Ad Code

ఓలా ఎలక్ట్రిక్ కారు ?

                                               

ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో దుమ్మురేపుతోన్న ఓలా కంపెనీ ఇకపై కార్ల విభాగంపై దృష్టి పెట్టబోతోంది. కొత్త కారును లాంచ్ చేయడానికి రెడీ అవుతోంది. కంపెనీ చాలా రోజుల నుంచే ఈ ఎలక్ట్రిక్ కారుపై పని చేస్తూ వస్తోంది.  తాజాగా ఓలా ఎలక్ట్రిక్ కారు డిజైన్ ఆన్‌లైన్‌లో లీక్ అయ్యింది. ఓలా కారు చూడటానికి అదిరిపోయింది. స్లైలిస్ డిజైన్‌తో అదరగొడుతోంది. ఓలా ఎలక్ట్రిక్ కారు చూడటానికి టస్లా మోడళ్ల మాదిరి కనిపిస్తోంది. మోడల్ ఎస్, మోడల్ 3 మాదిరి ఓలా కారు కూడా కనిపిస్తోంది. ఏరో డిజైన్‌తో కారు కనిపిస్తుంది. స్కల్‌ప్టెడ్ హుడ్, ఫ్లస్ టైప్ డోర్ హ్యాండిల్స్, కెమెరా బేస్డ్ ఓఆర్‌వీఎంలు, ఫ్రంట్ ఫెండర్స్‌పై ఎయిర్ వెంట్ వంటివి గమనించొచ్చు. ఇందులో స్లీక్ హెడ్ ల్యాంప్స్, షార్ప్ ఫ్రంట్ స్ల్పిట్టర్, ఫ్రంట్ బంపర్‌పై వెర్టికల్ ఎయిర్ కర్టైన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్ కారు వచ్చే ఏడాదిలో మార్కెట్‌లో వచ్చే ఛాన్స్ ఉంది. కాగా ఈ కారు ఇంటీరియర్ ఎలా ఉండబోతోందో తెలియడం లేదు. రానున్న రోజుల్లో ఈ వివరాలు కూడా వెల్లడి కానున్నాయి. కంపెనీ ఈ కొత్త కారులో 70- 80 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అంటే ఒక్కసారి చార్జ్ చేస్తే కారు ఏకంగా 500 కిలోమీటర్లకు పైగా వెళ్లొచ్చు. అలాగే ఈ కారు 0 - 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4 సెకన్లలోనే అందుకునే ఛాన్స్ ఉంది. అంటే ఈ కారును పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ మెషీన్‌గా చెప్పుకోవచ్చు. అంటే సాధారణ ప్రజలకు ఈ కారు అనువుగా ఉండకపోవచ్చు. అలాగే ఈ కొత్త ఓలా కారు ధర కూడా ఎక్కువగానే ఉండొచ్చు. ధర రూ. 25 లక్షలకు పైనే ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.  https://t.me/offerbazaramzon 

Post a Comment

0 Comments

Close Menu