Ad Code

ల్యాప్ టాప్‌లో మల్టీ టాస్కింగ్‌ టిప్ !


నం వాడే డెస్క్ టాప్ లేదా ల్యాప్ టాప్ లో కూడా మల్టీ టాస్కింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. అలాంటప్పుడు మీ స్క్రీన్ మీకు చాలా అమూల్యమైనదిగా ఉంటుంది. స్క్రీన్ పైనే మీరు అనేక రకాల విండోలు ఓపెన్ చేసుకోవాల్సి రావొచ్చు. అలాంటప్పుడు మీకు అవసరమైన విండోను మళ్లీ ఓపెన్ చేసుకోవాలంటే దానిని వెతుక్కోవడం కష్టంగా అనిపిస్తుంది. కానీ కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవడం, కొన్ని టిప్స్ ఫాలో అవడం ద్వారా మీకు బాగా అవసరం అయిన విండోను మీరు ఎప్పుడూ పైన కనిపించే విధంగా పెట్టుకోవచ్చు. అవసరం అయిన విండోను ఎల్లప్పుడూ పైన ఉంచే సామర్థ్యంతో, ల్యాప్‌టాప్ వినియోగదారులు తమ వర్క్‌ఫ్లోలను క్రమబద్ధీకరించుకోవడం సులభం అవుతుంది. అప్లికేషన్‌లను నిరంతరం మార్చుకోకుండా అత్యంత క్లిష్టమైన పనులపై దృష్టి పెట్టగలరు. దీనిని ఎలా మార్చుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.. మీరు విండోస్ ఓస్ లేదా మాక్ ఓఎస్ ఏ వినియోగదారుడైన మల్టీ టాస్కింగ్ ను సులభతరం చేసే విధానం అందుబాటులో ఉంది. ఈ టెక్నిక్ ని వినియోగించి మీరు మీ ల్యాప్ టాప్ స్క్రీన్ చాలా సమర్థంగా వినియోగించుకోగలుగుతారు. విండోస్ ఓఎస్ వాడే వినియోగదారులు ఆల్వేస్ ఆన్ టాప్ విండోస్ ఫీచర్ కోసం ఎటువంటి థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ లను వినియోగించాల్సిన అవసరం లేదు. ముందుగా మీకు కావాల్సిన విండోను ఎంపిక చేసుకోవాలి. అందుకోసం ఆ విండో టైటిల్ బార్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత కీ బోర్డు ను వినియోగించి “Alt” + “Spacebar” నొక్కాలి. అప్పుడు విండో మెనూ ఓపెన్ అవుతుంది. ఆ విండోను టాప్ లో ఉంచడానికి మెనూ లో నుంచి ఆల్వేస్ ఆన్ టాప్ అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి. అంతే మీకు కావాల్సిన విండో ఎప్పుడూ మీకు పైనే కనిపిస్తుంది.

విండోస్ ఓఎస్ కు ఉన్నట్లు మ్యాక్ ఓఎస్ కి బిల్ట్ ఇన్ ఆల్వేస్ ఆన్ టాప్ ఫీచర్ అందుబాటులో లేదు. దీనిని వినియోగించుకోవాలంటే థర్డ్ పార్టీ అప్లికేషన్ ను వినియోగించుకోవాల్సి ఉంటుంది. థర్డ్ పార్టీ యాప్ ను ఇన్ స్టాల్ చేసిన తర్వాత మీ కావాల్సిన విండోను స్రీన్ పై కి డ్రాగ్ చేయాలి. అది టాప్ లో సెట్ అయ్యే వరకూ దానిని అలాగే డ్రాగ్ చేస్తూ ఉండాలి. అంతే అది అన్నింటికన్నా పైన మీకు కనిపిస్తుంది. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu