Ad Code

11 ఏళ్ల తర్వాత ట్విట్టర్ లో జుకర్ బర్గ్ తొలి పోస్ట్ !

                                        


ఫేస్ బుక్ ఫౌండర్, మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ 11 ఏళ్ల తర్వాత ట్విట్టర్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ట్విట్టర్ కు పోటీగా 'థ్రెడ్స్' యాప్ ను తీసుకొచ్చిన సందర్భంగా జుకర్ బర్గ్ ట్విట్టర్ లో ఈ ఉదయం ఓ ఫొటో షేర్ చేశారు. స్పైడర్ మ్యాన్ దుస్తులు ధరించిన వ్యకి అదే దుస్తులు ధరించిన మరొక వ్యక్తిని చూపుతున్నట్టు ఉన్న చిత్రాన్ని షేర్ చేశారు. ఇది 1967లో వచ్చిన స్పైడర్ మ్యాన్ కార్టూన్ 'డబుల్ ఐడెంటిటీ'లోనిది. విలన్ హీరోగా కనిపించేందుకు ప్రయత్నించేలా ఆ చిత్రం ఉంది. అయితే కేవలం కార్టూన్ ఫొటోను మాత్రమే షేర్ చేసిన జుకర్ బర్గ్, దానికి ఎలాంటి క్యాప్షన్ ఇవ్వలేదు. ట్విట్టర్ అధినేత మస్క్ ను ఉద్దేశించే ఆయన ఈ పోస్ట్ షేర్ చేసినట్లు తెలుస్తోంది. కాగా, 2012 జవనరి 18న జుకర్ బర్గ్ చివరి సారిగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన మైక్రోబ్లాగింగ్ సైట్ లో ట్వీట్ చేయడం ఇదే మొదటిసారి.
ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని ట్విట్టర్‌కు పోటీగా ఇటీవల మెటా సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ కొత్త యాప్‌ను తీసుకువస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెటా కొత్త యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. 'థ్రెడ్స్' పేరుతో తీసుకొచ్చిన ఈ టెక్ట్స్ ఆధారిత యాప్ గురువారం నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ ను ప్రారంభించిన తొలి రెండు గంటల్లోనే 20 లక్షల మంది ఇందులో ఖాతాలు తెరవగా, తొలి నాలుగు గంటల్లో ఆ సంఖ్య 50 లక్షలకు పెరిగింది. ఈ విషయాన్ని మెటా సీఈవో జుకర్ బర్గ్ వెల్లడించారు. మెటా తీసుకొచ్చిన ఈ కొత్త 'థ్రెడ్స్' యాప్ ను ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను వినియోగించి లాగిన్‌ చేసుకోవచ్చు. ఇందులో సుమారు వర్డ్స్‌తో లింక్స్‌, ఫొటోలు, ఐదు నిమిషాల నిడివిగల వీడియోలను సైతం పోస్ట్‌ చేసుకోవచ్చు. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu