Ad Code

ఫైర్‌బోల్ట్‌ నుంచి డెస్టినీ స్మార్ట్‌ వాచ్‌ !


ఫైర్‌బోల్ట్‌ మరో కొత్త స్మార్ట్‌ వాచ్‌ను రిలీజ్‌ చేసింది. డెస్టినీ పేరుతో రిలీజ్‌ చేసిన ఈ స్మార్ట్‌ వాచ్‌ కచ్చితంగా యువతను ఆకట్టుకునే డిజైన్‌ చేసినట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. కేవలం రూ.1999కే ఈ వాచ్‌ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు, ఫైర్‌బోల్ట్‌ అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలు సిద్ధంగా ఉంది. ఈ స్మార్ట్‌ వాచ్‌ లేత గోధుమరంగు, నలుపు, పింక్, సిల్వర్ అనే నాలుగు రంగుల ఎంపికలలో అందుబాటులో ఉంది. ఫైర్-బోల్ట్ డెస్టినీ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో చేసిన స్టైలిష్ సర్క్యులర్ డయల్‌ను కలిగి ఉంది. అలాగే ఈ వాచ్‌ మెటాలిక్ స్ట్రాప్‌తో వస్తుంది. అలాగే వాచ్ ఫ్రేమ్ మన్నికైన జింక్ అల్లాయ్ మెటీరియల్‌తో తయారు చేశారు. అయితే బటన్ అల్యూమినియం అల్లాయ్ మెటీరియల్‌తో ఈ వాచ్‌ను తయారు చేశారు. హెచ్‌డీ ప్లస్‌ రిజల్యూషన్‌తో 1.39 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ వాచ్‌ డిస్‌ప్లే 360 x 360 పిక్సెల్ రిజల్యూషన్ కలిగి ఉంది. ఇది స్పష్టమైన మరియు పదునైన విజువల్స్ అందిస్తుంది. బ్లూటూత్ కాలింగ్‌కు మద్దతునిస్తుంది. అంటే ఈ స్మార్ట్‌వాచ్‌లో అంతర్నిర్మిత మైక్రోఫోన్, స్పీకర్ ద్వారా నేరుగా కాల్స్‌ చేసుకునే సదుపాయం ఉంది. ఈ వాచ్ వాయిస్ అసిస్టెంట్లు మరియు ఇతర ఫంక్షన్లకు కూడా మద్దతు ఇస్తుంది. https://t.me/offerbazaramzon


Post a Comment

0 Comments

Close Menu