సోషల్ మీడియా దిగ్గజం మెటా, తన ప్లాట్‌ఫామ్స్‌లో ఏఐ చాట్‌బాట్‌లను ఇంటిగ్రేట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. కంపెనీ ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఏఐ చాట్‌బాట్‌ను పరిచయం చేయనుందని సూచించే స్క్రీన్‌షాట్‌ను అలెశాండ్రో పలుజ్జీ అనే లీకర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ ఫీచర్‌కు సంబంధించి మెటా ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇన్‌స్టాగ్రామ్ ఈ ఫీచర్‌ను ఎప్పుడు లాంచ్ చేస్తుందనే వివరాలను సైతం లీకర్ తాజా ట్వీట్‌లో వెల్లడించలేదు. కానీ ఏఐ చాట్‌బాట్స్ విషయంలో కంపెనీ గతంలో చేసిన ప్రకటనలకు లేటెస్ట్ ఫీచర్ సరిపోయేలా ఉంది. కొత్త ఫీచర్ పనితీరును అలెశాండ్రో షేర్ చేసిన ఇమేజ్ సూచిస్తోంది. ఈ చాట్‌బాట్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలదు, సలహాలు ఇవ్వగలదు. మెసేజ్‌లను రాసే కెపాసిటీ కూడా దీనికి ఉంటుంది. ఈ ఫీచర్‌తో యూజర్లు 30 ఏఐ పర్సనాలిటీలను సెలక్ట్ చేసి, వారు ఏది బాగా ఇష్టపడతారో తెలుసుకోవచ్చు. ఈ ఫిబ్రవరిలో మోటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఒక సందర్భంలో మాట్లాడుతూ.. కంపెనీ వివిధ మార్గాల్లో ప్రజలకు సహాయపడే ఏఐ టూల్స్ అభివృద్ధి చేస్తోందని చెప్పారు. వాట్సాప్, మెసెంజర్‌లో టెక్స్ట్ చాట్ కన్వర్జేషన్స్ కోసం చాట్‌బాట్‌లను యాక్సెస్ చేసే మార్గాలను కంపెనీ అన్వేషిస్తోందని పేర్కొన్నారు. మరోవైపు, ట్విట్వర్‌కు పోటీగా ఇన్‌స్టాగ్రామ్ ఒక షార్ట్ మెసేజింగ్ పోర్టల్‌ను తీసుకురానుంది. జూన్ చివరి నాటికి ఇది లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నారు. ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ కూడా దీనిపై దృష్టి పెట్టాయి. ఈ ఫిబ్రవరిలో స్నాప్‌చాట్ 'My AI' అనే సొంత చాట్‌బాట్‌ను ప్రారంభించింది. ఇది OpenAI డెవలప్ చేసిన ChatGPT బేస్ట్ టూల్. అయితే ఈ టూల్స్ డెవలప్‌మెంట్‌లో కంపెనీలకు సవాళ్లు ఎదురుకానున్నాయి. ఎంగేజింగ్ చాట్‌బాట్‌ను అభివృద్ధి చేయడంతో పాటు ఈ బాట్స్ ప్రమాదకర లేదా అఫెన్సివ్ ఇంటరాక్షన్స్‌లో పాల్గొనకుండా చూసుకోవాలి.offerbazar24/7
0 Comments