Ad Code

నెట్‌ఫ్లిక్స్‌లో ప్రొఫైల్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్ !


'నెట్‌ఫ్లిక్స్' యూజర్లకు మెరుగైన ఎక్స్‌పీరియన్స్ అందించడానికి వివిధ చర్యలు తీసుకుంటోంది. తాజాగా ప్రొఫైల్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకునే ఫీచర్‌ని ఇంట్రడ్యూస్ చేసింది. ఒక అకౌంట్ నుంచి మరొక అకౌంట్‌కి సులువుగా ప్రొఫైల్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్.. సెలక్టెడ్‌ కంట్రీస్‌లోని యూజర్లకు మాత్రమే అందుబాటోకి వచ్చింది. త్వరలోనే అన్ని దేశాల యూజర్లకు ఫీచర్‌ని వర్తింపజేయనుంది. నెట్‌ఫ్లిక్స్ తీసుకొచ్చిన పాస్‌వర్డ్ షేరింగ్ ఆప్షన్ సబ్‌స్క్రైబర్లను నిరాశకు గురిచేసింది. ఈ ఫీచర్ కారణంగా నెట్‌ఫ్లిక్స్ పెయిడ్ సబ్‌స్క్రైబర్లు తగ్గిపోయారు. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ సమస్యకు పరిష్కారంగా ఈ ప్రొఫైల్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌ తీసుకొచ్చింది. సాధారణంగా ఒక అకౌంట్‌లో ఉన్న ప్రొఫైల్‌లో వాచ్ హిస్టరీ, ప్లే లిస్ట్, రికమండేషన్స్ ఉంటాయి. కొత్త అకౌంట్‌లో చూడాలంటే మళ్లీ కొత్తగా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రొఫైల్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌తో ఉన్న ప్రొఫైల్‌ని కొత్త అకౌంట్‌కి, లేదా ఎగ్జిస్టింగ్ అకౌంట్‌కి మార్చుకోవచ్చు. దీంతో ఎలాంటి డేటాను కోల్పోకుండా అకౌంట్‌లో నెట్‌ఫ్లిక్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయవచ్చు. రిజిస్టర్ చేసుకున్న ఈమెయిల్, పాస్‌వర్డ్‌తో ప్రొఫైల్‌ని ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. అయితే, ఇప్పటికే కొన్ని దేశాల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ అనుసరించిన ఈ వ్యూహం సత్ఫలితాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో యూజర్ల నుంచి మంచి స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ తెచ్చాక సబ్‌స్క్రైబర్ల కౌంట్ పెరిగినట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. మరికొన్ని నెలల్లో ఈ ఫీచర్‌ని ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొంది. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu