Ad Code

దేశీయ మార్కెట్లోకి మోటరోలా రేజర్ 40 సిరీస్ ఫోన్లు త్వరలో విడుదల !


మోటరోలా తన రేజర్ 40  సిరీస్ ఫోల్డబుల్ ఫోన్ల ఆవిష్కరణకు రంగం సిద్ధం చేసింది. మోటరోలా రేజర్ 40 ఆల్ట్రాతోపాటు చౌకధరకే రేజర్ 40 ఫోల్డబుల్ ఫోన్లను దేశీయ మార్కెట్లోకి తీసుకు రానున్నది. ఈ నెల 22న ఆయా ఫోన్లలో పూర్తిస్థాయి స్పెషిఫికేషన్లు, భారత్‌లో ఫోన్ ఆవిష్కరణ తేదీ వెల్లడించనున్నది. ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్ ద్వారా భారత్ మార్కెట్లో మోటరోలా రేజర్ 40 ఫోల్డబుల్ ఫోన్లు ఆవిష్కరిస్తామని ఇంతకుముందే ప్రకటించింది. హై ఎండ్ మోటరోలా రేజర్ 40 సిరీస్ ఫోల్డబుల్ ఫోన్లు.. ఆల్ట్రా (రేజర్ ప్లస్), మోటరోలా రేజర్ 40 (రేజర్) మోడల్ ఫోన్లు ఆవిష్కరిస్తామని మోటరోలా ఇండియా వెబ్‌సైట్‌లో వెల్లడించింది. రెండు ఫోన్లు ఒకేసారి మార్కెట్లో ఆవిష్కరిస్తుందా? లేదా? అన్నది క్లారిటీ రాలేదు. మోటరోలా రేజర్ 40 ఆల్ట్రా, మోటరోలా రేజర్ 40 ఫోన్లను చైనాలో ఈ నెల ఒకటో తేదీన ఆవిష్కరించింది. అమెరికాలోనూ రేజర్ ప్లస్, 2023 రేజర్ మోడల్ పేర్లతో లాంచ్ చేసింది. రేజర్ 40 ఆల్ట్రా ధర సుమారు రూ.66 వేలు (5699 చైనా యువాన్లు) ఉంటుంది. మోటరోలా రేజర్ 40 ఆల్ట్రా ఫోన్ 6.9-అంగుళాల ఫుల్ హెచ్డీ+ పోలెడ్ స్క్రీన్ విత్ 165 హెర్ట్జ్ రీఫ్రెష్ అండ్ 3.6 అంగుళాల పోలెడ్ కవర్ స్క్రీన్ విత్ 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో వస్తుందని భావిస్తున్నారు. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్వోసీ చిప్ సెట్, డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ విత్ 12-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, సెల్ఫీల కోసం 32-మెగా పిక్సెల్ కెమెరా వస్తుంది. ఈ ఫోన్ 3800 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ పై ఐపీ 52 రేటింగ్ కలిగి ఉంటుంది. మోటరోలా రేజర్ 40 మోడల్ ఫోన్ దాదాపు రూ.46 వేలు (3999 చైనా యువాన్లు), 6.9-అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఫోల్డబుల్ పోలెడ్ స్క్రీన్, బట్ విత్ ఏ 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 ఎస్వోసీ చిప్ సెట్, 64-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12-మెగా పిక్సెల్స్ ఆల్ట్రా వైడ్ కెమెరాతో కూడిన డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ఉంటది. సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్స్ కెమెరా కూడా వస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ 4200 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉండటంతోపాటు వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ మీద ఐపీ52 రేటింగ్ ఉంటుంది. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu