Ad Code

జియో ఛాయిస్‌ స్కీమ్‌ !


టెలికాం రంగంలోకి జియో ప్రవేశంతోనే ఎన్నో కీలక పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.  ఒకప్పుడు టెలికాం రంగంలో అన్‌లిమిటెడ్ అనే మాట చాలా తక్కువగా వినిపించేంది. అదే జియో రంగప్రవేశంతో టెలికాం రంగంలో చాలా మార్పులు జరిగాయి. 4G ఇంటర్‌నెట్‌ సహా తక్కువ ధరకే అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, ఇంటర్నెట్‌ వినియోగించుకొనే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం 5Gను దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జియో ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే దేశంలోని కీలక నగరాలు, పట్టణాలకు 5G సౌకర్యం అందుబాటులో ఉంది. తాజాగా జియో ఛాయస్ పేరిట ఓ కొత్త స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కీమ్‌లో భాగంగా మనకు నచ్చిన నంబర్లను ఫోన్‌ నంబర్‌గా ఎంచుకోవచ్చు. అంటే కొత్త జియో ఫోన్‌ నంబర్‌లోని చివరి 4 నుంచి 6 అంకెలను ఎంచుకోవచ్చు. ఉదాహరణకు మీది లేదా మీకు నచ్చిన వ్యక్తి పుట్టినరోజు 15-10-1999  అనుకుందాం. ఈ అంకెలతో కొత్త జియో నంబర్‌ తీసుకోవాలి అంటే జియో ఛాయిస్‌ స్కీమ్‌ కింద మీ కొత్త ఫోన్‌ నంబర్‌లోని చివరి అంకెలను 101999గా ఎంచుకోవచ్చు. పుట్టినరోజునే కాకుండా ఇతర అదృష్ట సంఖ్యలు లేదా కారు, బైక్‌ నంబర్లను ఈ కొత్త ఫోన్‌ నంబర్‌ చివరి 4 నుంచి 6 అంకెలుగా ఎంచుకోవచ్చు. ముందుగా జియో అధికారిక వెబ్‌సైట్‌ Jio.comను సందర్శించాలి. అనంతరం సెల్ఫ్‌ కేర్‌ విభాగంలోకి వెళ్లండి. అనంతరం Jio Choice వద్దకు వెళ్లండి. అక్కడ మీకు కావాల్సిన 4 నుంచి 6 అంకెలను నమోదు చేయండి. మరియు అక్కడే సిమ్‌ ప్రీపెయిడ్‌ లేదా పోస్ట్‌ పెయిడ్‌ ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. అనంతరం చెల్లింపుల విభాగానికి వెళ్లి రూ.499 చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం 24 గంటల్లో మీ కొత్త జియో ఫోన్‌ నంబర్‌ యాక్టివేట్‌ చేయబడుతుంది. అలాగే మన ఫోన్‌లో ఉన్న జియో యాప్‌ నుంచి కూడా జియా ఛాయిస్‌ స్కీమ్‌ను ఉపయోగించుకోవచ్చు. జియో ఛాయిస్‌ విభాగంలోని వెళ్లి నచ్చిన నంబర్‌ను ఎంటర్‌ చేసి, చెల్లింపులు చేయాలి. అనంతరం 24 గంటల్లో నంబర్‌ యాక్టివేట్‌ అవుతుంది. https://t.me/offerbazaramzon


Post a Comment

0 Comments

Close Menu