనలైజ్డ్‌ కంటెంట్‌కి యాక్సెస్ ఉంటుంది.


Post a Comment

0 Comments

Close Menu