Ad Code

ఉద్యోగులు బయటికి వెళ్లకుండా తాళాలు : కోడింగ్ నింజాస్ నిర్వాకం !


హర్యానాలోని గురుగ్రామ్లో కోడింగ్ నింజాస్ అనే ఎడ్టెక్ కంపెనీ చేసిన నిర్వాకంపై నెటిజన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ కంపెనీ తమ ఉద్యోగులను ఆఫీస్ నుంచి బయటకు వెళ్లకుండా తాళాలు వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో వాచ్మెన్ ఆఫీస్ మెయిన్ డోర్కు తాళాలు వేస్తుంటాడు. అదేంటని ఉద్యోగులు ప్రశ్నిస్తే 'పర్మిషన్ లేకుండా ఎంప్లాయిస్ బయటికి వెళ్లడానికి వీళ్లేదని మెనేజర్ చెప్పారు. అందుకే తాళం వేస్తున్నా. బయటికి వెళ్లాలంటే పర్మిషన్ తెచ్చుకోండి' అంటూ సమాధానం ఇచ్చాడు. దీనికి సంబంధిచిన వీడియో ఎంప్లాయిస్ అంతా సోషల్ మీడియాలో షేర్ చేయగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో చూసినవాళ్లంతా విమర్శిస్తున్నారు. కార్పొరేట్ వ్యవస్థ రోజురోజుకు దిగజారుతోందని.. అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రైవసీ, ఫ్రీడమ్ లేకుండా పోతోందని కామెంట్స్ చేస్తున్నారు. వీడియో వివాదాస్పదంగా మారడంతో కోడింగ్ నింజాస్ కంపెనీ వివరణ ఇచ్చింది. మేము ఉద్దేశపూర్వకంగా ఈ పనిచేయలేదు. మా ఇతర బ్రాంచ్లో ఓ ఉద్యోగి చేసిన చర్య వల్ల.. ఈ బ్రాంచ్లో ఇలా చేయాల్సొచ్చింది. దీన్ని కొద్ధి నిమిషాల్లోనే సరిదిద్దాం. ఆ ఉద్యోగి చేసిన తప్పుకు సారీ కూడా చెప్పాడు. ప్రస్తుతం జరిగిన ఘటనతో ఉద్యోగులకు కలిగిన అసౌకర్యానికి కంపెనీ వ్యవస్థాపకులు విచారం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు సారీ కూడా చెప్పారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూసుకుంటాం' అంటూ రిప్లై ఇచ్చారు. 

Post a Comment

0 Comments

Close Menu