Ad Code

డేటా లీక్ అయినట్లు అనిపిస్తుందా ?


ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచాన్ని మన అరచేతిలోకి తీసుకొచ్చింది. అయితే ఇందులో వెబ్ బ్రౌజర్లు, సెర్చ్ ఇంజన్లు యాక్సెస్ చేయలేని ఒక పార్ట్ ఉంటుంది. అదే డార్క్ వెబ్ సైట్. ఇది చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు డార్క్ వెబ్ వేదికగా నిలుస్తుంది. ఇలాంటి హానికరమైన ప్లాట్‌పామ్‌లో యూజర్ల డేటా లీకైతే.. వారి సెక్యూరిటీ, ప్రైవసీకి పెద్ద ముప్పు ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.. హ్యాకర్లు యూజర్ల డేటాను దొంగలించి వాటిని ఇల్లీగల్ మార్కెట్‌గా పని చేసే డార్క్ వెబ్‌లో ఎక్కువ డబ్బులకు అమ్ముకుంటారు. ఆ డేటాలో యూజర్ల క్రెడిట్ కార్డు, బ్యాంకు అకౌంట్ వంటి ఫైనాన్షియల్, ఫొటోలు, వీడియోల వంటి పర్సనల్ డీటేల్స్ ఉండే అవకాశం ఉంది. ఆ డేటా కొనుగోలు చేసిన వారు యూజర్ల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసే ఛాన్స్ ఉంది. వారి పర్సనల్ డేటాతో అక్రమాలకు పాల్పడవచ్చు.. ఇలాంటి ప్రమాదం తమకు ఎదురయ్యే అవకాశం ఉందా అనేది తెలుసుకోవడానికి యూజర్లు కొన్ని టూల్స్ ఉపయోగించి.. తమ పర్సనల్ డేటా డార్క్ వెబ్‌లో లీక్ అయిందో లేదో చెక్ చేసుకోవచ్చు. యూజర్ తమ ఈ-మెయిల్ అడ్రస్‌ నుంచి ఫైనాన్షియల్ డేటా వరకు డార్క్ వెబ్‌లో సర్క్యులేట్ అవుతుందో లేదో చెక్ చేయడానికి F-Secure Have I Been Pwned వంటి టూల్స్ వినియోగించవచ్చు. లేదంటే ఈజీగా https://www.f-secure.com/en/identity-theft-checker లింక్‌పై క్లిక్ చేస్తే చాలా నేరుగా యూజర్లు తమ డేటా లీక్ అయిందో లేదో తెలుసుకోవచ్చు. యూజర్లు ఈ టూల్స్‌లో ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేయాలి.. తరువాత ఆ అకౌంట్ డేటా లీక్ అయిందో లేదో చూడటానికి ఈ టూల్స్ తమ డేటాబేస్‌లను చూపిస్తుంది. అనంతరం రిజల్ట్స్ డిస్‌ప్లే చేస్తాయి. ఈ ఫలితాలలో యూజర్ డేటా డార్క్ వెబ్‌లో సర్క్యులేట్ అవుతున్నట్లు తేలితే పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ డేటా కచ్చితంగా అక్రమాలకు వినియోగించారని లేదా వేరే వారికి విక్రయించినట్లు అర్థం కాదు. అయినప్పటికీ, ముందు జాగ్రత్త చర్యగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ప్రధానంగా ఈమెయిల్ అకౌంట్‌తో లింక్ అయిన పాస్‌వర్డ్‌లను, డేటా బ్రీచ్ ద్వారా ప్రభావితమై ఏవైనా అకౌంట్స్‌ను వెంటనే మార్చుకోవాలి. పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చడం వల్ల ఇతరులు ఎవరూ వాటిని యాక్సెస్ చేయలేరు. డేటా లీక్ అయినా సరే పాస్‌వర్డ్‌లను మార్చడం ద్వారా ప్రమాదం నుంచి బయటపడవచ్చు.  https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu