Ad Code

ఏఐ టెక్నాలజీ మహిమతో ఎలన్ మస్క్ భారతీయ వరుడు వస్త్రధారణ !


భారతీయ వస్త్రధారణతో వరుడు గెటప్ లో మస్క్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. మస్క్ ఏం చేసినా సంచలనమే. అటువంటి మస్క్ ఇదేంటీ భారతీయ వస్త్రధారణలో అని ఆశ్చర్యపోతాం. ఇదంతా టెక్నాలజీ మహిమ అని తెలిసి వారెవ్వా అనుకునేలా ఉన్నాయి మస్క్ కస్తూరి షేర్వాణీతో వరుడు గెటప్ ఫోటోలు..షేర్వాణీలో తెగ మెరిసిపోతున్న ఎలాన్ మస్క్ ఫోటోలు artificial intelligence పనితనానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి ! భారతీయ వేడుకల్లో షేర్వాణీలు సర్వసాధారణంగా మారిపోయాయి. అటువంటి షెర్వాణీలో మస్క్ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్నారు ప్రపంచ కుబేరుడు, టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్. ఈ మేధావి ఒక్కసారిగా భారతీయుడిగా మారిపోతే ఎలా ఉంటుందో ఊహించుకోవటమేకాదు కళ్లముందు చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నాడు ఏఐ టెక్నాలజీ మహిమతో. ఎలాన్ మస్క్ కస్తూరి షేర్వాణీ ధరించి..పెళ్లికి వచ్చిన అతిథులతో కలిసి డ్యాన్స్ చేస్తూ, గుర్రపు స్వారీ చేస్తున్నట్లుగా ఉంది. ఇంకా రకరకాల కలర్స్ షేర్వాణీల లుక్ లో మస్క్ మస్తుగున్నాడు. చూశారా మరి ఎలా ఉంది మన ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ కొత్త లుక్..? దీన్ని సిడ్నీకి చెందిన ఓ ఆర్టిస్ట్ షేర్ చేశారు. ఏఐ సాయంతో భారతీయ వస్త్రధారణతో, కాబోయే వరుడి రూపంలో మస్క్ దర్శనమిస్తున్నారు.అద్దిరిపోతున్న ఈ ఫోటోపై మస్క్ కూడా అదే స్టైల్లో స్పందించారు. ఐ లవ్ ఇట్  అంటూ రిప్లయ్ ఇచ్చారు. ఇటీవలి కాలంలో ఏఐ టెక్నాలజీ సాయంతో వ్యక్తుల చిత్రాలను మార్ఫింగ్ చేస్తుండటం చూస్తునే ఉన్నాం. కొన్ని రోజుల క్రితం శ్రీరాముడు 21 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు ఎంత అందంగా ఉండేవాడో అని ఊహించుకుంటే కళ్లముందు కదలాడే రూపాన్ని ఏఐ సహాయంతో క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ట్విట్టర్ బాస్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారతీయ వరుడు గెటప్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఏఐ టెక్నాలజీ ఇప్పుడు యువకులుగా ఉన్నవారు వృద్ధాప్యంలో ఎలా ఉంటారు.. వృద్ధాప్యంలో ఉన్న వారు యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవారో కళ్లముందుకు తెస్తోంది.అలా ఏఐ సహాయంతో ఎలాన్ మస్క్ ను షెలాన్ మస్క్ భారతీయ వస్త్రధారణలో అచ్చమైన పంజాబీలా ఉన్నాడంటూ ఓ వ్యక్తి పేర్కొన్నారు..

Post a Comment

0 Comments

Close Menu